డిసెంబర్‌ 2, 3 తేదీల్లో సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ వైయస్సార్‌ జిల్లా పర్యటన


అమరావతి (ప్రజా అమరావతి);


*డిసెంబర్‌ 2, 3 తేదీల్లో సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ వైయస్సార్‌ జిల్లా పర్యటన*


*పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి*


*డిసెంబర్‌ 2 షెడ్యూల్‌*


ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11.50 గంటలకు లింగాల మండలంలోని పార్నపల్లి వద్ద సీబీఆర్‌ రిజర్వాయర్‌ వద్దకు చేరుకుంటారు. 12.00 – 12.30 వరకు బోటింగ్‌ జెట్టీని ప్రారంభిస్తారు. అనంతరం 12.40 గంటలకు డాక్టర్‌ వైయస్సార్‌ లేక్‌ వ్యూ పాయింట్‌కు చేరుకుని వైయస్సార్‌ లేక్‌ వ్యూ రెస్టారెంట్‌ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత 1.30 – 4.30 గంటల వరకు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి ఇడుపులపాయలోని గెస్ట్‌హౌస్‌ చేరుకుని రాత్రికి అక్కడ బస చేస్తారు.


*డిసెంబర్‌ 3 షెడ్యూల్‌*


ఉదయం 8.30 గంటలకు ఇడుపులపాయ వైయస్సార్‌ ఎస్టేట్‌ నుంచి బయలుదేరి 8.55 గంటలకు పులివెందుల భాకరాపురం చేరుకుంటారు. 9.15 – 9.30 కదిరి రోడ్డులోని ఎస్‌సీఎస్‌ఆర్‌ గార్డెన్స్‌కు చేరుకుని సీఎం వ్యక్తిగత సహాయకుడు (పీఏ) డి.రవిశేఖర్‌ కుమార్తె వివాహ వేడుకలకు హాజరై వధూవరులను ఆశీర్వదిస్తారు. 9.45 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 11.30 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Comments