నెల్లూరు, నవంబర్ 10 (ప్రజా అమరావతి): రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి
జన్మదినాన్ని పురస్కరించుకొని జిల్లా సహకార శాఖ అధికారులు 69వ సహకార వారోత్సవాల పోస్టర్లను మంత్రి చేతుల మీదుగా ఆవిష్కరించారు
. గురువారం ఉదయం నెల్లూరులోని మంత్రి క్యాంపు కార్యాలయానికి విచ్చేసిన సహకార శాఖ అధికారులు మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, సహకార వారోత్సవాలు వాల్ పోస్టర్లను మంత్రిచే ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార శాఖ అధికారి శ్రీ తిరుపాల్రెడ్డి, ఎన్ డి సి సి బ్యాంక్ సీఈవో శ్రీ శంకర్ బాబు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment