బెల్టుషాపుల నిర్వహణ, అక్రమ మద్యం ఘటనలపై నిరంతరం నివేదికలు తెప్పించుకోవాలన్న సీఎం.*ఆదాయాలను సమకూరుస్తున్న శాఖలపై సీఎం సమీక్ష.*


*గాడిలో రాష్ట్రం ఆదాయాలు.* 

*ఆశాజనకంగా ఆర్థిక సంవత్సరం ప్రధమార్థంలో ఆదాయాల ప్రగతి.*

*94.47శాతం లక్ష్యం చేరిక.*

*దేశ సగటుతో పోలిస్తే రాష్ట్రంలో అధికంగా జీఎస్టీ సగటు వసూళ్లు.*

*పన్ను వసూళ్లలో లీకేజీలను అరికట్టడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్న సీఎం.*

*పారదర్శక, సులభతర విధానాలద్వారా చెల్లింపుదారులకు సౌలభ్యంగా ఉండాలన్న సీఎం.*

*రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో పారదర్శక, సులభతర విధానాలపై కమిటీని ఏర్పాటు చేసిన సీఎం.*

*నాటుసారా తయారీయే వృత్తిగా ఉన్న వారికి ప్రత్యామ్నాయ జీవనోపాధి చూపించాలని అధికారులకు సీఎం ఆదేశం*

*అనుమతులు పొందిన లీజుదారులు మైనింగ్‌ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం*

*వారికేమైనా ఇబ్బందులు ఉంటే తీర్చేలా తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం*

*రవాణా శాఖలో ఆదాయాల పెంపుపై చర్యలు తీసుకోవాలన్న సీఎం*


అమరావతి (ప్రజా అమరావతి);

*ఆదాయాన్నిచ్చే శాఖలపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.*

రాష్ట్రానికి వచ్చే ఆదాయాలు గాడిలో ఉన్నాయని వివరించిన అధికారులు

ఆర్థిక సంవత్సరం మొదటి ఆరునెలల్లో ఆదాయాల ప్రగతిని వివరించిన అధికారులు.

జీఎస్‌టీ వసూళ్లు సహా.. ఇతర ఆదాయాలు నిర్దేశించుకున్న లక్ష్యానికి చేరువలో ఉన్నాయన్న అధికారులు.

పారదర్శక విధానాలు, నిబంధనలు కచ్చితంగా అమలు చేయడం వల్ల ఆదాయాలు గాడిలో ఉన్నాయని తెలిపిన అధికారులు.

సెప్టెంబరు 2022 వరకూ లక్ష్యం రూ.27,445 కోట్లు కాగా, రూ. 25,928 కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపిన అధికారులు. 

94.47శాతం లక్ష్యం చేరుకున్నామని తెలిపిన అధికారులు.

ఈ కాలంలో దేశ జీఎస్టీ వసూళ్ల సగటు 27.8 శాతం కాగా, ఏపీలో 28.79శాతంగా ఉందని తెలిపిన అధికారులు.

లీకేజీలను అరికట్టడానికి తీసుకుంటున్న చర్యలను వివరించిన అధికారులు. 

ట్యాక్స్‌ ఇన్ఫర్మేషన్‌ మరియు ఇన్వెస్టిమెంట్‌ మేనేజిమెంట్‌ సిస్టంను అభివృద్ధి పరిచామన్న అధికారులు. 

హెచ్‌ఓడీ కార్యాలయంలో డేటా అనలిటిక్స్‌ సెంటర్‌ ఏర్పాటు చేశామని దీనికి సంబంధించిన సిబ్బందిని కూడా నియమించామని తెలిపిన అధికారులు.


*ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే...:*

ఎక్కడా లీకేజీలు లేకుండా చూసుకోవాలన్న సీఎం.

లీకేజీలను అరికట్టడానికి అవసరమైతే ప్రొఫెషనల్‌ ఇనిస్టిట్యూట్‌ల సహాయం తీసుకోవాలన్న సీఎం.

పన్ను చెల్లింపు దారులకు సులభతర, పారదర్శక విధానాలను అందుబాటులో ఉంచాలన్న సీఎం. 


గ్రామాల్లో మహిళా పోలీసులనుంచి తప్పనిసరిగా ప్రతిరోజూ నివేదికలు తీసుకోవాలన్న సీఎం. 

బెల్టుషాపుల నిర్వహణ, అక్రమ మద్యం ఘటనలపై నిరంతరం నివేదికలు తెప్పించుకోవాలన్న సీఎం.


ఈ నివేదికలు ఆధారంగా తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం. 

నాటుసారా తయారీ వృత్తిగా కొనసాగిస్తున్న వారి జీవితాలను మార్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్న సీఎం. 

ప్రత్యామ్నాయ జీవనోపాధి మార్గాలను వారికి అందుబాటులో తీసుకు రావాలన్న సీఎం

దీనికోసం ప్రత్యేక కార్యాచరణ సిద్ధంచేయాలని సీఎం ఆదేశం. 

అక్రమ మద్యం తయారీ, నిరోధంపై గట్టి చర్యలు తీసుకోవాలన్న సీఎం.

రిజిస్ట్రేషన్‌ ఆదాయాలపై ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశం.

ఈ కమిటీలో ఐఏఎస్‌అధికారులు కృష్ణబాబు, రజత్‌ భార్గవ, నీరబ్‌ కుమార్‌ ప్రసాద్, గుల్జార్‌లను సభ్యులుగా పెట్టాలని సీఎం ఆదేశం.

రెండు వారాల్లోగా ఈ కమిటీ నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశం. రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాల్సిన సేవలు ఏంటి? వాటివల్ల ఎలాంటి హక్కులు దఖలు పడతాయి? అది ప్రజలకు ఎలా ఉపయోగం అన్నదానిపై అవగాహన కల్పించాలన్న సీఎం.

అలాగే రిజిస్ట్రేషన్‌ చేయించుకునేవారికి సులభతర,  పారదర్శక విధానాలను అందుబాటులోకి తీసుకురావాలన్న సీఎం. 

నాన్‌ రిజిస్ట్రేషన్‌ పరిస్థితులను పూర్తిగా తొలగించాలన్న సీఎం.

ఇందులో ప్రొఫెసనల్‌ ఏజెన్సీల సహాయాన్ని తీసుకోవాలన్న సీఎం.

ఆస్తుల విలువ మదింపు, మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మన దగ్గర పరిస్థితులు ఎలా ఉన్నాయి? తదితర అంశాలపై హేతుబద్ధత ఉండేలా చూడాలన్న సీఎం

రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ప్రజలకు సులభతరం చేసేందుకు, అందుకు తగిన చర్యలు తీసుకునేందుకు ప్రొఫెషనల్‌ ఏజెన్సీల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించాలన్న సీఎం. 

గ్రామ, వార్డు సచివాలయాల్లో సంపూర్ణంగా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ నడిచేందుకు తగిన మార్గదర్శకాలను కూడా రూపొందించాలన్న సీఎం. 

భూములు, ఆస్తులే కాకుండా రిజిస్ట్రేషన్‌ చేయించుకోతగిన సేవల వివరాలను పోస్టర్ల రూపంలో సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలతో పాటు, గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచాలని సీఎం ఆదేశం. 

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఏసీబీ ఫిర్యాదు నంబరు ఉంచాలన్న సీఎం. ఈ పోస్టర్లను అన్ని కార్యాలయాల్లో ఉంచాలన్న సీఎం. 


గనులు, ఖనిజాల నుంచి గతేడాది సెప్టెంబరు వరకూ రూ.1,174 కోట్ల ఆదాయం కాగా, ఈ ఏడాది  సెప్టెంబరు వరకూ రూ.1400 కోట్లు ఆదాయం. 

మొత్తంగా 19శాతం పెరుగుదల. 

మొత్తం ఆర్ధిక సంవత్సరం ముగిసేనాటికి 43శాతం పెరుగుదల ఉంటుందని అంచనాగా తెలిపిన అధికారులు.

మైనింగ్‌ కోసం ఇప్పటికే అనుమతులు పొందిన వారు, లీజు లైసెన్సులు  పొందినవారు మైనింగ్‌ ఆపరేషన్‌ కొనసాగించేలా చూడాలన్న సీఎం. 

దీనివల్ల ఆదాయాలు పెరుగుతాయన్న సీఎం. 

ఆపరేషన్‌లో లేనివాటిపై దృష్టిపెట్టి, లీజుదారులకున్న ఇబ్బందులను పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం. 

మైనింగ్ ఆపరేషన్‌ చేయకపోవడానికి కారణం ఏంటి? వారికున్న ఇబ్బందులు ఏంటి? వారికి చేదోడుగా ఎలా నిలవాలి? తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ఒక మార్గదర్శక ప్రణాళిక రూపొందించుకోవాలన్న సీఎం.

ప్రతినెలా కూడా సమగ్ర సమీక్ష జరిపి, ఆదాయాలు వృద్ధి చెందేలా తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం. 

లక్ష్యాలను చేరుకుంటున్నామా? లేదా? అన్నదానిపై నిరంతరం సమీక్ష చేయాలన్న సీఎం. 


ఇతర రాష్ట్రాలతో పోల్చితే సానుకూల పరిస్థితులను సృష్టించుకోవడం ద్వారా... రవాణా శాఖలో ఆదాయం పెంచుకునేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం.

కేవలం పన్నులు పెంచడమే దీనికి పరిష్కారం కాదని, వినూత్న ఆలోచనలు చేయాలన్న సీఎం.

పక్కరాష్ట్రాలతో పోలిస్తే.. వాహనాల కొనుగోలుకు తగిన సానుకూల పరిస్థితులు రాష్ట్రంలో ఉండేలా ఆలోచనలు చేయాలన్న సీఎం.

ప్రభుత్వం నుంచి డబ్బు తీసుకుని డీలర్లు వాహనాలు ఇవ్వని ఘటనలు వెలుగుచూశాయన్న సీఎం.

దీనిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలన్న సీఎం.

 

ఈ సమీక్షా సమావేశానికి ఉపముఖ్యమంత్రి (ఎక్సైజ్‌ శాఖ ) కె నారాయణస్వామి, విద్యుత్, అటవీ పర్యావరణ, భూగర్భ గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్‌ సమీర్‌ శర్మ, అటవీపర్యావరణ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ స్పెషల్‌ సీఎస్‌ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్, ఆర్ధికశాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎస్‌ ఎస్‌ రావత్, ఎక్సైజ్‌ శాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్‌ కుమార్, 

ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్స్‌  వై మధుసూధన్‌రెడ్డి, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ కుమార్, కమర్షియల్‌ టాక్స్‌ చీఫ్‌ కమిషనర్‌ గిరిజా శంకర్‌ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Comments
Popular posts
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది.
Image
న్యాయప్రక్రియకు..రాజ్యాంగపరమైన చట్టాలకు లోబడి వికేంద్రీకరణ చేయబోతున్నాం.
Image
ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు
Image
*ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
Image
बर्खास्त होंगे उत्तराखंड विधानसभा सचिवालय के 228 कर्मी, हाईकोर्ट ने फैसला सही कहा।
Image