నెల్లూరు నవంబర్ 18 (ప్రజా అమరావతి);
ప్రజలకిచ్చిన హామీల్లో 98 శాతానికి పైగా అమలు చేసిన రాష్ట్ర చరిత్రలోనే ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి
గారని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ & పుడ్ ప్రాసెసింగ్ శాఖామాత్యులు కాకాణి గోవర్ధన రెడ్డి పేర్కొన్నారు.
మంగళవారం సాయంత్రం సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మేజర్ పంచాయతీ చిట్టెపల్లి గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రికి మహిళలు హారతులతో ఆహ్వానించి నీరాజనాలు పలికారు. తోలుత గ్రామంలో 60 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్లను, 40 లక్షలతో నిర్మించిన సైడు కాలువలను, 7 లక్షలతో నిర్మించిన ఆర్ ఓ ప్లాంటును మంత్రి కాకాణి ప్రారంభించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత ఏడు రోజులుగా పొదలకూరు మేజర్ పంచాయతీలో గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఇప్పటివరకు 9 కోట్ల 20లక్షలకు పైగా వ్యయంతో నిర్మించిన వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించామన్నారు. ఈరోజున 1 కోటి 7 లక్షల వ్యయంతో నిర్మించి ప్రారంభించిన వాటితో కలిపి మొత్తం 7 రోజుల్లో 10 కోట్ల 27 లక్షలకు పైగా నిధులను వెచ్చించి అభివృద్ధి పనులను ప్రారంభించామన్నారు. గత ప్రభుత్వం లో శంకుస్థాపన చేసి వదిలేసిన పనులను కూడా భాద్యతగా చేపట్టి పూర్తిచేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తుందని తెలిపారు. మూడు సంవత్సరాల పాలనలో ప్రజలు సంపూర్ణ సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారన్నారు. కులమతాల కు, పార్టీలకు అతీతంగా అర్హత గల ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్నందునే సియం కు చెక్కు చెదరని ప్రజాదరణ లభిస్తుందన్నారు. కేవలం అర్హతే ప్రామాణికంగా చిట్టెపల్లి, వెంకటేశ్వర నగర్ లోని పంతగిరి సుబ్బయ్య కుటుంబానికి 4 లక్షల 69 వేలు, నిమ్మగడ్డ వనజ కు 4 లక్షలు, పరికేం పెంచలమ్మ కు 3 లక్షల 75 వేలు గత 3సంవత్సరాల కాలంలో అందించామన్నారు. వివిధ రకాలైన సంక్షేమ పధకాలకు చెందిన నగదును ఎటువంటి దళారులు లేకుండా నేరుగా వారి ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో మరింత సంక్షేమంతో కూడిన అభివృద్ధిని అందిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో నగేష్ కుమారి, తహసీల్దార్ ప్రసాద్, స్థానిక నాయకులు, సచివాలయ సిబ్బంది, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment