ఎమ్మెల్యే ఆర్కే అవినీతి చెయ్యడంలోనూ, నటినలోనూ బిజీగా ఉన్నారు.
ఉండవల్లి కొండ పై గ్రావెల్ దోపిడి.. అనుమతి గోరంత దోచింది కొండంత
తాడేపల్లి (ప్రజా అమరావతి);
ఉండవల్లి, పోలకంపాడు కట్ట, పుష్కర కాలనీలో బాదుడే బాదడు కార్యక్రమంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
ఎమ్మెల్యే ఆర్కే ని రెండు సార్లు గెలిపిస్తే అభివృద్ది ని గాలికోదిలారు.
గెలిచిన వెంటనే ఇళ్ళ పట్టాలు ఇస్తానన్న ఎమ్మెల్యే ఆర్కే వందల సంఖ్యలో పేద ప్రజల ఇళ్లు కూల్చారు.
40 ఏళ్లుగా ఇరిగేషన్, అటవీ భూముల్లో నివసిస్తున్న వారికి గెలిచిన ఏడాదిలో బట్టలు పెట్టి ఇళ్ళ పట్టాలు ఇస్తాను.
దేవుడి మాన్యం ప్రాంతంలో 48 గంటల్లోనే రోడ్డు వేయించి జంగిల్ క్లియరెన్స్ చేయిస్తా.
గతంలో స్థలం కేటాయించినా మౌలిక సదుపాయాలు కల్పించలేకపోయాం.
ఎండోమెంట్ భూముల్లో నివసిస్తున్న వారికి పట్టాలు ఇస్తా.
మౌలిక సదుపాయాలు అన్ని పక్కాగా ఏర్పాటు చేసే బాధ్యత నాది.
నేను గెలిచిన తర్వాత పేదలకు మంగళగిరి నియోజకవర్గంలో 10 వేల ఇళ్లు నిర్మిస్తా.
తాడేపల్లి లో ఎన్నో సమస్యలున్నాయి... మీడియా ద్వారా ఏ ప్రశ్న అడిగినా ఎమ్మెల్యే వద్ద నుంచి ఒక్క ఆన్సర్ కూడా రావటం లేదు
ఎన్ని సవాళ్లు విసరినా ఎంఎల్ఎ ఆళ్ళ రామకృష్ణారెడ్డి నుండి స్పందన లేదు
పోలకమ్మతల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన లోకేష్.
ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్న నారా లోకేష్.
కరెంట్ బిల్లు ఎక్కువోచ్చిందని పెన్షన్ కట్ చేశారని, ఏడాది నుండి పెన్షన్ రావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన వృద్ధురాలు హైమావతి.
ఇరిగేషన్ భూముల్లో నివసిస్తున్న వారికి ఇళ్ళ పట్టాలు ఇస్తానని ఎమ్మెల్యే మోసం చేసారని, కనీసం ఇప్పుడు మమ్మల్ని పలకరించడానికి కూడా రావడం లేదంటూ బాధ వ్యక్తం చేసిన స్థానికులు.
అటవీ భూముల్లో ఉన్న వారికి ఇళ్ళ పట్టాలు ఇస్తానని అన్నారు. మూడున్నర ఏళ్ళు అయినా హామీ నెరవేర్చలేదని సమస్యలు ఏకరువు పెట్టిన ప్రజలు.
రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీటి సమస్యల తో ఇబ్బంది పడుతున్నాం. చెత్త పన్ను కట్టాలని వేధిస్తున్నారు.
దేవుడి మాన్యం ప్రాంతంలో నివసిస్తున్న వారికి అనేక సమస్యలు ఉన్నా అధికారులు కనీసం మా వైపు చూడటం లేదు
కార్యక్రమంలో టిడిపి నాయకులు నందం అబద్దయ్య, తమ్మిశెట్టి జానకీ దేవి, ఆకుల జయసత్య, పోతినేని శ్రీనివాసరావు, జంగాల సాంబశివరావు, అమరా సుబ్బారావు, వల్లభనేని వెంకట్రావు తదితరులు పాల్గోన్నారు.
addComments
Post a Comment