రామచంద్రపురం, 18 అక్టోబర్ (ప్రజా అమరావతి);
గడపగడపకి సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర బీసీ సంక్షేమ, సినిమాటోగ్రఫీ, సమాచార, పౌర సంబంధాల శాఖా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. రామచంద్రపురం పట్టణంలో హౌసింగ్ బోర్డ్ కాలనీ 19వ వార్డు నందు మంగళవారం సాయంత్రం నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రతీ గడపకు వెళ్లి వివిధ పథకాల లబ్ధిదారులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిని వివరించి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలు డ్రైనేజీ రోడ్లు సమస్యను మంత్రి దృష్టికి తీసుకురాగా సమస్య పరిష్కారానికి కృషిచేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదల కష్టాలను గుర్తించి సంక్షేమ పథకాలు అమలు చేస్తు అవినీతికి తావులేకుండా సంక్షేమ పథకాలు ప్రతి గడపగడపకు చేరుతున్నాయన్నారు. నవరత్నాల పథకాల ద్వారా చెప్పిన మాట ప్రకారం ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఆయనకు ప్రజలంతా అండగా ఉండాలని మంత్రి కోరారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, తదితరులు ఉన్నారు.
addComments
Post a Comment