తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు



*- తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు* 

 *- తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్* 


 గుడివాడ, అక్టోబర్ 3 (ప్రజా అమరావతి): తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం కృష్ణా జిల్లా గుడివాడలో శిష్ట్లా లోహిత్ ఒక ప్రకటన విడుదల చేశారు. హిందువుల ముఖ్యమైన పండుగల్లో దసరా పండుగ ఒకటని అన్నారు. దుష్టశక్తులపై దైవ శక్తుల విజయానికి ప్రత్యేక దసరా పండుగ అని అన్నారు. లోక కంఠకుడైన మహిషాసురుడిని  జగన్మాత దుర్గాదేవి సంహరించిందని అన్నారు. దేవీ నవరాత్రులు, పదో రోజు విజయదశమి కలిసి దసరా పండుగగా జరుపుకుంటారని తెలిపారు. ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఆలయాల్లో అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తారని అన్నారు. చరిత్ర ప్రకారం  రాముడు రావణుడుపై గెలిచిన సందర్భంతో పాటు, పాండవులు వనవాసానికి వెళ్తూ జమ్మి చెట్టుపై ఉంచిన తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజుగా విజయదశమిని అభివర్ణిస్తుంటారని అన్నారు.  

దుర్గాదేవి ఆశీస్సులతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు సుఖశాంతులు, సిరిసంపదలతో వెలసిల్లాలని ఆకాంక్షించారు. జగన్మాత దుర్గాదేవి దీవెనలు తెలుగు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నారు. ప్రజలందరికీ దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. దుర్గామాత ఆశీస్సులతో గుడివాడ నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలని శిష్ట్లా లోహిత్ ప్రార్థించారు.

Comments