అడవుల సంరక్షణకు సీఎం శ్రీ వైయస్ జగన్ అత్యంత ప్రాధాన్యత

 

- అటవీశాఖ రాష్ట్రస్థాయి కాన్ఫెరెన్స్ కు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

- అడవుల సంరక్షణకు సీఎం శ్రీ వైయస్ జగన్ అత్యంత ప్రాధాన్యత


- ప్రస్తుతం 23 శాతం ఉన్న అటవీ విస్తీర్ణంను 33 శాతంకు పెంచాలనేదే లక్ష్యం

- మానవ మనుగడకు అడవులే అత్యంత కీలకం

- రాష్ట్రానికి ఎర్రచందనం ఒక అపూర్వమైన వరం

- ఎర్రచందనం స్మగ్లింగ్ ను ఉక్కుపాదంతో అణివేస్తున్నాం

- నాడు వైయస్ఆర్ హయాంలోనే అటవీశాఖ మంత్రిగా ఎర్రచందనం స్మగ్లింగ్ పై చర్యలు

- అటవీ సిబ్బందికి అవసరమైన అన్ని వనరులను సమకూర్చాం

- నగరవనాల ద్వారా ప్రజలకు ఆరోగ్యకర వాతావరణాన్ని అందించాలి

- రాష్ట్రంలో పులులు, ఏనుగుల సంఖ్య పెరుగడం శుభపరిణామం

- కొత్త సాంకేతికతతో వన్యప్రాణుల సంరక్షణకు కృషి చేయాలి

- ఒక్క ఎకరం అటవీభూమి కూడా అన్యాక్రాంతం కాకూడదు

- శాశ్వత భూసర్వేలో అటవీభూముల గుర్తింపును సీరియస్ గా తీసుకోవాలి

- ప్లాస్టిక్ ను నిషేదించడం, పచ్చదనాన్ని పెంపొందించడానికి కృషి చేయాలి

- సీఎం శ్రీ వైయస్ జగన్ గారి ఆశయాలకు అనుగుణంగా అటవీశాఖ ఫలితాలు సాధించాలి

- ఇకపై ప్రతి ఏటా ఇటువంటి రాష్ట్రస్థాయి సదస్సులు

: మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

విజయవాడ (ప్రజా అమరావతి):

రాష్ట్రంలో అడవుల సంరక్షణకు ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, ఇంధన, శాస్త్రసాంకేతిక, గనులశాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 23 శాతం ఉన్న అడవుల విస్తీర్ణంను 33 శాతంకు పెంచాలని గత ఆగస్టు 5వ తేదీన జగనన్న పచ్చతోరణం ప్రారంభం సందర్భంగా సీఎం శ్రీ వైయస్ జగన్ పిలుపునిచ్చారని గుర్తు చేశారు. 

విజయవాడలో అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి సెమినార్ ముగింపు కార్యక్రమానికి మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... అటవీ అధికారును కార్యోన్ముఖులను చేస్తూ, మార్గదర్శకం చేసే ఇటువంటి సెమినార్లు ప్రతి ఏడాది జరగాలని అన్నారు. కరోనా వల్ల సెమినార్లకు కొంత ఇబ్బంది ఏర్పడిందని, ఇకపై ప్రతి ఏటా ఈ సెమినార్లు నిర్వహిస్తామని తెలిపారు.

మానవాళి మనుగడకు అడవులు అత్యంత కీలకమని అన్నారు. ఇతర దేశాల్లో ప్రభుత్వాలు అడవుల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, పచ్చదనం పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయని అన్నారు. మనదేశంలోనూ అటవీప్రాంత పరిరక్షణకు ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయని తెలిపారు. మన రాష్ట్రంలోనూ అటవీ విస్తీర్ణం పెంచేందుకు అధికారులు చిత్తశుద్దితో కృషి చేయాలని కోరారు.

