వచ్చేది టీడీపీ ప్రభుత్వమే వైసీపీ తొత్తులుగా వ్యవహరిస్తున్న పోలీసుల లెక్కలు తేలుస్తాం - ఆలపాటి రాజేంద్ర ప్రసాద్.


 


ప్రభుత్వ వైఫల్యాల్ని సోషల్ మీడియాలో  ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా? 


చింతకాయల విజయ్  ఏం తప్పు చేశాడని పోలీసులు అతని ఇంటికెళ్లారు?

వచ్చేది టీడీపీ ప్రభుత్వమే వైసీపీ తొత్తులుగా వ్యవహరిస్తున్న పోలీసుల లెక్కలు తేలుస్తాం

- *ఆలపాటి రాజేంద్ర ప్రసాద్*అమరావతి (ప్రజా అమరావతి);

వైపీపీ ప్రభుత్వ వైఫల్యాల్ని, జగన్ రెడ్డి దోపిడిని సోషల్ మీడియాలో ఎండగడుతున్నవారిపై సీఐడీ పోలీసులు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ద్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.... వైసీపీ అరాచకాలపై పోరాటం చేస్తున్నందుకే చింతకాయల అయన్నపాత్రుడు, చింతకాయల విజయ్ ని వైసీపీ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోంది. పోలీసులు అనుమతి లేకుండా విజయ్ ఇంట్లో కి ఎలా వెళ్తారు?  ఇంట్లో కుటుంబ సభ్యుల్ని, పిల్లల్ని భయభ్రాంతులకు గురి చేయడం పని వాళ్లని అరెస్ట్ చేసే ప్రయత్నం దుర్మార్గం. ఇటువంటి అరెస్ట్ లు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని హైకోర్టు ఎన్నో సార్లు చెప్పింది. సోషల్ మీడియాకి సంబంధించి మనమేం చర్యలు తీసుకోలేమని సుప్రీం కోర్టులో అటార్ని జనరల్ చెప్పడం జరిగింది. స్వయంగా జస్టిస్ చలమేశ్వర్ ఈ సెక్షన్ ని రూల్ అవుట్ చేయాలని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం కోర్టు ఆదేశాల్ని పాటించటం లేదు.  న్యాయస్ధానాల్ని, రాజ్యాంగాన్ని పక్కనపెట్టి నేను చెప్పిందే వేదం అన్నట్టు జగన్ రెడ్డి వ్యవహరిస్తూ ప్రజలని భయపెట్టి పరిపాలన సాగిస్తున్నారు. ఇటువంటి నిరంకుశత్వ పాలనకు కాలం చెల్లుతుంది. ఏపీ నుంచే పొరుగు రాష్ట్రాలకు గంజాయి సరఫరా అవుతోందని  తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్ర పోలీసులు చెప్పారు. దానిపై  ఆనంద్ బాబు మాట్లాడిస్గే నోటిసులు ఇవ్వడం  ఎంత వరకు సమంజసం?  మీ పాలన సరిగా లేదన్నందుకు రైతు మీద, వ్యాపారి మీద దాడి చేయడం దుర్మార్గం. ఇటువంటి పాలన తీరుతోనేనా అభివృద్ధి, ప్రగతి సాధించామని గొప్పలు చెప్పుకుంటున్నారు. సీఎం అసెంబ్లీ సాక్షిగా ప్రతినిత్యం అబద్ధాలని వల్లెవేశారు. అబద్ధాలు మాట్లాడిన మీ మీద ఎక్కడైనా కేసులు నమోదయ్యాయా. టీడీపీ కార్యకర్తలపై , సామాన్య ప్రజలపై దాడులు చేసినా వైసీపీ వారికి పోలీసులు ఏనాడైనా నోటీసులిచ్చారా? ఏపీలో హైకోర్ట్ ఉత్తర్వులు ఇస్తే అమలు చేయలేని పరిస్థితి. చివరకు సిబిఐని భయపెడుతున్నారు. వ్యవస్థలన్ని నాశనం చేసి నియతృత్వ పోకడతో పాలన సాగిస్తున్నారు.  బిసి వర్గానికి చెందిన మండల్ విగ్రహా ఏర్పాటును అడ్డుకుని  దిమ్మెను పగులగొట్టిన దుర్మార్గ ప్రభుత్వం జగన్ రెడ్డిది. బిసిలకు ఇచ్చే మర్యాద ఇదేనా?  