*పిల్లల ఆరోగ్య సేవల్లో
ఏపీ టాప్
*
*ప్రశంసించిన
కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి డాక్టర్ అశోక్ కుమార్*
*ఆశాల కృషి వల్లే ఇది సాధ్యం*
గుంటూరు (ప్రజా అమరావతి):
పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవడంలో దేశంలోనే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచిందని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి డాక్టర్ అశోక్ కుమార్ ప్రశంసించారు.
గుంటూరు జిజిహెచ్ శుస్తృత హాలులో శనివారం "పిల్లలకు వచ్చే వ్యాధుల్లో న్యూమోనియాను గుర్తించి నివారణా చర్యలు తీసుకోవడం" పై ఎయన్ఎం, ఆశా కార్యకర్తలకు నిర్వహించిన అవగాహనా సదస్సులో ఆయన ప్రసంగించారు. సదస్సుకు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి అధ్యక్షత వహించారు.
పిల్లల సంరక్షణ విషయంలో ఆశా కార్యకర్తల కృషి ఎంతో ఉందని డాక్టర్ అశోక్ కుమార్ అన్నారు. ఆశా కార్యకర్తలు అందిస్తున్న సేవల వల్ల జాతీయ స్థాయి లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. ఇదే స్ఫూర్తితో సేవల్ని ఇంకా ముందుకు తీసుకుని వెళ్లేందుకు ఆశా కార్యకర్తలు మరింతగా కష్టపడాలని ఆయన సూచించారు. గర్భిణి లను ఆశా కార్యకర్తలు ఆసుపత్రి కి జాగ్రత్తగా తీసుకుని వెళ్ళుతున్నారనీ , అదేవిధంగా చిన్నారులకు ఊపిరితిత్తుల సమస్యలు ఉంటే వెంటనే గుర్తించి దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు గానీ , జిల్లాలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులకు గానీ తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే చిన్నారులలో వచ్చే నిమోనియా వ్యాధి పట్ల తల్లులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
*శ్వాస సంబంధిత సమస్యలున్న చిన్నారుల పట్ల అప్రమత్తంగా ఉండాలి:జె.నివాస్*
శ్వాస సంబంధిత సమస్యలున్న చిన్నారుల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జె.నివాస్ అన్నారు.
శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండే లక్షణాలు చిన్నారుల్లో కనిపిస్తే వెంటనే ఆశా కార్యకర్తలు వైద్యులను సంప్రదించి చికిత్స అందేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. రెండు మూడు రోజుల చిన్నారుల నుంచి ఆరు నెలల్ల వరకు ఉన్న వారిని కాపాడుకునే విషయంలో ఆశా కార్యకర్తల పాత్ర కీలకమైందన్నారు. పిల్లలకు వైద్యం అందుతోందా లేదా , బలంగా ఉన్నారా లేదా అనే విషయాల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు. వారంలో ఒకసారి తల్లుల ఇళ్లకు వెళ్లి తగు సూచనలివ్వాలన్నారు. పిల్లల సంరక్షణ పట్ల
ఎ యన్ ఎంలు, ఆశా కార్యకర్తలు
తల్లులకు అవగాహన కల్పించాలన్నారు. ఇటీవల కాలంలో చిన్నారుల్లో గాలి పీల్చుకోలేక పోవడం, ఊపిరి తిత్తుల సమస్యల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మరణాలను అరికట్టాలంటే వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించే బాధ్యత
ఆశా కార్యకర్త లపై ఉందన్నారు.
*బాల్యం ప్రశాంతంగా ఊపిరి తీసుకోవాలంటే న్యూమోనియా లక్షణాలను వెంటనే గుర్తించాలి* అనే కర పత్రాన్ని డాక్టర్ అశోక్ కుమార్, జె నివాస్ లు ఈ సందర్భంగా ఆవిష్కరించారు.
వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ అర్జున రావు, డాక్టర్ దేవి, డాక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
*జిజిహెచ్ లో పలు విభాల సందర్శన*
ముందుగా కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి
డాక్టర్ అశోక్ కుమార్ , ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జె.నివాస్ ఆసుపత్రిలోని పలు విభాగాలను సందర్సించి చిన్నారులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. చిన్నారుల విషయంలో ఏమాత్రం అశ్రద్ధ వహించవద్దని సూచించారు. సరిగా వైద్య సేవలు అందుతున్నాయా అని తల్లులను అడిగి తెలుసుకున్నారు.
addComments
Post a Comment