ఐసిఐసిఐ బ్యాంక్ ద్వారా విస్తృత సేవలు అందించాలి*
*: జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్*
పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా), నవంబర్ 19 (ప్రజా అమరావతి):
ఐసిఐసిఐ బ్యాంక్ ద్వారా ప్రజలకు విస్తృత సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ పేర్కొన్నారు. శనివారం పుట్టపర్తి పట్టణంలో ఐసిఐసిఐ (కోట సత్యనారాయణ కాంప్లెక్స్ లో ఉన్న బ్యాంకు ను రీమాడలింగ్ చేసి, కెనరా బ్యాంక్ పక్కన మరియు జనరల్ ఆస్పత్రి వద్ద సమీపమున ) ఉన్న బ్యాంక్ ను జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్, సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్.జె.రత్నాకర్, ఐసిఐసిఐ బ్యాంకు జోనల్ హెడ్ హరీష్ బాబు తదితరులు ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన శ్రీ సత్యసాయి జిల్లాలో ఐసిఐసిఐ బ్యాంక్ ను ప్రారంభించడం సంతోషకరమన్నారు. ఈ బ్యాంక్ ద్వారా పౌరులకు సత్వర సేవలు అందించేలా కృషి చేయాలన్నారు. అనంతరం ఐసిఐసిఐ బ్యాంకు జోనల్ హెడ్ హరీష్ బాబు మాట్లాడుతూ ఐసిఐసిఐ బ్యాంకు ప్రారంభానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. బ్యాంకులో ఉత్తమ సేవలు అందించేలా బ్యాంక్ సిబ్బంది అందరూ సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐసిఐసిఐ బ్యాంక్ రీజినల్ హెడ్ మహమ్మద్ అలీ సయ్యద్, అనంతపురం మెయిన్ బ్రాంచ్ మేనేజర్ సురేష్ కుమార్, స్థానిక ఐసిఐసిఐ బ్యాంక్ మేనేజర్ పవన్ కుమార్, బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment