జిల్లాలో మైన్స్ రంగానికి తగిన విధంగా ప్రోత్సహం అందించడం జరుగుతుంది



రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి): 



జిల్లాలో  మైన్స్ రంగానికి తగిన విధంగా ప్రోత్సహం అందించడం జరుగుతుంద


ని, ఆ దిశలో ప్రభుత్వ మార్గదర్శకాలు మేరకు వాటి నిర్వహణ చేపట్టవలసి ఉంటుందనీ జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు.



గురువారం రాత్రి కలెక్టరేట్ సమావేశ మందిరంలో తూర్పుగోదావరి జిల్లాలో  నాన్ ఆపరేషనల్ మైనర్ మినరల్ లీజు హోల్డర్స్‌తో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, జిల్లా పరిధిలో పర్యావరణ అనుమతులకు లోబడి మంజూరు చేసిన యూనిట్స్ కార్యకలాపాలు నిర్వహించాలని పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్విరాన్మెంట్ బోర్డ్ కు త్వరితగతిన ఈ సి లు జారీ కోసం లేఖ వ్రాయడం జరుగుతుందని పేర్కొన్నారు. రాజమండ్రి డివిజన్ లో 18, కొవ్వూరు డివిజన్ లో 48  మైనింగ్ యూనిట్స్ ఉన్నాయన్నారు. కొవ్వూరు డివిజన్ పరిధిలో లీజు దారులు ముంపు కు గురైన మైన్స్ నీటిలో ఉన్నందున  నీరు పోయిన తరువాత కార్యకలాపాల ను నిర్వహిస్తామని ప్రతినిధులు తెలిపారు. పబ్లిక్ హియరింగ్ అయి కూడా అనుమతులు రానీ వాటి కోసం ప్రభుత్వానికి లేక వ్రాయడం జరుగుతుందని అన్నారు.



 ఏవరైతే పర్యావరణ అనుమతులు ఉన్నా, పర్మిట్ ఆర్డరు లేకుండా  త్రవ్వకాలు నిర్వహించారో, వారు తగిన పరిహారం చెల్లించి, అనుమతులకు లోబడి త్రవ్వకాలు చేపట్ట వొచ్చు నని అన్నారు. ప్రభుత్వ మార్గద్శకాలు మేరకు జిల్లాలో సింగిల్ విండో ద్వారా మైన్స్ లిజులకు అనుమతి ఇవ్వడం జరుగుతుందనీ పేర్కొన్నారు . మైన్స్ జోన్ ఏర్పాటు ద్వారా పర్యవరణ అనుమతికి ప్రతి సారి పబ్లిక్ హియరింగ్ కోసం వెళ్లకుండా ఇచ్చే విషయం పరిశీలించామని కోరడం జరిగింది.



ఈ సమావేశంలో మై న్స్ డిప్యూటీ డైరెక్టర్ ఈ. నరసింహా రెడ్డి, మై న్స్ లీజు దారులు తదితరులు పాల్గొన్నారు.




Comments