విజయవాడ (ప్రజా అమరావతి);
** నవంబర్ 14 నుండి 20 వరకు 55వ జాతీయ గ్రంధాలయ వారోత్సవాలు..
** స్వాతంత్ర్య ఉద్యమంలో గ్రంధాలయోద్యమం ప్రజలను ఎంతగానో ప్రభావితం చేసింది..
** సంపూర్ణ డిజిటల్ గ్రంధాలయ వ్యవస్థను రూపొందించి రాష్ట్రంలో డిజిటల్ గ్రంధాలయాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు..
** రాష్ట్ర వ్యాప్తంగా 2233 శాఖా గ్రంధాలయాలు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా విజ్ఞాన ప్రగతి చిహ్నాలుగా సేవలు అందిస్తున్నాయి..
-- రాష్ట్ర విద్యా శాఖా మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ..
రాష్ట్రంలో జాతీయ గ్రంధాలయ వారోత్సవాలు నవంబర్ 14 నుండి 20 వరకు ఘనంగా నిర్వహిస్తున్నామని రాష్ట్ర విద్యా శాఖా మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ అన్నారు. తాడేపల్లి ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో మంగళవారం జాతీయ గ్రంధాలయ వారోత్సవాల పోస్టర్ ను మంత్రి విడుదల చేసారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ జాతీయ స్ఫూర్తికి, విద్యా వ్యాప్తికి, స్వాతంత్ర్య సాధనకు, ప్రజలలో ఐక్యతను పెంపొందించడానికి గ్రంధాలయాలు ప్రముఖ పాత్ర పోషించాయని అయన తెలిపారు. స్వాతంత్య్రం వచ్చిన నాటినుండి నేటి వరకూ గ్రంధాలయాలు పట్టణ ప్రాంతాలలోనే కాకుండా గ్రామీణ గ్రందాయాలు, మహిళలకు ప్రత్యేక గ్రంధాలయాలను నెలకొల్పి ఉన్నగ్రంధాలయాలను అప్ గ్రేడ్ చేసి ప్రభుత్వం గ్రంధాలయాలు మనుగడను రాష్ట్ర ప్రభుత్వం సుస్థిరం చేసిందని మంత్రి అన్నారు.
గ్రంధాలయాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి, పాఠకులు అనువుగా కూర్చుని దినపత్రికలను, గ్రంధాలను చదువుకోవడానికి గాను ప్రభుత్వం గ్రంధాలయాలు అభివృద్ధి చేయడంతో పాటుగా ప్రతిసంవత్సరం జాతీయ గ్రంధాలయ వారోత్సవాలను నిర్వహించి గ్రంధాల యొక్క ప్రాధాన్యతను, గ్రంథపఠనం యొక్క ఆవశ్యకతను తెలియజేయడంలో ప్రభుత్వం చేస్తున్న కృషికి ప్రజలు తమవంతు సహకారాన్ని అందించాలన్నారు. బడ్జెట్ లో నిధులను గ్రంధాలయాలు అభివృద్ధికి ప్రభుత్వం కేటాయించి గ్రంధాలయాలను అభివృద్ధి చేయడంతో పాటుగా చారిత్రక, సాంస్కృతిక, అక్షరోద్యమాలకు నిలయమైన పురాతన గ్రంధాలను ప్రభుత్వం గుర్తించి వాటిని పరిరక్షించి వాటిని కంప్యూటరైజషన్ భావితరాలకు అందిస్తున్నామన్నారు. వేదకాలం నాటి గ్రంధాలను గుర్తించి వాటిని కాపాడడానికి గాను మరియు వాటిని ప్రజలకు అందుబాటులోనికి తేవడానికి గాను ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదన్నారు.
జాతీయ గ్రంధాలయాల 55వ వారోత్సవాల సందర్భంగా గ్రంధాల ప్రాధాన్యతను ఉన్నతిని తెలిపే వారోత్సవాలలలో గ్రంధాలయాలు మనుగడకు ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న చర్యలను వివరించే కరపత్రాన్ని గ్రంధాలయ వారోత్సవాల్లో పంపిణీ చేసి విశిష్టతను ప్రజలందరికీ అవగాహన కల్పిస్తామన్నారు. 55వ జాతీయ గ్రంధాలయ వారోత్సవాలు ప్రజలందరిలో నూతన స్ఫూర్తిని, ఐక్యతను నిలిపి ప్రజలందరి ఆకాంక్షలను నెరవేర్చగలవనే ఆశాభావాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యక్తం చేసారు. ఈ సమావేశంలో పాఠశాల విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్, కమిషనర్ శ్రీ సురేష్ కుమార్, ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి శేషగిరి బాబు, ఆంధ్ర ప్రదేశ్ గ్రంధాలయ పరిషత్ చైర్మన్ శ్రీ మందపాటి శేషగిరిరావు, పౌర గ్రంధాలయ శాఖ సంచాలకులు డా. ఎమ్. ఆర్. ప్రసన్నకుమార్, తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment