. తిరుపతి
19 అక్టోబరు (ప్రజా అమరావతి);
శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్ బుధవారం రాత్రి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.
ఆలయం వద్దకు చేరుకున్న కేంద్ర మంత్రికి టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. ఆలయంలో అమ్మవారి దర్శనం అనంతరం అర్చకులు శ్రీమతి నిర్మల
సీతారామన్ కు తీర్థప్రసాదాలు అందించారు.
రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి శ్రీ బుగ్గన రాజేంద్ర నాథ రెడ్డి, తిరుపతి ఎంపి డాక్టర్ గురుమూర్తి, జే సి డి కే బాలాజీ, ఆలయ డిప్యూటి ఈవో శ్రీ లోకనాథం తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment