*మైనారిటీల సంక్షేమం,అభ్యున్నతికి రాష్ట్రంలో పత్యేకచట్టం*
*•దేశంలో తొలిసారిగా మైనారిటీలకు ప్రత్యేక చట్టాన్ని రూపొందించిన జగన్ ప్రభుత్వం*
*•ఈఏడాది మే24 నుండి రాష్ట్రంలోఅమల్లోకివచ్చిన ఏపీ మైనారిటీస్ కంపొనెంట్ యాక్టు-2022*
*•ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ తరహాలో మైనారిటీల దామాషా ప్రకారం 8.8% నిధులు కేటాయింపు*
*•వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి ఈ చట్టాన్ని పటిష్టంగా అమలు పర్చేందుకు శాఖలన్నీ సహకరించాలి*
*ఉప ముఖ్యమంత్రి (మైనారిటీల సంక్షేమం) అంజాద్ భాషా షేక్ బిపారి*
అమరావతి, అక్టోబరు 27 (ప్రజా అమరావతి): దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలోని మైనారిటీల సంక్షేమం, అభివృద్దికై ప్రత్యేక చట్టాన్ని రూపొందించిన ఘనత జగనన్న ప్రభుత్వానికే దక్కుతుందని ఉప ముఖ్యమంత్రి మరియు మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి అంజాద్ భాషా షేక్ బిపారి పేర్కొన్నారు. ఈ ఏడాది మే 24 నుండి రాష్ట్రంలో ఏపీ మైనారిటీస్ కంపొనెంట్ యాక్టు-2022 అమల్లోకి వచ్చిందని, ఈ చట్టం ప్రకారం ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ తరహాలో మైనారిటీ జనాభా ప్రాతిపదికన ప్రతి శాఖ 8.8% నిధులను మైనారిటీల సంక్షేమం, అభివృద్దికి తప్పని సరిగా వెచ్చించాల్సి ఉందన్నారు. ఈ నూతన చట్టంపై అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమగ్రమైన అవగాహనను ఏర్పర్చుకొని వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి ఈ చట్టాన్ని పటిష్టంగా అమలు పర్చేందుకు సహకరించాలని ఆయన కోరారు. గురువారం అమరావతి సచివాలయం ఐదో బ్లాక్ సమావేశ మందిరంలో రాష్ట్ర మైనారిటీల సంక్షేమ శాఖ ఆద్వర్యంలో లైన్ డిపార్టుమెంట్ అధికారులకు ఈ చట్టంపై అవగాహన కల్పించే సమావేశం ఉప ముఖ్యమంత్రి మరియు మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి అంజాద్ భాషా షేక్ బిపారి అద్యక్షతన జరిగింది. ఈ సందర్బంగా ఉపముఖ్యమంత్రి అంజాద్ భాషా షేక్ బిపారి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిపెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రంలోని మైనారిటీల సంక్షేమం, అభివృద్దిని కాంక్షిస్తూ ఏపీ మైనారిటీస్ కంపొనెంట్ యాక్టు-2022 ఈ ఏడాది మే 24 నుండి రాష్ట్రంలో అమల్లోకి తీసుకురావడం జరిగిందన్నారు. మైనారిటీల సంక్షేమాన్ని కాంక్షిస్తూ దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో అమల్లోకి తీసుకువచ్చిన చారిత్రాత్మక చట్టము ఇదని ఆయన అభివర్ణించారు. అన్ని ప్రభుత్వ శాఖలు దామాషా ప్రాతిపదిక వారికి వెచ్చించాల్సిన నిధులను వెచ్చిస్తూ రానున్న పదేళ్ల కాలంలో మైనారిటీలు సామాజికంగా, ఆర్థికంగా వేగవంతమైన అభ్యున్నతి సాధించి తద్వారా సామాజిక భద్రత, గౌరవాన్ని, సమానత్వాన్ని పొందాలనే లక్ష్యంతో ఈ చట్టాన్ని రాష్ట్రంలో అమల్లోకి తీసుకురావడం జరిగిందని ఆయన అన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభాలో 8.8% మంది అంటే 43.46 లక్షల మైనారిటీ జనాభా రాష్ట్రంలో ఉన్నారని, ఆ దామాషా ప్రకారం మైనారిటీల సంక్షేమం, అభివృద్దికై అన్ని ప్రభుత్వ శాఖలు తమ బడ్జెట్ నుండి 8.8% నిధులను ప్రతి ఆర్థిక సంవత్సరం కేటాయించాలని ఆయన కోరారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ తరహాలో ఈ చట్టాన్ని రాష్ట్రంలో విజయవంతంగా అమలుపర్చేందుకు అన్ని శాఖల అధికారులు సంపూర్ణ సహకారాన్ని అందజేయాలని ఆయన కోరారు.
రాష్ట్ర మైనారిటీల సంక్షేమ శాఖ కార్యదర్శి ఇంథియాజ్ మాట్లాడుతూ 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 43.46 లక్షల మైనారిటీ జనాభా ఉందని, వారిలో 36.18 లక్షల మంది ముస్లింలు, 6.83 లక్షల మంది క్రిష్టియన్లు, 0.10 లక్షల మంది సిక్కులు, 0.04 లక్షల మంది బుద్దిస్టులు, 0.27 లక్షల మంది జైనులు మరియు 0.04 లక్షల మంది పారసీకులు ఉన్నట్లు తెలిపారు. వీరందరి సంక్షేమాన్ని, అభ్యున్నతిని కాంక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రత్యేక చట్టాన్ని రూపొందించి అమల్లోకి తెచ్చినట్లు తెలిపారు. అన్ని శాఖల అధికారులు ఈ చట్టంపై సమగ్రమైన అవగాహనను ఏర్పర్చుకొని వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి మైనారిటీల సంక్షేమం, అభివృద్దికి సమగ్రమైన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించి అమలు పర్చాలని అన్ని శాఖల అధికారులను ఆయన కోరారు.
రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ సంచాలకులు డా.జి.సి.కిషోర్ కుమార్, వక్ఫ్ బోర్డు సి.ఇ.ఓ. అబ్దుల్ ఖాదిర్, వక్ఫ్ సర్వే కమినషర్ షరీన్ బేగం, రాష్ట్ర ఉర్దూ అకాడమీ సంచాలకులు డా.ఎన్.ఆయూబ్ హుస్సేన్, సిఇఎండి సంచాలకులు డా. మస్తాన్ వలీ, రాష్ట్ర క్రిష్టియన్ మైనార్టీల కార్పొరేషన్ ఎం.డి. జె.ఎలీషా, కార్యదర్శి ఓ.ఎస్.డి. టి.నరసింహులు తదితరులతో పాటు అన్ని జిల్లాల మైనారిటీ సంక్షేమ అధికారులు ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు.
addComments
Post a Comment