విజ‌య‌న‌గ‌రం ఉత్స‌వాల‌ను విజ‌య‌వంతం చేయాలి



విజ‌య‌న‌గ‌రం ఉత్స‌వాల‌ను విజ‌య‌వంతం చేయాలి


వేదిక‌ల‌ను ప‌రిశీలించిన క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి

భ‌క్తులు ఇబ్బంది ప‌డ‌కుండా ఏర్పాట్లు చేయాల‌ని ఆదేశం


విజ‌య‌న‌గ‌రం, అక్టోబ‌రు 03 (ప్రజా అమరావతి) ః

             ఈనెల 9,10,11 తేదీల్లో జ‌ర‌గ‌నున్న‌ విజ‌య‌న‌గ‌రం ఉత్స‌వాలని విజ‌య‌వంతం చేసేందుకు ప్ర‌తీఒక్క‌రూ స‌హ‌క‌రించాల‌ని  జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి కోరారు. గ‌తం కంటే వైభ‌వంగా ఈ సారి ఉత్స‌వాల‌కు ఏర్పాట్ల‌ను చేస్తున్న‌ట్లు చెప్పారు. సంప్ర‌దాయ వేదిక‌ల‌తోపాటు ఈ సారి కొత్త‌గా మ‌న్నార్ రాజ‌గోపాల‌స్వామి ఆల‌యంలో ప‌థ్య‌ప‌ఠ‌నం, అవ‌థానం ఏర్పాటు చేస్తున్నామ‌న్నారు. శిల్పారామంలో వివిధ జాన‌ప‌ద క్రీడ‌ల ప్ర‌ద‌ర్శ‌న జ‌రుగుతుంద‌ని చెప్పారు. రెవెన్యూ హోమ్‌లో పాట‌ల పోటీల‌ను నిర్వ‌హిస్తున్నామని తెలిపారు. పైడిత‌ల్లి అమ్మ‌వారి సిరిమానోత్స‌వానికి వ‌చ్చే భ‌క్తుల‌కు ఎటువంటి ఇబ్బంది క‌ల‌గ‌కుండా, విజ‌య‌న‌గ‌రం ఉత్స‌వాల‌కు ప‌టిష్ట‌మైన ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు చెప్పారు.  ఉత్స‌వాలు జ‌రిగే వేదిక‌ల‌ను క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి, సోమ‌వారం సంద‌ర్శించి,  ఏర్పాట్ల‌ను ప‌రిశీలించారు.


              అయోధ్యా మైదానాన్ని క‌లెక్ట‌ర్ ముందుగా సంద‌ర్శించారు. మెగా క‌ల్చ‌ర‌ల్ ఈవెంట్ కోసం మైదానంలో చేస్తున్న ఏర్పాట్ల‌ను, వ‌యోజ‌న విద్యాశాఖ డిడి కోట్ల సుగుణాక‌ర‌రావు, సిపిఓ పి.బాలాజీ వివ‌రించారు. వేదిక‌ను మైదానం మ‌ద్య‌లో ఏర్పాటు చేయాల‌ని, ప్ర‌త్యేకంగా పార్కింగ్ కోసం స్థ‌లాన్ని విడిచిపెట్టాల‌ని, గ్యాల‌రీని బాగుచేసి, ప్రేక్ష‌కులు కూర్చొనేవిధంగా ఏర్పాటు చేయాల‌ని, మైదానంలోని పిచ్చిమొక్క‌ల‌ను తొల‌గించాల‌ని క‌లెక్ట‌ర్ సూచించారు. అమ్మ‌వారి జాత‌ర‌కు వ‌చ్చే భ‌క్తులు పార్కింగ్ కోసం ఇబ్బంది ప‌డ‌కుండా, త‌గిన ఏర్పాట్లు చేయాల‌ని, డిఎస్‌పి త్రినాధ్‌కు క‌లెక్ట‌ర్ సూచించారు.