మన రాష్ట్రంలో అపూర్వమైన ఎర్రచందనం వృక్షాలు విస్తారంగా ఉన్నాయని అన్నారు. విలువైన ఎర్రచందనం చెట్లను స్మగ్లర్ల బారి నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. ఆనాడు స్వర్గీయ వైయస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో అటవీశాఖ మంత్రిగా పనిచేసిన సందర్భంలో ఎర్రచందనం స్మగ్లింగ్ ను అరికట్టేందుకు కీలక చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఎర్ర చందనం విస్తరించిన 24 డివిజన్ లకు 1+4 పోలీస్ ఫోర్స్ ను నియమించడం, నూతనంగా 300 కొత్త వాహనాలను అటవీ సిబ్బందికి సమకూర్చానని తెలిపారు. దానివల్లే ఎర్రచందనంపై నిఘా పెరగడం ప్రారంభమైందని తెలిపారు. 

ఎర్రచందనాన్ని ఆదాయవనరుగా మార్చుకుని స్మగ్లర్లు ఎంతకైనా తెగించి మరీ అక్రమ రవాణా చేస్తున్నారని, దీనిని ఉక్కుపాదంతో అణచివేయాలని కోరారు. ఎర్రచందనం రాష్ట్ర సరిహద్దులు దాటి విదేశాలకు ఎగుమతి అయ్యే పరిస్థితిని పూర్తిగా అరికట్టాలని అన్నారు. అలాగే తిరుపతిలో ఏర్పాటు చేసిన బయోట్రిమ్ ద్వారా పట్టాభూముల్లో ఎర్రచందనం మొక్కల పెంపకంను ప్రోత్సహించాలని కోరారు. నర్సరీలను ఏర్పాటు చేసి ఎర్రచందనం మొక్కలను పెంచేలా రైతులను ప్రోత్సహించాలని అన్నారు. 

రాష్ట్రంలో పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్లాస్టిక్ నిషేదంపై సీఎం శ్రీ వైయస్ జగన్ గారు సీరియస్ గా ఉన్నారని అన్నారు. ఇప్పటికే ఫ్లెక్సీ బోర్డ్ లను నిషేదించారని, క్లాత్ బోర్డ్ లు మాత్రమే వాడాలని ఆదేశించారని గుర్తు చేశారు. తిరుమలలో ఇప్పటికే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేదించారని అన్నారు. శ్రీశైలం లోనూ ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి, వాటిని రీసైక్లింగ్ కు బయటకు పంపుతున్నారని అన్నారు. పర్యావరణానికి మేలు చేసే ఇటువంటి చర్యలను ప్రోత్సహించాలని, గతంలోనూ తాను పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఉపాధి హామీ కింద పెద్ద ఎత్తున అవెన్యూ ప్లాంటేషన్ చేయించానని గుర్తు చేశారు. మైనింగ్ తో అడవులకు నష్టం జరగకుండా మైనింగ్ వ్యవధి ముగిసే లోపు గనుల యజమానులతో అడవుల అభివృద్ధికి ప్రత్యేక సెక్యూరిటీ డిపాజిట్ ను సేకరిస్తున్నామని తెలిపారు.

వన్యప్రాణుల సంరక్షణ, పరిరక్షణలో రాష్ట్రం ముందు వరసలో ఉందని అన్నారు. దేశంలోనే అతిపెద్ద విస్తీర్ణంతో ఉన్న నాగార్జునసాగర్, శ్రీశైలం పులుల అభయారణ్యంలో 75 పులులు ఉన్నాయి. శ్రీకాకుళం, శేషాచలం, కౌండీన్య రిజర్వ్ ఫారెస్ట్ లో ఏనుగుల సంతతి పెరుగుతోందని తెలిపారు. మన రాష్ట్రంలో 3 జాతీయ అటవీ పార్క్ లు, 11 అభయారణ్యాలను వన్యప్రాణి విభాగం ద్వారా పర్యవేక్షిస్తున్నామని అన్నారు.  ఇటీవల కాలంలో ఏనుగులు జనావాసాల మీదకు వస్తున్నాయని, వాటిని అటవీ ప్రాంతాలకు పంపేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్క్షానంపై దృష్టి సారించాలని కోరారు. 

