జాప్యం లేకుండా నీరు-చెట్టు బకాయిలు వెంటనే* *రైతుల ఖాతా ల్లో జమ చేయాలి

 *జాప్యం లేకుండా నీరు-చెట్టు బకాయిలు వెంటనే* *రైతుల ఖాతా ల్లో జమ చేయాలి*

*హై కోర్టు తీర్పును గౌరవించని జగన్ సర్కార్*

*టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు*

విజయవాడ (ప్రజా అమరావతి): గత మూడేళ్లుగా నీరు-చెట్టు బిల్లులు పెండింగ్ లో పెట్టడం దారుణమని, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నిర్వాకం కారణంగా పలువురు ఆత్మహత్య చేసుకోగా, వందలాదిమంది అప్పుల ఊబిలో కూరుకుపోయారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం రాత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ  అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ను నీరు-చెట్టు ఫిర్యాదుల విభాగం బాధ్యులు,సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు కలిసి పెండింగ్ బిల్లుల పురోగతిని నివేదించారు. దీనిపై ఆయన స్పందిస్తూ నీరు-చెట్టు బిల్లులు అందక రైతుల ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. నీరు చెట్టు నిధులు విడుదలకు జూన్ నెలలో జీ.వో లు మాత్రమే ఇచ్చి రైతుల ఖాతాలకు ఇప్పటి వరకు నగదు ను జమ చేయకపోవడం చాలా దారుణం అన్నారు.

నీరు - చెట్టు బాధితులకు ఆఖరి రూపాయి అందే వరకు కృషి చేయాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశాలను  అమలు చేయకపోతే అవసరమైతే ధిక్కార పిటిషన్లు వేసి పనులు చేసిన రైతులకు అండగా ఉండాలని నీరు - చెట్టు ఫిర్యాదుల విభాగానికి సూచన చేశారు.ఇదే విషయమై విజయవాడలోని సమాఖ్య కార్యాలయము నుండి ఈరోజు ఉదయం అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు పూర్తి వివరాలతో పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ...

నీరు-చెట్టు పెండింగ్ బిల్లులు చెల్లించాలని నేటివకు 6210 మంది గౌరవ హైకోర్టును ఆశ్రయించగా, ఆరువారాల్లో పెండింగ్ బిల్లులు చెల్లించాలని ఆదేశాలిచ్చానా అమలుచేయకపోవడంతో సుమారు 3225 మంది బాధితరైతుల ధిక్కార పిటిషన్లు వేశారని తెలిపారు. చివరిగా రూ.200 కోట్లకు సంబంధించి జీ.ఓ మాత్రమే ఇచ్చి నగదు చెల్లించకుండా ట్రెజరీ అధికారులు,మైనర్ ఇరిగేషన్ శాఖ అధికారుల మధ్య సమన్వయం లేక 4 నెలలుగా కాలయాపన చేయడం చాలా దారుణం అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సి.ఎఫ్.ఎం.ఎస్ టోకెన్లు పడిన రూ.1277 కోట్ల బిల్లులకు సంబంధించి ఇప్పటివరకు రాష్ట్రప్రభుత్వం రూ.429 కోట్లు విడుదల చేసినట్లయిందని పేర్కొన్నారు.

నీరు చెట్టు పనులు చేసిన సన్న చిన్న కారు రైతులు మూడేళ్లు పూర్తవడంతో ఆర్థికంగా చితికిపోయి వడ్డీలు కట్టలేక అప్పులపాలై  నానా ఇబ్బందులు  పడుతున్నారని ఇప్పటికీ పనులు చేసిన రైతుల్లో కర్నూలు జిల్లా పాణ్యం లో ఒకరు,  ప్రకాశం జిల్లా గిద్దలూరు లో ఒకరు మనోవేదనతో మరణించారని విశాఖపట్నం జిల్లాలో మాజీ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గండి ముసిలినాయుడు కు గుండెపోటు వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. పనులు చేసిన రైతులు కోట్ల డబ్బు ఉన్న కాంట్రాక్టర్లు కాదని కేవలం గ్రామాల్లో అభివృద్ధి కోసం పనులు చేసిన  అభివృద్ధికాముఖులు అని గుర్తించి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మెమో ల పేరుతో  కక్షపూరిత ధోరణిని విడనాడి  గతంలో  నరేగా బిల్లులు చెల్లించిన విధంగా గౌరవ హైకోర్టు ఆదేశాల మేరకు నీరు చెట్టు బిల్లులు వెంటనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో  రాష్ట్ర నీరు చెట్టు పెండింగ్ బిల్లుల కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు, రాష్ట్ర తెలుగురైతు ప్రధాన కార్యదర్శి కుర్రా నరేంద్ర, రాష్ట్ర టీడీపీ కార్యదర్శి దొంతు చిన్నా తదితరులు పాల్గొన్నారు..

Comments