పెడన: అక్టోబరు 12 (ప్రజా అమరావతి);
*మంచి చేస్తున్న జగనన్నను మనసారా దీవించండి*
*---- మంత్రి జోగి రమేష్*
ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజల సంక్షేమాభివృద్ధికి కృషి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రజలందరూ మనసారా దీవించాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు.
బుధవారం ఆయన పెడన మండలంలోని పెనుమల్లి గ్రామ సచివాలయం పరిధిలోగల శేరివత్తర్లపల్లి, దిరిశవల్లి, మర్రిగుంట, చినపుల్లపాడు గ్రామాల్లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నవరత్నాల పథకాల లబ్ధిని లబ్ధిదారులకు వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో వాటిని పూర్తిగా అమలు పరచడంతో పాటు ఇవ్వని హామీలు సైతం నెరవేర్చారని అన్నారు. సంక్షేమ ఫలాలను అందించడంలో ఎలాంటి పక్షపాతం చూపలేదన్నారు. నవరత్నాల పథకాల అమలులో జవాబుదారీతనం కోసం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్నారన్నారు. అర్హత ఉండి పథకాల లబ్ధిని పొందలేని వారు ఉంటే సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల సమక్షంలో అర్హులకు న్యాయం చేయాలని ప్రజా ప్రతినిధులను ప్రజల వద్దకు పంపుతూ ముఖ్యమంత్రి ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారన్నారు. అన్ని విధాలుగా ప్రజల బాగోగులు చూసుకుంటున్న మన ముఖ్యమంత్రి జగనన్నను మనసారా దీవించాలని మంత్రి ప్రజలను కోరారు.
గ్రామంలో ఉన్న సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. మంచినీటి పైపులైను, రోడ్ల నిర్మాణంతో పాటు వర్షాకాలంలో నీరు బయటకు పోవడానికి డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరించాలని మంత్రిని కోరారు. ఈ విషయమై సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరలో సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి వారికి హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కృత్తివెన్ను జడ్పిటిసి మైలా రత్నకుమారి, పెడన ఎంపీపీ రాజులపాటి వాణి, పెడన మార్కెట్ యార్డ్ చైర్మన్ గరికిపాటి చారుమతి రామానాయుడు, గ్రామ సర్పంచ్ ఊస వెంకటేశ్వరరావు, డీఆర్డిఏ ఏరియా కోఆర్డినేటర్ కనకారావు, వివిధ శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, వైయస్సార్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment