ఎయిర్ పోర్టు, గిరిజన విశ్వ విద్యాలయాలకు భూసేకరణ త్వరగా పూర్తి చేయండి



ఎయిర్ పోర్టు, గిరిజన విశ్వ విద్యాలయాలకు భూసేకరణ త్వరగా పూర్తి చేయండి



నవంబర్ లో ప్రధానమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపనకు ఏర్పాట్లు


అధికారులతో సమీక్షలో మంత్రి  బొత్స సత్యనారాయణ ఆదేశాలు




విజయనగరం, అక్టోబర్ 25 (ప్రజా అమరావతి): వచ్చే నవంబర్ నెలలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ చేతుల మీదుగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలకు  శంకుస్థాపన చేయించాలనే ఆలోచనతో ప్రభుత్వం వుందని, వీటి ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియ, నిర్వాసితుల పునరావాసం త్వరగా పూర్తి చేసి శంకుస్థాపనకు సిద్ధం చేయాలని రాష్ట్ర విద్య శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. ఈ రెండు ప్రాజెక్టుల భూసేకరణలో  ఎదురవుతున్న సమస్యలపై చర్చించి, వాటి పరిష్కారానికి ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు మంత్రి ఆదేశాలిచ్చారు. కలెక్టర్ కార్యాలయంలో మంత్రి మంగళవారం జిల్లా కలెక్టర్, ఎస్.పి., జే.సి., ఆర్.డి.ఓ.లు, భూసేకరణ ప్రత్యెక  డిప్యూటీ కలెక్టర్లు, జి.ఎం.ఆర్. ఎయిర్ పోర్టు ప్రాజెక్ట్ సి.ఇ.ఓ. మనోమయ్ రాయ్, ప్రాజెక్ట్ హెడ్ రామరాజు తదితరులతో   ఈ రెండు ప్రాజెక్టులపై సమీక్షించారు.


జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు, శాసన సభ్యులు బొత్స అప్పల నరసయ్య, కడుబండి శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో ముందుగా భోగాపురం ఎయిర్ పోర్టు భూసేకరణ అంశంపై న్యాయస్థానాల్లో వున్న కేసులు, వాటిపై ప్రభుత్వ పరంగా చేపట్టిన చర్యల గురించి జిల్లా కలెక్టర్ ఏ సూర్యకుమారి, జే.సి. మయూర్ అశోక్ ద్వారా తెలుసుకున్నారు. జి.ఎం.ఆర్.  సంస్థ ప్రతినిధులతో కుడా ఈ అంశంపై మాట్లాడారు. ఎయిర్ పోర్టు టెర్మినల్ భవనాలు, అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూములు ముందుగా జి.ఎం.ఆర్. సంస్థకు ఇచ్చే విషయంపై దృష్టి సారించాలని మంత్రి ఈ సందర్భంగా చెప్పారు.  ఆ సంస్థకు ఇచ్చిన కమిట్మెంట్ మేరకు భూములు ముందుగా అందజేయాలని పేర్కొన్నారు. నిర్వాసిత కాలనీల్లో ఇళ్ళ నిర్మాణం, రోడ్లు, సామాజిక భవనాల నిర్మాణంపై రోడ్లు, భవనాల శాఖ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్వాసిత కాలనీ ల నిర్మాణంలో నిధుల విడుదల  సమస్య ఏర్పడకుండా చర్యలు చేపడతామని మంత్రి స్పష్టం చేసారు. ఇళ్ళ నిర్మాణానికి అవసరమైన ఇసుకను ఉచితంగా అందించే ఏర్పాట్లు చేస్తామన్నారు.  నిర్వాసితుల ఇళ్ళ నిర్మాణాలు త్వరగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. కాలనీల నిర్మాణంలో ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామన్నారు. 


కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం భుసేకరణపై బొబ్బిలి ఆర్.డి.ఓ. శేషశైలజ ప్రస్తుత పరిస్థితిని మంత్రికి వివరించారు.  డి.పట్టా భూములు, జిరాయితీ భూములు, ఎలాంటి పట్టా లేకుండా ఇతరుల స్వాధీనంలో వున్న భూములకు సంబంధించి వచ్చే సమావేశం నాటికి పూర్తి సమాచారంతో రావాలని మంత్రి సూచించారు. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసే ప్రాంతానికి చెందిన గ్రామ సర్పంచ్ తో మంత్రి మాట్లాడారు. ఎంతో ప్రతిష్టాత్మక విద్యా సంస్థ ఏర్పాటవుతున్నందున ఆ ప్రాంత రైతులు, ప్రజలు, ప్రజా ప్రతినిధులు భూసేకరణలో ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి కోరారు. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తే ఆ ప్రాంత అభివృద్ధికి దోహదం చేస్తుందని ఈ అవకాశం విడిచిపెట్టకుండా ఆలోచించాలని సూచించారు. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు కోసం ప్రతిపాదించిన స్థలంలో విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటు కోసం వెంటనే ప్రతిపాదనలు రుపొందిచాలని ఇ.పి.డి.సి.ఎల్. అధికారులను మంత్రి ఆదేశించారు. జాతీయ రహదారి నుంచి గిరిజన విశ్వవిద్యాలయం వరకు నాలుగు వరసల రహదారి నిర్మించేందుకు ప్రతిపాదనలు రూపొందించి అందజేయాలని రోడ్లు భవనాల శాఖ అధికారులని మంత్రి ఆదేశించారు.


 


చెరకు రైతులకు సరైన ధర చెల్లిస్తేనే చెరకు తరలింపు : మంత్రి స్పష్టీకరణ


చెరకు రైతులకు నష్టం లేకుండా తగిన ధర చెల్లిస్తేనే సంకిలి చక్కర కర్మాగారానికి భీమసింగి, సీతానగరం చక్కెర ఫ్యాక్టరీల పరిధిలో ఈ సీజన్లో  పండించే చెరకు తరలించే అంశాన్ని పరిశీలిస్తామని మంత్రి సంకిలి పారిస్ కర్మాగారం ప్రతినిధులకు స్పష్టం చేసారు.  సంకిలి కర్మాగారం కు ఎప్పటి నుంచి చెరకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు,  ఎంత ధర చేల్లిస్తున్నరనే అంశాలపై మంత్రి చక్కర కర్మాగారం ప్రతినిధులు, షుగర్ కెన్ అధికారులతో  సమీక్షించారు.  సీతానగరం పరిధిలో నవంబర్ 15న, భీమసింగి పరిధిలో నవంబర్ 16 నుంచి చెరకు తరలింపునకు ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు మంత్రికి వివరించారు. చోడవరం చక్కర కర్మాగారం రూ.2821 చెల్లించి రైతు పొలం వద్ద నుంచే తీసుకు వెళ్లేందుకు సిద్దంగా వున్నారని, ఆ స్థాయిలో ధర చెల్లిస్తేనే సంకిలి ఫ్యాక్టరీ కి ఈ ఏడాది తరలించడం జరుగుతుందని పేర్కొన్నారు.


సమావేశంలో జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ దీపిక, రెవిన్యూ డివిజనల్ అధికారులు ఎం.వి.సూర్య కళ, అప్పారావు, శేష శైలజ, ప్రత్యెక డిప్యూటీ కలెక్టర్లు సుదర్శన దొర, పద్మలీల, రోడ్లు భవనాల శాఖ ఎస్.ఇ. విజయశ్రీ,, పంచాయతీరాజ్ ఎస్.ఇ. గుప్తా, విద్యుత్ పంపిణీ సంస్థ ఎస్.ఇ. చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.


 



Comments
Popular posts
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది.
Image
న్యాయప్రక్రియకు..రాజ్యాంగపరమైన చట్టాలకు లోబడి వికేంద్రీకరణ చేయబోతున్నాం.
Image
ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు
Image
*ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
Image
बर्खास्त होंगे उत्तराखंड विधानसभा सचिवालय के 228 कर्मी, हाईकोर्ट ने फैसला सही कहा।
Image