విత్తనం నుండి విక్రయం వరకు ఆర్బీకేలు రైతాంగానికి అండగా ఉంటున్నాయి


ఆళ్ళగడ్డ, నంద్యాల జిల్లా (ప్రజా అమరావతి);


*వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌*


*వరసగా నాలుగో ఏడాది, రెండో విడతగా*


*రైతు భరోసా సాయాన్ని నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డలో బటన్‌ నొక్కి నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌*


*ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి, లబ్ధిదారులు ఏమన్నారంటే...*


*కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి*


అందరికీ నమస్కారం, ఈ శుభ సందర్భంలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. మ్యానిఫెస్టోలో చెప్పినదానికన్నా ఎక్కువగా ఇచ్చిన వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ గారే, రైతులకు అనేక పథకాలు అమలవుతున్నాయి, ఉచిత పంటల బీమా ద్వారా ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా రైతాంగానికి అండగా నిలిచి, దేశంలో ఎక్కడాలేని విధంగా ఈ కార్యక్రమం అమలుచేస్తున్న ఏకైక రాష్ట్రం మనది. విత్తనం నుండి విక్రయం వరకు ఆర్బీకేలు రైతాంగానికి అండగా ఉంటున్నాయి, రైతులకు ఈ క్రాప్‌ బుకింగ్‌ కానీ ఈ కేవైసీ కాని, ఎరువులు, విత్తనాలు, ఉత్పాదకాల నాణ్యతను పరిక్షించడానికి 147 అసెంబ్లీ స్ధాయిలో ల్యాబులు, 13 జిల్లా స్ధాయిలో, 4 రీజనల్‌ కోడింగ్‌ సెంటర్స్‌ ఏర్పాటుచేయడం జరిగింది. వైఎస్‌ఆర్‌ పొలంబడి ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతాంగానికి అందజేస్తున్నాం, వ్యవసాయ సలహా మండలి ఏర్పాటుచేసి సచివాలయం, మండలం, జిల్లా స్ధాయిలో దాదాపు లక్షమంది రైతులతో ఏర్పాటుచేసిన ప్రభుత్వం మనది. వ్యవసాయ రుణాలు అత్యధికంగా ఇవ్వడం జరిగింది, టీడీపీ హయాంలో రైతు రధం పేరుతో దోచుకున్న చరిత్ర, కానీ ఇప్పుడు మీరు ఎంపిక చేసుకున్న మోడల్‌ను నేరుగా ఇచ్చిన ఘనత ఈ సీఎంగారిది. త్వరలోనే దాదాపు రూ. 200 కోట్లతో డ్రోన్లను కూడా ఏర్పాటుచేసి రైతాంగానికి అండగా ఉండాలన్న ఆలోచన ఈ ప్రభుత్వం చేస్తుంది. రైతాంగానికి సంబంధించి ఎక్కడ ఇబ్బంది ఉన్నా సాయం చేస్తున్నాం. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో అక్కడి మంత్రి ఏమన్నారంటే, మీ సీఎంగారు అమలుచేస్తున్న కార్యక్రమాలు ప్రపంచంలో ఎక్కడా కూడా లేనటువంటివి చేస్తూ రైతాంగానికి అండగా ఉంటున్నారన్నారు. ఈ మూడేళ్ళలో ఒక్క కరవు మండలం కూడా ప్రకటించలేదు, కానీ చంద్రబాబు కరవు కవలపిల్లలు కాబట్టి వందల సంఖ్యలో ప్రకటించారు. సీఎంగారు ఎప్పుడూ చెప్పే మాట రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని విశ్వసించి ఆ విధంగా అడుగులు వేస్తున్నారు, సీఎంగారికి ఆ భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించి నిండు నూరేళ్ళు ఆంధ్ర రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండే విధంగా మీ అందరూ ఆశీస్సులు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 


