విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలను అమలు చేస్తున్న ప్రభుత్వం

 *విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలను అమలు చేస్తున్న ప్రభుత్వం*


*రాష్ట్ర పాఠశాల విద్య శాఖ స్పెషల్ సి.ఎస్. బుడితి రాజశేఖర్*


అమరావతి, అక్టోబరు 10 (ప్రజా అమరావతి):  మన రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలను  పెద్ద ఎత్తున అమలు చేస్తున్న ఫలితంగా ప్రపంచ బ్యాంకు ఎటు వంటి షరతులు లేకుండా  250 మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగిందని రాష్ట్ర పాఠశాల విద్య శాఖ స్పెషల్ సి.ఎస్. బుడితి రాజశేఖర్ తెలిపారు. సోమవారం అమరావతి సచివాలయం నాల్గో బ్లాక్ లో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అమలు పరుస్తున్న పలు విద్యా సంస్కరణలు, వాటి వల్ల విద్యార్థులకు ఒనగూరుచున్న ప్రయోజనాలను వివరించారు. రాష్ట్రంలో నాడు-నేడు పథకం క్రింద పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయంతో నిర్వహించడం జరుగుచున్నదన్నారు. సాల్ట్ (SALT-Supporting AP Learning Transformation) ప్రాజెక్టు కింద ప్రపంచ బ్యాంకు 250 మిలియన్ డాలర్ల ఆర్ధిక సాయాన్ని అందిస్తోందని, ఈ రుణం కోసం ప్రపంచ బ్యాంకు ఎలాంటి షరతులూ విధించలేదు అని ఆయన స్పష్టం చేశారు.  ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయంతో పాఠశాల విద్యాశాఖలో చేపట్టిన తొలి ప్రాజెక్టు ఇదేనని ఆయన తెలిపారు.  పాఠశాలల విలీనం,  ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ లాంటి విషయాల్లో ప్రపంచ బ్యాంకు  షరతులు పెట్టిందనటం అవాస్తవ మన్నారు. గడచిన మూడేళ్లలో పాఠశాల విద్యాశాఖలో రూ. 53 వేల కోట్లకు పైగా వ్యయం చేశామని,  అమ్మ ఒడి పథకానికి రూ.19,617 కోట్లు, నాడు నేడు తొలిదశకు రూ.3 వేల కోట్లకు పైగా వ్యయం అయ్యిందని ఆయన తెలిపారు. పాఠశాల విద్య లాంటి సామాజిక రంగంలో ఒక్కరోజులోనే ఫలితాలు ఏమీ రావనే విషయాన్ని గుర్తించాలని, క్రమంగా ఐదు, పది సంవత్సరాల్లో ఆ ఫలితాలు కనిపిస్తాయన్నారు. 

2022-23 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ  పాఠశాలల్లో విద్యార్ధుల సంఖ్య 40,31,239 గా నమోదైందని, కిందటి ఏడాదితో పోలిస్తే ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ విద్యా సంస్థలు అన్నింటినీ కలుపుకుని మొత్తం ఈసారి 86,119 మంది విద్యార్ధులు మాత్రమే తగ్గారని ఆయన స్పష్టంచేశారు.  అయితే ఇందుకు కారణాలను కూడా విశ్లేషించడం జరిగిందని, ఇతర రాష్ట్రాలకు వలస పోయిన విద్యార్థులు 16 వేల 857 అని, కాలానుగుణంగా  రాష్ట్రంలోనే ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వలసపోయిన వారు 38 వేల 951 మంది విద్యార్థులు అని, 1289 మంది విద్యార్థులు మరణించినట్లుగా గుర్తించడమైందన్నారు. అదే విధంగా రాష్ట్రంలో కూడా జనాభా పెరుగుదల తగ్గడంతో ఒకటో తరగతిలో చేరే విద్యార్థుల సంఖ్య కూడా గత విద్యా సంవత్సరంతో పోల్చు కుంటే  29 వేల 102 తగ్గినట్లు గుర్తించడమైందన్నారు.  రాష్ట్రంలో ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వలసపోయిన 38 వేల 951 మంది విద్యార్థులను గుర్తించి వారిని పాఠశాలల్లో చేర్పించేందుకు వారి వివరాలను అన్ని జిల్లాల కలెక్టర్లకు పంపించడం జరిగిందని, ఇప్పటికే దాదాపు 12 వేల మంది విద్యార్థులను తిరిగి పాఠశాలల్లో జేర్పించడం జరిగిందని ఆయన వివరించారు. 


రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, ఆంగ్లమాద్యమంలో బోధన తో విద్యార్ధుల సంఖ్య ఏ మాత్రం తగ్గ లేదని ఆయన తెలిపారు.  ఆంగ్లాన్ని నేర్పే అంశంపై త్వరలోనే  అన్ని పాఠశాలలకూ ఎస్ఓపీ ని జారీ చేస్తామని, నవంబరు నెలాఖరు నాటికి 8 తరగతి చదువుతున్న 4.6 లక్షల మంది విద్యార్ధులకు ట్యాబ్ లను కూడా  పంపిణీ చేస్తామని ఆయన తెలిపారు. 2025 నాటికి వీరంతా సీబీఎస్ఈ విధానంలో పరీక్షలు రాస్తారన్నారు. 


రాష్ట్ర విభజన తదుపరి 2014-15  విద్యా సంవత్సరంలో ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ విద్యా సంస్థలు అన్నింటినీ కలుపుకుని మొత్తం 75 లక్షల 32 వేల 771 మంది  విద్యార్థులు పాఠశాల విద్యను అభ్యసిస్తుండగా,  ప్రస్తుత విద్యా సంవత్సరం (2022-23) లో నేటికి  71 లక్షల 59 వేల 441 మంది విద్యార్థులు ఉన్నారన్నారు. అదే విధంగా 2015-16 విద్యా సంస్థత్సరంలో 69 లక్షల 7వేల 4 విద్యార్థులు, 2016-17 లో 68 లక్షల 48 వేల 197 విద్యార్థులు,  2017-18లో 69 లక్షల 75 వేల 526 విద్యార్థులు,  2018-19 లో 70 లక్షల 43 వేల 71 విద్యార్థులు, 2019-20 లో 72 లక్షల 43 వేల 269 విద్యార్థులు,  2020-21లో 73 లక్షల 12 వేల 852 విద్యార్థులు మరియు 2021-22లో 72 లక్షల 45 వేల 640  విద్యార్థులు పాఠశాల విద్యను అభ్యసించినట్లు ఆయన తెలిపారు. ఈ విధంగా ప్రతి ఏడాది  విద్యార్థుల గణాంకాల్లో హెచ్చుతగ్గులు సహజంగా ఉన్నాయని, అయితే గత విద్యా సంవత్సరంతో పోల్చుకుంటే ఈ ఏడాది 86 వేల 199 మంది విద్యార్థుల తగ్గుదల ఉన్నట్లు గుర్తించినట్లు ఆయన తెలిపారు.  


అదే విధంగా 2014-15 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో 41 లక్షల 83 వేల 441 మంది విద్యార్థులు పాఠశాల విద్యను అభ్యసించగా ఆ సంఖ్య 2018-19 వరకూ తగ్గుతూ రాగ,  తిరిగి 2019-20 విద్యా సంవత్సరం నుండి విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వచ్చిందని, 2021-22 విద్యా సంవత్సరంలో 44 లక్షల 29 వేల 569  విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరగా నేడు 40 లక్షల 31 వేల 239 విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నారన్నారు. కోవిడ్ విపత్తు వల్ల చాలా మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలను వదిలి ప్రభుత్వ పాఠశాలలో చేరారని, ఆ విపత్తు తగ్గిపోవడం కారణంగా కొంత మంది విద్యార్థులు తిరిగి ప్రైవేటు పాఠశాలల్లో చేరడం జరిగిందన్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ది పర్చడం వల్ల ఇంకా చాలా మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలకు తిరిగి వెళ్లకుండా ప్రభుత్వ పాఠశాలల్లోనే కొనసాగుతున్నారని ఆయన తెలిపారు.  


పాఠశాల విద్యా శాఖ జాయింట్  డైరెక్టర్  ఎం.రామలింగం, ప్రభుత్వ పరీక్షల సంచాలకులు డి.దేవేంద్రరెడ్డి  ఈ సమావేశంలో పాల్గొన్నారు. 


 

Comments
Popular posts
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది.
Image
ఇంటర్నెట్‌లో గూగుల్ సెర్చ్‌లో సైబర్ క్రైమ్ కేసులు పెరుగుతున్నాయి.
Image
న్యాయప్రక్రియకు..రాజ్యాంగపరమైన చట్టాలకు లోబడి వికేంద్రీకరణ చేయబోతున్నాం.
Image
*ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
Image
ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు
Image