అర్హతే ప్రామాణికంగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది

నెల్లూరు (ప్రజా అమరావతి);



పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా ఉంటూ, అర్హతే ప్రామాణికంగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి దక్కుతుంద


ని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ  మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి  పేర్కొన్నారు.


బుధవారం సాయంత్రం సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలోని, వెంకటాచలం మండలం కాకుటూరు గ్రామంలో  రెండవ రోజు చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డికి  పెద్ద ఎత్తున  మహిళలు, అభిమానులు,  ప్రజలు  అపూర్వ  స్వాగతం పలికారు. అనంతరం మంత్రి  గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న  సంక్షేమ పధకాలు గురించి వివరిస్తూ, వారి సమస్యలు తెలుసుకుంటూ,  వారు పొందుతున్న లబ్ధి సమాచారంతో కూడిన బుక్ లెట్‌ను అందజేశారు. 



ఈ సందర్భంగా మంత్రి శ్రీ కాకాణి  గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అండగా వుంటూ అర్హతే ప్రామాణికంగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో పర్యటిస్తున్న సందర్భంల్లో ప్రజలు తెలుపుకుంటున్న చిన్న చిన్న సమస్యలను సత్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకోవడం జరుగుచున్నదన్నారు.   మొదటి రోజు గడప గడపకు మన ప్రభుత్వం  కార్యక్రమంలో భాగంగా నిన్న కాకుటూరు గ్రామంలో పర్యటించినప్పుడు వీధి లైట్లు, సైడు కాలువలు, ఇళ్ల స్థలాల సమస్యలపై తెలుపుకోవడం జరిగిందని,  వీటిని ప్రభుత్వ నిబంధనలు ప్రకారం మంజూరు చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు. ప్రభుత్వం  ఏర్పడిన మూడు సంవత్సరాల  కాలంలో రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి, వైఎస్ఆర్ చేయూత, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, రైతు భరోసా, కాపు నేస్తం, నేతన్న నేస్తం వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. కాకుటూరు గ్రామంలోని ఈ సచివాలయ పరిధిలో తలారి వీరయ్యకు  రూ. 7.15 లక్షలు, మారం లతమ్మకు రూ.6.94 లక్షలు,  పాశం పరమేశ్వరికి  రూ.6.41 లక్షలు, డి. కౌసల్యమ్మకు

రూ.5.99 లక్షలు, ఇలా సగటున ప్రతి లబ్ధిదారుడు నెలకు 18 వేల రూపాయలు మేర లబ్ధి పొందడం జరుగుచున్నదన్నారు. ప్రజలు కోరుకున్న ప్రతి పనిని నెరవేరుస్తూ, ప్రజల సంక్షేమానికి కట్టుబడి రాష్ట్ర ప్రభుత్వం  పనిచేస్తున్నదని  మంత్రి అన్నారు. గతంలో ప్రజలు సాగునీటికి, త్రాగునీటి కి ఇబ్బంది పడేవారని,  నేడు ఆ ఇబ్బందులు లేవని మంత్రి అన్నారు. 


మంత్రి వెంట   తహశీల్దార్ శ్రీ నాగరాజు,  వివిధ శాఖల మండల అధికారులు, ప్రజా ప్రతినిధిలు, వైఎస్సార్సీపీ నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


Comments