శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సౌకర్యార్థం జలవనరుల శాఖకు చెందిన ఖాళీ స్థలాన్ని తాత్కాలికంగా వినియోగించుకునేందుకు అనుమతి తీసుకోవడం జరిగింది

 విజయవాడ, 

ఇంద్రకీలాద్రి (ప్రజా అమరావతి);


                     


శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సౌకర్యార్థం జలవనరుల శాఖకు చెందిన ఖాళీ స్థలాన్ని తాత్కాలికంగా వినియోగించుకునేందుకు అనుమతి తీసుకోవడం జరిగింద


ని డిప్యూటీ సీఎం, రాష్ట్ర దేవాదాయ శాఖ మాత్యులు కొట్టు సత్యనారాయణ అన్నారు.


ఇంద్రకీలాద్రిపై భక్తులకు కల్పిస్తున్న సదుపాయాలను, ఏర్పాట్లను శనివారం రాష్ట్ర డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పరిశీలించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ శరన్నవరాత్రి ఉత్సవాలు నేటితో ఆరో రోజుకు చేరుకున్నాయన్నారు. ఉత్సవాలలో భక్తులందరూ అమ్మవారని భక్తిపార్వశంతో దర్శించుకుంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. క్యూలైలలో ఉన్న భక్తులను ఎవరిని అడిగినా ఏర్పాట్లు బాగున్నాయంటూ  భక్తులందరి నోటివెంట అదే మాట వినవస్తున్నదని మంత్రి అన్నారు. ఏవైన చిన్నచిన్నలోపాలు ఉన్న అవి సరిదిద్దుకుని భక్తులకు అసౌకర్యం కలగకుండా చూస్తున్నామన్నారు.

శుక్రవారం సుమారు 80 వేల మంది వరకు భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారన్నారు. అమ్మవారికి నివేదన, వర్షం వచ్చినప్పుడు కొంత సమయం ఆలస్యమైన పెద్ద ఎత్తున భక్తులు దర్శనం చేసుకోవడం జరుగుతుందన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రసాదాలు, ఇతర లడ్డూ ప్రసాదాలుగాని సిద్దం చేసుకుని ఉంచామన్నారు. సీతమ్మ వారి పాదాల వద్ద పార్కింగ్, కేశఖండన స్నానాల నిమిత్తం క్లోక్ రూమ్ తాత్కాలిక ఏర్పాటు నిమిత్తం శనీశ్వరాలయ సమీపంలో జల వనరుల శాఖకు చెందిన నాల్గున్నర ఎకరాల  స్థలాన్ని పార్కింగ్ తదితర అవసరాలకు తాత్కాలికంగా వినియోగించుకునేలా చర్యలు తీసుకునన్నామన్నారు. సీతమ్మవారి పాదాల సమీపంలో ఉన్న  4.5 ఎకరాల్లో ఉన్న స్థలంలో 20 మీటర్లు రోడ్డుకు వదిలివేయగా 3.75 సెంట్లు స్థలాన్ని జలవనరులశాఖ మంత్రివర్యులతో మాట్లాడి తాత్కాలికంగా వినియోగించుకునేలా అంగీకరించిన మంత్రి అంబటి రాంబాబుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. 40 నిమిషాలలోనే అమ్మవారి దర్శనం జరిగేలా ఏర్పాటు చేయడం పట్ల రాష్ట్రం నలుమూల నుండి వస్తున్న భక్తులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు. భక్తులకు తృప్తికరమైన దర్శనం లభించిందనే సంతృప్తి తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని మంత్రి అన్నారు. భక్తులకు చేసిన ఏర్పాట్లలో లోపాలను గుర్తిస్తే వాటిని సరిదిద్దుతామని, తగిన సూచనలు సలహాలను స్వాగతిస్తున్నామన్నారు. ఆదివారం మూలా నక్షత్రం రోజున  ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని ఆ సమయంలో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సూచనలు పాటించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉందన్నారు. ఆ సమయంలో భక్తులకు ఆసౌకర్యం కలుగకుండా  డిస్ ప్లే స్క్రీన్ ద్వారా  అమ్మవారి పూజలు, హారతులు, గ్రామోత్సవాలను ప్రసారం చేయడం జరుగుతుందన్నారు. భక్తులకు త్రాగునీరు, బటర్ మిల్క్, పాలు సరఫరా చేస్తున్నామని అన్నారు. ఈదైవ కార్యక్రమంలో ఎక్కడైనా లోపాలు జరిగినా మానవతప్పిదంగా చూడకుండా సరిచేసుకోవడానికి అవకాశం ఇవ్వాలన్నారు. అందుకు మీడియావారి సూచనలు పాటిస్తామన్నారు. అమ్మవారి కరుణాకటాక్షాలు అందరిపైనా ఉండాలని డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు.



Comments
Popular posts
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది.
Image
ఇంటర్నెట్‌లో గూగుల్ సెర్చ్‌లో సైబర్ క్రైమ్ కేసులు పెరుగుతున్నాయి.
Image
న్యాయప్రక్రియకు..రాజ్యాంగపరమైన చట్టాలకు లోబడి వికేంద్రీకరణ చేయబోతున్నాం.
Image
*ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
Image
ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు
Image