*ముందస్తు ఎన్నికలకు వెళ్లినా వైసీపీని ప్రజలు ఓడిస్తారు
*
*ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో భాగంగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు సంఘీభావం*
*టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు*
*వైసీపీ పాలనలో పెరిగిన రైతుల ఆత్మహత్యలు*
*నీట మునిగిన పంటలను పరిశీలించిన చంద్రబాబు*
పల్నాడు (ప్రజా అమరావతి) : సీఎం జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లినా వైసీపీని ప్రజలు ఓడిస్తారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తెలిపారు. పల్నాడు జిల్లాలో వరద ప్రాంతాలను బుధవారం చంద్రబాబు పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ భారీ వర్షాలకు మిరప, పత్తిపంట దెబ్బతిన్నదని తెలిపారు. రైతులను ఆదుకోవాలనే ఉద్దేశం జగన్ సర్కార్‌కు లేదని తప్పుబట్టారు. వరద ప్రాంతాల్లో ఇప్పటివరకు ఎమ్మెల్యేలు, అధికారులు పర్యటించలేదని దుయ్యబట్టారు. ప్రతిపక్షాలపై కేసులు పెట్టడం పట్ల ఉన్న శ్రద్ధ రైతు సమస్యలపై లేదని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో భాగంగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు సంఘీభావం తెలిపానని పేర్కొన్నారు. మాజీమంత్రి వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ వద్దని జగన్ అన్నారని గుర్తుచేశారు. వివేకా కుమార్తె సునీత వాదన నిజమని సీబీఐ అఫిడవిట్ వేసిందని చంద్రబాబు తెలిపారు.
వైసీపీ పాలనలో పెరిగిన రైతుల ఆత్మహత్యలు : వరదలతో రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వమని, వైసీపీ పాలనలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయన్నారు. ఎరువులను బ్లాక్ మార్కెట్‌లో అమ్ముకుంటున్నారన్నారు. వైసీపీ నాటకాలకు కాలం చెల్లిందన్నారు. వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనన్నారు. ప్రజలే వైసీపీని గద్దె దించుతారని చంద్రబాబు పేర్కొన్నారు.
నీట మునిగిన పంటలను పరిశీలించిన చంద్రబాబు : పల్నాడు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించారు> ఇటీవల కురిసిన వర్గాలకు నీట మునిగిన పంట పొలాలు పరిశీలించారు. మాజీ మంత్రులు పుల్లారావు, నక్కా ఆనంద బాబు, టీడీపీ నేతలు జి.వి.ఆంజనేయు, కోడెల శివరాం తదితరులు తిమ్మాపురం వద్ద చంద్రబాబుకు స్వాగతం పలికారు. తిమ్మాపురం నుంచి ట్రాక్టర్ల ర్యాలీని టీడీపీ కార్యకర్తలు ఏర్పాటు చేశారు. నాదెండ్లలో వర్షాలకు దెబ్బ తిన్న పత్తి పొలాలను చంద్రబాబు పరిశీలించారు. పంట నష్టంపై రైతుల నుంచి వివరాలను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.
addComments
Post a Comment