రాష్ట్రంలో 28 నగరవనాలు నిర్మించడం జరిగిందని,  అలాగే పచ్చర్ల, బైర్లూటి, మారేడుమిల్లి తదితర ప్రాంతాల్లో ఎకో-టూరిజంను అభివృద్ధి చేస్తున్నామన్నారు. అటవీశాఖను బలోపేతం చేసేందుకు 32 ప్రాదేశిక, 12 సామాజిక అటవీ విభాగాలను, 14 ఫంక్షనల్, స్పెషల్ విభాగాలుగా పునర్ వ్యవస్థీకరించామని తెలిపారు.  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న శాశ్వత భూహక్కు - భూరక్ష పథకం ద్వారా అటవీ భూముల సరిహద్దులను నిర్ధిష్టంగా గుర్తిస్తున్నామని, ఎక్కడైనా ఆక్రమణలు జరిగితే వాటిని గుర్తించేందుకు రెవెన్యూ-అటవీశాఖల సంయుక్త సర్వే కూడా నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమాన్ని అటవీశాఖ అధికారులు సీరియస్ గా తీసుకోవాలని కోరారు. అటవీభూములను కాపాడుకునేందుకు అందరికంటే ముందంజలో ఉండి పనిచేస్తున్న తిరుపతి సిపిఎఫ్ నాగేశ్వరరావు, చిత్తూరు డిఎఫ్ఓలను అభినందించారు. 

సీఎం శ్రీ వైయస్ జగన్ గారు అడవుల అభివృద్ది, పర్యావరణ సమతూల్యతను కాపాడేందుకు మనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని, అందుకోసం బాధ్యతాయుతంగా భవిష్యత్ తరాలకు ప్రకృతి ప్రసాదించే వరాలు అందేలా చూడాలని అటవీశాఖ అధికారులకు సూచించారు. 


అనంతరం పిసిపిఎఫ్, హెచ్ఓఎఫ్ వై.మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ మూడు సంవత్సరాల తరువాత అటవీశాఖ అధికారుల కాన్ఫెరెన్స్ విజయవాడలో జరుగుతోందని అన్నారు. అటవీశాఖ, పర్యావరణ విభాగంలో జరుగుతున్న మార్పులు, దానికిఅనుగుణంగా కార్యాచరణను సిద్దం చేసుకోవడానికి, దిశా నిర్ధేశం చేసుకునేందుకు ఈ కాన్ఫెరెన్స్ నిర్వహిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో అటవీ భూములను కాపాడుకోవడం మన ప్రధాన లక్ష్యంగా ఉండాలని, డిపార్ట్ మెంట్ లో సరైన సమన్వయం లేకపోవడం వల్ల కూడా  భూములను కోల్పోతున్నామని అన్నారు. రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ కాన్ఫెరెన్స్ లో ఎంపిక చేసిన అంశాలను అధికారులు అర్థం చేసుకుని, వాటిపై పూర్తి అవగాహనను పెంచుకోవాలని కోరారు. పర్యావరణ మార్పులు, కార్బన్ ఉద్ఘారాల గురించి అధ్యయనం చేయాలని, రిజర్వు ఫారెస్ట్, అటవీయేతర, వ్యవసాయేతర భూముల్లో కార్బన్ క్రెడిట్స్ ను ఒక ప్రాజెక్ట్ ను తయారు చేసుకోవాలని సూచించారు. ఎకో-టూరిజంను ప్రతి డివిజన్ లోనూ ఏర్పాటు చేయాలని, నగరవనం, పల్లెవనం ప్రాజెక్ట్ లను సిద్దం చేయాలని కోరారు. 

ఈ సెమినార్ లో స్పెషల్ చీఫ్  సెక్రటరీ (ఇఎఫ్ఎస్&టి) నీరబ్ కుమార్ ప్రసాద్,  పలువురు అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.


Comments
Popular posts
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది.
Image
ఇంటర్నెట్‌లో గూగుల్ సెర్చ్‌లో సైబర్ క్రైమ్ కేసులు పెరుగుతున్నాయి.
Image
న్యాయప్రక్రియకు..రాజ్యాంగపరమైన చట్టాలకు లోబడి వికేంద్రీకరణ చేయబోతున్నాం.
Image
*ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
Image
ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు
Image