             సాంస్కృతిక కార్య‌క్రమాల‌ను నిర్వ‌హించే ఆనంద‌గ‌జ‌ప‌తి ఆడిటోరియంను సంద‌ర్శించారు. అక్క‌డ చేస్తున్న ఏర్పాట్ల‌ను మెప్మా పిడి సుధాక‌ర‌రావు, డిప్యుటీ సిఇఓ కె.రాజ్‌కుమార్, మున్సిప‌ల్ ఇఇ శ్రీ‌నివాస‌రావు వివ‌రించారు. ర్యాలీ అనంత‌రం నిర్వ‌హించే క‌ళారూపాల ప్ర‌ద‌ర్శ‌న కోసం చేస్తున్న ఏర్పాట్ల‌పై క‌లెక్ట‌ర్ ఆరా తీశారు. సుమారు ప‌దివేల మంది ర్యాలీలో పాల్గొంటార‌ని, ఎవ‌రికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాల‌ని సూచించారు. ఆల‌య న‌మూనాల‌ను ప్ర‌ద‌ర్శించే టిటిడి క‌ల్యాణ మండ‌పం, నాట‌క ప్ర‌ద‌ర్శ‌న జ‌రిగే గుర‌జాడ క‌ళాక్షేత్రం, మ‌హారాజా ప్ర‌భుత్వ సంగీత‌, నృత్య క‌ళాశాల‌ను ప‌రిశీలించారు. ఫ‌ల పుష్ప ప్ర‌ద‌ర్శ‌న‌ను ఏర్పాటు చేసే సంగీత క‌ళాశాల‌వ‌ద్ద ఎల్ఇడి లైట్ల‌ను ఏర్పాటు చేయాల‌ని క‌లెక్ట‌ర్ సూచించారు.  


             విద్యా, వైజ్ఞానిక ప్ర‌ద‌ర్శ‌న‌లు నిర్వ‌హించే కోట‌ను సంద‌ర్శించారు. కోట‌వ‌ద్ద చేస్తున్న ఏర్పాట్ల‌ను, వేదిక ఇన్‌ఛార్జ్‌, స‌మ‌గ్ర శిక్ష ఎపిసి పి.ఏ.స్వామినాయుడు, స్వాగ‌త ద్వారం గురించి, జిల్లా గృహ‌నిర్మాణ‌శాఖాధికారి ఎస్‌వి ర‌మ‌ణ‌మూర్తి వివ‌రించారు. అవ‌థానం, ప‌ద్య‌ప‌ఠ‌నం, బుర్ర‌క‌థ‌లు, హ‌రిక‌థ‌లు జ‌రిగే శ్రీ మ‌న్నార్ రాజ‌గోపాల‌ స్వామి ఆల‌యాన్ని సంద‌ర్శించారు. ద‌క్షిణ‌వైపు కూడా ద్వారాన్ని ఏర్పాటు చేస్తే, అంద‌రికీ సౌక‌ర్య‌వంతంగా ఉంటుంద‌ని, తాత్కాలికంగా అయినా, ద్వారాన్ని ఏర్పాటు చేయాల‌ని క‌లెక్ట‌ర్‌ సూచించారు. అనంత‌రం రాజీవ్ క్రీడా మైదానాన్ని సంద‌ర్శించి, విద్యార్థుల‌కు క్రీడా పోటీల‌పై సెట్విజ్ సిఈఓ రామానందంతో చ‌ర్చించారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గ‌ణ‌ప‌తిరావు, హౌసింగ్ పిడి ఎస్‌వి ర‌మ‌ణ‌మూర్తి, ఆయా వేదిక‌ల ఇన్‌ఛార్జి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


Comments
Popular posts
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది.
Image
ఇంటర్నెట్‌లో గూగుల్ సెర్చ్‌లో సైబర్ క్రైమ్ కేసులు పెరుగుతున్నాయి.
Image
న్యాయప్రక్రియకు..రాజ్యాంగపరమైన చట్టాలకు లోబడి వికేంద్రీకరణ చేయబోతున్నాం.
Image
*ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
Image
ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు
Image