గతంలో  చింతకాయల విజయ్ పై ఎటువంటి చర్యలని తీసుకోడానికి వీళ్లేదని కోర్టు చెప్పింది, కానీ  మళ్లీ పోలీసులు  అతని ఇంటి మీదకు అర్ధరాత్రి వెళ్లారంటే ఇంతకన్నా అన్యాయం ఇంకోటి ఉంటుందా? రేపు  అధికారంలోకి వచ్చేది టీడీపీ ప్రభుత్వమే, వైసీపీకి తొత్తులుగా మారి చట్టాన్ని ఉల్లఘింస్తున్న పోలీసు అధికారులపై చర్యలు తప్పవు. గతంలో ఉన్న డీజీపీని, ప్రిన్సిపల్ సెక్రటరీని, చీఫ్ సెక్రటరీ ని హైకోర్టు అనేకసార్లు మొట్టికాయలు వేసిసింది, అయినా అధికారులకు బుద్ది రావటం లేదు.  ఇప్పుడున్న డీజీపీ సైతం కోర్టు మొట్లెక్కి బోనులో నిలబడి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్ధితి దాపురించింది. సుప్రీం కోర్టులో అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ లో చాలా స్పష్టంగా కొన్ని సూచనలు చేయడం జరిగింది. సుప్రీం కోర్టు కూడా ఎన్నోసార్లు 41ఎ నోటిసులు లేకుండా అరెస్టులు చేయొద్దని స్పష్టం చేసింది. ఏడేళ్లలోపు శిక్ష ఉన్న సెక్షన్లు నమోదు అయితే ఖచ్చితంగా 41ఎ నోటిసులు ఇవ్వాలని చెప్పడం జరిగింది. అంకబాబు అరెస్ట్ కు సంబంధించి మెజిస్ట్రేట్ 41ఎ నోటిసు ఇచ్చారా అని ప్రశ్నించారు. రిఫ్యూజ్ చేశారని సమాధానమిస్తే దానికి ఆధారాలు ఉన్నాయని అడిగినందుకు సమాధానం ఇవ్వకపోయేసరికి వివరణ ఇవ్వాలని కోరిన మెమోని గుర్తు తెచ్చుకోవాలి. ఇంత జరుగుతున్నా పోలీసుల తీరు మారట్లేదు. రోజుకో కొత్త విధానంతో కొత్త నష్టంతో ప్రజలకి మాయ మాటలు చెప్పి మభ్యపెడుతున్నారు. ప్రజలను భయపెట్టడానికి నిరంకుశత్వంతోనే పాలన చేస్తాననడం తప్పు. మీ తీరు మార్చుకోకపోతే మూల్యం చెల్లించుకోక తప్పదు.  ఈ ప్రభుత్వానికి చట్టాన్ని గౌరవించడం తెలీదు. చట్టంలో రూపొందిచుకున్నామో, రాజ్యాంగాన్ని విస్మరించి ప్రజాస్వామ్య వ్యవస్థకు తిలోదకాలు ఇచ్చి నిరంకుశత్వ పోకడతో ప్రజలని భయభ్రాంతుకు గురి చేస్తున్నారు. చింతకాయల విజయ్  ఏం నేరం చేశాడని అర్ధరాత్రి ఇంటి మీదకు వెళ్లారు. 41ఎ నోటిసు ఎందుకు ఇవ్వలేదు. అతను ఇంట్లో లేడని పసిపిల్లలని, పని వాళ్లని భయభ్రాంతులకు గురి చేయడం దుర్మార్గం. వర్గాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి అగ్నిగుండంలా రాష్ట్రాన్ని మారుస్తున్నారు. ఇందుకేనా మీరు 151 సీట్లు గెలిచింది. మంది గెలవడం కాదు, మందలా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి, మాఫియా మయం అయిపోయింది. ప్రజా చైతన్యం కోసం మేం చేస్తున్న ఉద్యమాన్ని జగన్ రెడ్డి ఆపలేరు. సమయం వచ్చినప్పుడు మీరు చేసిన ప్రతిధానికి లెక్కకు లెక్క చెబుతాం. మేం స్వయాన డీజీపీకి వినతి పత్రం ఇచ్చిన ఎటువంటి చలనం లేని పోలిసు వ్యవస్ధ, ప్రభుత్వం. కానిస్టేబుల్ నుంచి పైస్ధాయి అధికారి వరకు యధా రాజ తథా కేడర్ అనే రీతిలో వ్యవహరిస్తున్నారని ఆలపాటి రాజా  మండిపడ్డారు.

Comments
Popular posts
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది.
Image
ఇంటర్నెట్‌లో గూగుల్ సెర్చ్‌లో సైబర్ క్రైమ్ కేసులు పెరుగుతున్నాయి.
Image
న్యాయప్రక్రియకు..రాజ్యాంగపరమైన చట్టాలకు లోబడి వికేంద్రీకరణ చేయబోతున్నాం.
Image
ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు
Image
*ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
Image