సామాన్యులకు తన జీవితంలో ఎదురైన కష్టాలను తీరుస్తున్న ముఖ్యమంత్రిని అమ్మవారు మరింతగా దీవించాలి



ఇంద్రకీలాద్రి: అక్టోబర్ 4 (ప్రజా అమరావతి);


సామాన్యులకు తన జీవితంలో ఎదురైన కష్టాలను తీరుస్తున్న ముఖ్యమంత్రిని అమ్మవారు మరింతగా దీవించాల


ని  సమాచార, బీసీ సంక్షేమ, సినిమాఆటోగ్రఫీ శాఖ మంత్రి, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ కోరారు.


మంగళవారం మహిషాసుర మర్దని అవతారంలో ఉన్న అమ్మవారిని సమాచార, బీసీ సంక్షేమ, సినిమాఆటోగ్రఫీ శాఖ మంత్రి, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ దర్శించుకున్నారు. ఆలయ వేద పండితులు ఆశీర్వచనం పలికి అమ్మవారి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను మంత్రికి అందజేశారు. అనంతరం మీడియా పాయింట్ చేరుకున్న మంత్రి  మాట్లాడుతూ క్షణం మాత్రం దర్శనం ద్వారా అమ్మ అనుగ్రహం పొందుతామని, విశ్వమంతా ఆవహించిన శక్తి ధర్మరక్షణ ద్వారా ఈ సమస్త విశ్వాన్ని రక్షించే తల్లిగా, ప్రభుత్వం పైన విషం చిమ్మే వేషదారుల నుండి  రక్షించాలని ప్రార్థించినట్లు తెలిపారు.  ఈ రాష్ట్రంలో ధర్మపాలన జరుగుతున్న తరుణంలో అధర్మాన్ని అజెండాగా ఎంచుకొని పాలించిన పాలకులు ప్రజలకు జరిగే మంచిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాల ద్వారా అమ్మను ఆరాధించే భక్తులకు ఒక భద్రతా, భరోసా వారు చేసే ప్రయాణం ఉన్నత స్థానానికి చేరుకునేలా కాపాడాలన్నారు. అభివృద్ధి అడ్డుపడుతున్న వారి  రాక్షతత్వాన్ని నుండి సామాన్యులకు భద్రత కలిగే విధంగా  రక్షించాలని కోరుకున్నట్లు తెలిపారు.


Comments