ప్రపంచ వారసత్వ సంపద గా ధవళేశ్వరం బ్యారేజ్ గుర్తింపురాజమహేంద్రవరం (ప్రజా అమరావతి): ప్రపంచ వారసత్వ సంపద గా ధవళేశ్వరం బ్యారేజ్ గుర్తింపు


మనందరికీ గర్వ కారణం అని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, జిల్లా ఇంఛార్జి మంత్రి సిహెచ్. వేణుగోపాల్, హోం మంత్రి తానేటి వనితలు పేర్కొన్నారు.


శనివారం స్థానిక ధవళేశ్వరం బ్యారేజ్ ప్రాంతంలో ఐ సి ఐ డి అవార్డ్ స్వీకరణ అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ముఖ్య అతిథిగా మంత్రులు, అధికారులు, రైతులు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ కరువు కాటకాలతో ఈ ప్రాంతం అల్లాడుతుంటే, 1847 లో బ్రిటిష్ ప్రభుత్వం కాటన్ దొర ను  ఇక్కడ అధ్యయనం చేయడం కోసం పంపించడం జరిగిందన్నారు. ఆనాడు సర్ అర్దర్ కాటన్ దొర బ్యారేజ్ నిర్మాణం పనులు చేపట్టి పూర్తి చెయ్యడం ద్వారా నేడు కూడా ఇక్కడి ప్రజలు గుండెల్లో చిర స్థాయి గా నిలిచారన్నారు. ఇదే సందర్భంలో మరో వ్యక్తిని గుర్తు చేసుకోవలసి ఉందని, ఆయనే డా వైయస్ రాజశేఖరరెడ్డి పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. ఆనాడు కాటన్ మహాశయుడు నిర్మించిన ప్రాజెక్ట్ 100 సంవత్సరాలు దాటి ఇక్కడి ప్రాంతం సస్యశ్యామలం అవ్వడం తో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు రావడం జరిగిందని తెలిపారు. వైయస్ రాజశేఖరరెడ్డి పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి పూర్తి చేశారని అన్నారు.  రెండు కోట్ల సి ఎస్ ఆర్ నిధులతో కాటన్ బ్యారేజ్ రహదారి పనులు పూర్తి చెయ్యడం జరుగుతుందని అన్నారు. కాటన్ మ్యూజియం ను కూడా అభివృద్ధి చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.  ఐ సి ఐ డి ఆధ్వర్యంలో  ప్రపంచ హెరిటేజ్ స్ట్రక్చర్ కార్యక్రమం భారతదేశంలో జరుగుతుండగా, ఆ కార్యక్రమం విశాఖపట్నం లో నిర్వహించడం జరుగుతోందని మంత్రి అన్నారు.


జిల్లా ఇంఛార్జి మంత్రి రాష్ట్ర బీసీ సంక్షేమ, సమాచార పౌర సంబంధాల, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి సిహెచ్. శ్రీనివాస్ వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ, ఈరోజు ఒక చారిత్రాత్మక రోజని అన్నారు. గాలి, నీరు, ఆహారం మానవ  జీవనానికి ఆయువు పట్టు అన్నారు. మనం తినే ప్రతి బియ్యం గింజ లో  సర్ అర్దర్ కాటన్  ఉన్నాడు అనడం అతిశయోక్తి లేదన్నారు. కాటన్ బ్యారేజ్ కి ప్రపంచ పురాతన కట్టడంగా  గుర్తింపు రావడం ఈరోజు ఆ అవార్డ్ తీసుకున్న జలవనరుల శాఖ మంత్రి నిజంగా ధన్యుడన్నారు. చరిత్రలో ఆయన పేరు కూడా చిర స్థాయి గా నిలిచి పోతుందన్నారు. వైయస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి కాటన్ వారసుడిగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. పోలవరం ప్రాజెక్టు ను బహుళార్ధక సాగు నీటి ప్రాజెక్ట్ ను శ్రీకారం చుట్టారన్నారు.


రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ కాటన్ బ్యారేజి నిర్మాణ వలన ఉభయ గోదావరి జిల్లా లు అన్నపూర్ణగా ప్రత్యేక గుర్తింపు పొందడం జరిగిందన్నారు. రెండు పంటలు పండే దిశగా బ్యారేజ్ నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. బ్యారేజ్ పై రహదారి ని పూర్తి స్థాయి లో అభివృధి చేసేందుకు, మరిన్ని నిధులు ఇవ్వాలని కోరారు. కాటన్ బ్యారేజి గొప్ప తనం  గుర్తించి అవార్డ్ రావడం ప్రపంచ వ్యాప్తంగా మరింత ఆనందంగా ఉందన్నారు. రెండు పంటలకు బ్యారేజ్ ద్వారా నీరు అందించేలా ఇరిగేషన్ అధికారుల కృషి అభినందిస్తున్నాను. గతంలో వైయస్ రాజశేఖరరెడ్డి, నేడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి మరిన్ని జలవనరుల ప్రాజెక్ట్స్ నిర్మాణం చేస్తూ, వ్యవసాయాన్ని పండుగగా చెయ్యడం జరిగిందన్నారు. కాటన్ బ్యారేజి కి పూర్వ వైభవాన్ని తీసుకుని వొచ్చే దిశలో నిధులు కేటాయించాలని కోరారు.


