అర్హత గల ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు


నెల్లూరు అక్టోబర్ 28 (ప్రజా అమరావతి);


అర్హత గల ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించి ఆర్ధికంగా నిలదొక్కుకునేందుకు ఊతమిస్తూ వారిని బలోపేతం చేస్తున్న ఏకైక ప్రభుత్వం తమదని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ & పుడ్ ప్రాసెసింగ్ శాఖామాత్యులు శ్రీ కాకాణి గోవర్ధన రెడ్డి పేర్కొన్నారు.


శుక్రవారం సాయంత్రం సర్వేపల్లి నియోజకవర్గం లోని పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం  కార్యక్రమం నిర్వహించిన మంత్రి కాకాణి గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతున్న వైనం తెలుసుకుంటూ ప్రజలతో మమేకమయ్యారు. 


ఈ సందర్భంగా మంత్రి కాకాణి మీడియాతో మాట్లాడుతూ తాటిపర్తి గ్రామంలో రెండవ రోజున గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, చిన్న చిన్న సమస్యలకు తక్షణ పరిష్కారం చూపుతున్నామన్నారు. కుటుంబాలలో వ్యక్తులు చనిపోయినప్పటికీ,  రేషన్ కార్డులో మార్పులు చేసుకోనందువల్ల కొందరికి పెన్షన్ మంజూరు కాలేదన్నారు. ఇటువంటి విషయాలపై వాలంటీర్లు తప్పనిసరిగా ఆయా కుటుంబాల వారికి అవగాహన కలిగించాలన్నారు. గ్రామాల్లోని అర్హత గల ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించాలని ఆరాటపడే ప్రభుత్వం తమదన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన మూడు సంవత్సరాల కాలంలో తాటిపర్తి గ్రామ సచివాలయ పరిధిలోని పూజల అరుణమ్మ కు

రు 6,78,196/-, ఎల్లంపల్లి బుజ్జమ్మ కు

రు. 6,51,750/-, యామల రత్నమ్మ కు

రు. 5,28,966/- లు వివిధ పధకాలు ద్వారా ఆర్ధిక సహాయం అందజేశామన్నారు. ఇంత పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం అందజేసిన ప్రభుత్వాలు గతంలో లేవన్నారు. అదేవిధంగా పొదలకూరు మండలంలోని నవూరిపల్లి నుండి పొడమికల కండ్రిగ వరకు గల రోడ్డు నిర్మాణానికి 1 కోటి 38 లక్షలు, చాటగుట్ల నుండి బైదబోలు వరకు గల రోడ్డు నిర్మాణానికి 2 కోట్ల 60 లక్షలు, ముత్తుకూరు మండలంలోని దువ్వూరు వారి పాలెం నుండి పచ్చికాయల మిట్ట వరకు 1 కోటి 17 లక్షలు కలిపి మొత్తం 5 కోట్ల 15 లక్షల నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ప్రజలు కోరుకున్న ప్రతి పనిని అందజేస్తామన్నారు.


ఈ కార్యక్రమంలో ఎంపీడీవో నగేష్ కుమారి, తహసీల్దార్ ప్రసాద్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.


(జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కార్యాలయం, నెల్లూరు వారిచే జారీ చేయడమైనది)

    





Comments