పేదరికంపై యుద్దం చేయడానికి మన ప్రభుత్వం పేదలకందించిన 9 ఆయుధాలు ‘నవరత్నాలు’

 

విజయవాడ (ప్రజా అమరావతి);


*             పేదరికంపై యుద్దం చేయడానికి మన ప్రభుత్వం పేదలకందించిన 9 ఆయుధాలు ‘నవరత్నాలు’


మన ప్రభుత్వం బీసీల సంక్షేమం కోసం చేసిన ఖర్చు దాదాపు 1 లక్షా 40 వేల కోట్లు..

సంక్షేమ పథకాల అమలుపై అవగాహన సదస్సుల కోసం ప్రతి కార్పోరేషన్ కు రూ. 2 లక్షల నిధులు విడుదల

బీసీలంటే బ్యాక్ వర్డ్ కాదు.. బ్యాక్ బోన్ అని నమ్మిన ప్రభుత్వం

బీసీ సంక్షేమ శాఖ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ వెల్లడి..

పేదరికం మీద యుద్దం చేయడానికి ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పేదలకు అందించిన 9 ఆయుధాలే ‘నవరత్నాలు’ అని, అభివృద్ధి అంటే పేదవాడిని ఉన్నత స్థితికి తీసుకురావడమేనని బీసీ సంక్షేమ శాఖ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ తెలిపారు. సంక్షేమ పథకాల అమలుపై అవగాహన సదస్సుల నిర్వహణ కోసం ప్రతి కార్పొరేషన్ కి రూ. 2 లక్షల చొప్పు నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసిందని తెలిపారు. అర్హత ఉండి లబ్ధి పొందని వారెవరైనా ఉంటే వారిని గుర్తించి.. వెంటనే వారికి పథకాలు వర్తించేలా కృషి చేయాల్సిన బాధ్యత ప్రతి కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లపై ఉందన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మంగళవారం నిర్వహించిన 56 బీసీ కార్పోరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లతో సమావేశంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ.. బీసీల ఆత్మగౌవరం పెంచేలా, జీవన భద్రత కల్పించేలా ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగిస్తున్నారన్నారు. అన్ని విధాలా బీసీలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారన్నారు. బీసీలంటే బ్యాక్‌ వర్డ్‌ కాదు బ్యాక్‌ బోన్‌.. అంటూ కొత్త నిర్వచనం ఇచ్చారని తెలిపారు. రాష్ట్రంలో 139 బీసీ కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటుచేయడం చారిత్రక నిర్ణయమన్నారు. బీసీలు ఉన్నతస్థితికి రావడానికి దివంగత నేత డా. వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్ మెంట్ ముఖ్యకారణమన్నారు. బీసీల ఆత్మగౌరవం దెబ్బతినేలా గత ప్రభుత్వం వ్యవహరించిందన్నారు. బీసీల కోసం వైఎస్సార్‌ రెండడుగులు ముందుకు  వేస్తే.. వై.ఎస్‌. జగన్‌ పదడుగులు వేస్తున్నారని ఆయన తెలిపారు. బీసీల అభ్యున్నతి, సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ... నవరత్నాలు, వివిధ సంక్షేమ పథకాల క్రింద దాదాపు 1 లక్షా 40 వేల కోట్లు ఖర్చు చేశారన్నారు.  అభివృద్ధి అంటే పేదవాడిని ఉన్నత స్థితికి తీసుకురావడమేమన్నారు. ప్రజలందరూ ప్రభుత్వ పథకాలు, విధానాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని మంత్రి పిలుపునిచ్చారు. ‘నా పాలన నచ్చితే నాకు ఓటేయ్యండి‘ అని అడిగిన దమ్ము, ధైర్యం ఉన్న నేత మన ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ అని తెలిపారు. నిజం ప్రచారంలో లేకపోతే, అబద్ధం నిజం అవుతుందని.. ప్రతిపక్ష అసత్య ఆరోపణలను బలంగా తిప్పికొట్టాలని, ముఖ్యమంత్రికి బీసీలందరూ అండగా నిలబడాలని మంత్రి వేణుగోపాల కృష్ణ పిలుపునిచ్చారు. 

ఈ సమావేశంలో ఎమ్ ఎల్ సి శ్రీమతి పోతుల సునీత, నవరత్నాల కార్యక్రమాల వైస్ చైర్మన్ నారాయణమూర్తి, 56 బీసీ కార్పోరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జి. విజయలక్ష్మి, డైరెక్టర్ పి. అర్జున రావు, 56 బీసీ కార్పొరేషన్ల సమన్వయ కర్త ఏ. ప్రవీణ్, కార్పోరేషన్ల పర్సన్ ఇన్ ఛార్జ్ లు కె. మల్లిఖార్జున, ఏ. కృష్ణ మోహన్, డి. చంద్రశేఖర్ రాజు, పి. మాధవి లత, ఎస్. తనూజ, జి. ఉమాదేవి, ఎం. చినబాబు, భీమ్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. 


Comments