అధిక వర్షాల సూచన దృష్ట్యా కంట్రోల్ రూమ్ ఏర్పాటు*
:జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్
పుట్టపర్తి, అక్టోబర్ 12 (ప్రజా అమరావతి):
జిల్లాలో ఈరోజు నుంచి 5 రోజుల పాటు అధిక వర్షాలు వస్తాయని వాతావరణ శాఖ సూచించడంతో ముందు జాగ్రత్త చర్యగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ బసంత కుమార్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ముందుస్తు చర్యలతో ప్రజలను అప్రమత్తం చేయడానికి జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. 08555292432, 9154968578 నెంబర్లకు డయల్ చేసి జిల్లా వాసులు కంట్రోల్ రూమ్ సేవలు పొందవచ్చని, 24 గంటలు షిఫ్ట్ పద్ధతిలో సిబ్బందిని నియమించామని పై ప్రకటనలో తెలిపారు. డివిజన్ కేంద్రాల్లో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయు నునట్లు తెలిపారు
addComments
Post a Comment