*దూదేకుల గుర్రప్ప, రైతు*


జగనన్నా నమస్కారం, అన్నా నేను ఏడు ఎకరాల సాగు చేస్తున్నాను, గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాను. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు భరోసా సాయం అందింది, మూడేళ్ళ పాటు ఏటా రూ. 13,500 చొప్పున తీసుకున్నాను. మీరు వేశారు నా అకౌంట్‌లో వచ్చాయి, నాకు పంట నష్టం సాయం కూడా అందింది, దానికింద అక్షరాలా రూ. 30 వేలు సాయం అందింది, పంటల బీమా కూడా అందుతుంది, ప్రతి రైతు ఈ కేవైసీ చేయించుకోవాలి, పంటల బీమా చేయించుకోవాలి. నేను 20 ఏళ్ళుగా వ్యవసాయం చేస్తున్నాం, గతంలో ఎరువుల కోసం క్యూలైన్లో నిలబడి ఎన్నో ఇబ్బందులు పడేవాళ్ళం కానీ ఈ రోజు మన గ్రామంలో ఆర్బీకేలో మనకు అందుతున్నాయి, అన్నీ ఇక్కడే అందుతున్నాయి, జగనన్నా మేం గ్రూప్‌గా ఏర్పడి ట్రాక్టర్, కంకుల కటింగ్‌ మిషన్, ఇతర సామాగ్రి తీసుకున్నాం, మాకు సబ్సిడీ అందింది, మేం రైతులకు తక్కువ రేట్‌లకే వ్యవసాయ పనులకు పనిముట్లను ఇస్తున్నాం, మా అమ్మకు క్యాన్సర్‌ ఆపరేషన్‌ జరిగితే సీఎంఆర్‌ఎఫ్‌ కింద రూ. 60 వేలు వచ్చాయి, కొడుకుగా నా బాధ్యత జగన్‌ తీసుకున్నారని అమ్మ సంతోషపడింది. మా కుటుంబ సభ్యుడివి అన్నా, ఇన్‌పుట్‌ సబ్సిడీ కూడా అందింది, మన జగనన్నను మనం 175 కి 175 సీట్లతో గెలిపించాలి, మన రైతులు, మన అక్కచెల్లెల్లు మనం గెలిపించుకోవాలి, ధన్యవాదాలు. 


*భూక్యే క్రిష్ణానాయక్, గిరిజన రైతు*


జగనన్నా నేను నిరుపేద గిరిజన రైతును, నాలుగేళ్ళుగా వ్యవసాయం చేస్తున్నాను, మా నాన్న పొలం ఇచ్చాడు కానీ పంట పెట్టుబడికి డబ్బు ఇవ్వలేదు, జగనన్న వచ్చిన తర్వాత పంట పెట్టుబడి సాయం ఇవ్వడంతో నేను వ్యవసాయం మొదలుపెట్టాను, సాగు చేస్తున్నాను, నాకు ఆర్బీకేల ద్వారా పొలంబడిలో అవగాహన కల్పించారు, నేను వరి వేస్తే ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయాను, కానీ జగనన్న ప్రవేశపెట్టిన పంటల బీమా, ఈ కేవైసీ ద్వారా సీజన్‌ ముగిసేలోగా నాకు రూ. 40 వేలు వచ్చాయి, బ్యాంకు నుంచి లోన్‌ తీసుకుని సకాలంలో కట్టడం వలన దానికి సున్నావడ్డీ కింద రూ. 3 వేలు వచ్చాయి, గతంలో ఎన్నడూ పంట నష్టం, ఇన్‌పుట్‌ సబ్సిడీ రాలేదు, ఇప్పుడు అన్నీ వస్తున్నాయి. మా నాన్నకు ఫించన్‌ వస్తుంది, మా అమ్మ, నాన్నకు ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్సలు జరిగాయి, మీ వల్లే ఆయన బతికారు, ఈ రోజు ఈ సభకు కూడా మిమ్మల్ని చూడాలని వచ్చారు, తెలుగుగంగ ప్రాజెక్ట్‌ కెనాల్‌కు పిల్లకాలువలు డాక్టర్‌ వైఎస్‌ఆర్‌గారు త్రవ్వించి ఈ నియోజకవర్గానికి సాగు, తాగు నీరు ఇచ్చారు, వైఎస్‌ఆర్‌ కళ్యాణమస్తు పథకాన్ని ప్రారంభించినందుకు మా గిరిజనుల తరపున మీకు ధన్యవాదాలు, అందరికీ ధన్యవాదాలు.

Comments
Popular posts
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది.
Image
ఇంటర్నెట్‌లో గూగుల్ సెర్చ్‌లో సైబర్ క్రైమ్ కేసులు పెరుగుతున్నాయి.
Image
న్యాయప్రక్రియకు..రాజ్యాంగపరమైన చట్టాలకు లోబడి వికేంద్రీకరణ చేయబోతున్నాం.
Image
*ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
Image
ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు
Image