పార్లమెంట్ సభ్యులు మార్గని భరత్ రామ్ మాట్లాడుతూ, వంద సంత్సరాల పాటు ఈ ప్రాంతం ప్రజలు ఉండడమే అవార్డ్ రావడానికి కారణం అన్నారు. అందుకు కారణం వైయస్ రాజశేఖరరెడ్డి కూడా అన్నారు. ధవళేశ్వరం బ్యారేజ్ రోడ్ ను పూర్తి స్థాయి లో అభివృద్ధి చేయాలని కోరడం జరిగింది. మనకు ఉన్న సంపదకు అంతర్జాతీయం గా  గుర్తింపు పొందడం, దానిని పరిరక్షించడం కూడా అంతే ముఖ్య అని ఐ సి ఐ డి వైస్ చైర్మన్ అన్నారు. ధవళేశ్వరం బ్యారేజ్ కి సర్ ఆర్థర్ కాటన్, మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి వలన అరుదైన అవకాశం దక్కిందన్నారు.


జిల్లా పరిషత్ ఛైర్మన్ , రిటైర్డ్ ఇరిగేషన్ ఎస్ ఈ విప్పర్తి వేణుగోపాల రావు మాట్లాడుతూ, ₹.3800 కోట్లు డెల్టా ఆధునీకరణ నిధులు వైయస్ రాజశేఖరరెడ్డి కే దక్కిందన్నారు. భావితరాలకు సర్ అర్దర్ కాటన్ గొప్పతనాన్ని తెలియచేసెలా కాటన్ మ్యూజియం ఆధునీకరించాలని కోరారు.


ప్రిన్సిపల్ సెక్రటరీ శశి భూషణ్ కుమార్, వరల్డ్ హెరిటేజ్ కట్టడంగా ధవళేశ్వరం బ్యారేజ్ కి రావడం గర్వించ దగ్గ ఘట్టం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి, ఇరిగేషన్ శాఖ అధికారులకు ఈరోజు ఎంతో ముఖ్యమైన రోజు అని అన్నారు.


తొలుత జ్యోతి ప్రజ్వలన తో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సర్ ఆర్థర్ కాటన్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమం లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇరిగేషన్ శాఖ సహాయ ఇంజనీర్ల గా నియమించిన వారికి నియామక పత్రాలు అందజేశారు.  ఇరిగేషన్ శాఖ లో ఉత్తమ సేవలు అందించిన ఇమాన్యుయేల్, పేరయ్య లింగం, రేవు సుధాకర్ బాబు కుటుంబ సభ్యులను సన్మానించారు.జిల్లా పరిషత్ ఛైర్మన్ విప్పర్తి వేణుగోపాల రావు , ప్రభుత్వ చీప్ విప్ చేర్ల జగ్గిరెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ శశి భూషణ్ కుమార్,  ఈ ఎన్ సి .. సి. నారాయణ రెడ్డి,  చీఫ్ ఇంజనీర్ సతీష్ కుమార్, రూరల్ కో ఆర్డినేటర్ చందన నాగేశ్వర్,  ధవళేశ్వరం ఎస్ ఈ - నరసింహ మూర్తి,  ఐ సి ఐ డి సంస్థ వైస్ చైర్మన్ ప్రో.  ఎల్లారెడ్డి పలువురు ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్లు, పలు కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, సభ్యులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, మహిళలు హాజరయ్యారు.అంతకు ముందు మంత్రులు, స్థానిక ప్రజా ప్రతినిధులు స్థానిక బ్యారేజ్ వద్ద ఉన్న సర్ అర్థర్ కాటన్ దొర, స్వర్గీయ వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం గోదావరి నది కి పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ ఆకుల వీర్రాజు, రూడా చైర్ పర్సన్ ఎమ్ షర్మిలా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

శాసన సభ్యులు జక్కంపూడి రాజా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తూర్పు గోదావరి జిల్లా వాసిగా ఈరోజు ధవళేశ్వరం బ్యారేజ్ కి ప్రపంచ వారసత్వ సంపద గుర్తింపు పొందడం ఎంతో గర్వకారణం అన్నారు.  ఈ వేడుకలను రైతులు, మహిళలు, ఈ ప్రాంత ప్రజల మధ్య జరగడం చారిత్రాత్మక మైన ఘట్టంగా అభివర్ణించారు.

Comments
Popular posts
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది.
Image
న్యాయప్రక్రియకు..రాజ్యాంగపరమైన చట్టాలకు లోబడి వికేంద్రీకరణ చేయబోతున్నాం.
Image
ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు
Image
*ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
Image
बर्खास्त होंगे उत्तराखंड विधानसभा सचिवालय के 228 कर्मी, हाईकोर्ट ने फैसला सही कहा।
Image