ఓటుహక్కు వజ్రాయుధం వంటిది



*ఓటుహక్కు వజ్రాయుధం వంటిది


*


పార్వతీపురం, నవంబర్ 9 (ప్రజా అమరావతి): ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధం వంటిదని, ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని జిల్లా రెవెన్యూ అధికారి జల్లేపల్లి వెంకట రావు పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక ఆర్ సిఎం స్కూల్ ఆవరణలో  ఓటుహక్కు నమోదు పై అవగాహనా ర్యాలీని  ప్రారంభించారు. ఓటరు నమోదు అవగాహనా ర్యాలీ అర్ సి ఎం స్కూల్ నుండి మూడు రోడ్ల జంక్షన్ మీదుగా కలెక్టర్ కార్యాలయం వరకు ఓటరుగా నమోదు అవ్వండి - తలరాతను మార్చండి, మార్పు కావలంటే తప్పనిసరిగా ఓటు వేయాలి తదితర నినాదాలతో ప్రజలను చైతన్యపరుస్తూ ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా డి ఆర్ ఓ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రతి పౌరుడికి కీలకమని అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతమైన పౌరులుగా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని కోరారు. 17 సంవత్సరాలు పైబడిన యువత ఓటర్ల జాబితాలో పేర్లను నమోదుకు ముందుగానే దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. జనవరి 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి కావాలనే నిబంధన  కోసం వేచి చూడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. జనవరి 1వ తేదీ మాత్రమే కాకుండా ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబరు 1వ తేదీల నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకునే యువత ముందస్తు దరఖాస్తులను దాఖలు చేయడానికి వీలు కల్పించడం జరుగుతుందని ఆయన వివరించారు.  ఇకపై ఓటర్ల జాబితాను ప్రతీ త్రైమాసికంలో తాజా పరచడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. అర్హులైన యువత నమోదు చేసుకున్న అనంతరం వారికి ఓటరు ఫొటో గుర్తింపు కార్డు (ఐపిఐసి)ను జారీచేస్తారని ఆయన చెప్పారు. 2023 ఓటర్ల జాబితా వార్షిక సవరణలో భాగంగా ప్రస్తుతం నిర్వహిస్తున్న ఓటరు నమోదు కార్యక్రమంలో 2023 సంవత్సరం ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబరు 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు వయస్సు పూర్తి చేసుకునే వారు ఓటరుగా నమోదు కావడానికి ముందస్తుగా దరఖాస్తు సమర్పించవచ్చని ఆయన సూచించారు.  యువకులు ఫారం -6 నింపి ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం ఎన్నికల కమిషన్ కల్పించిందని తెలిపారు. ఎన్నికల ఓటరు ముసాయిదా తయారుకానున్న దృష్ట్యా అర్హత కలిగిన ప్రతీ ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని అన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడంలో అతిపెద్ద పాత్ర ఓటర్ల దని బాధ్యతగల ప్రతి పౌరుడు విధిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. దేశాభివృద్ధికి, పటిష్ట ప్రజాస్వామ్యానికి ఓటుహక్కు ఎంతో కీలకమని అన్నారు. యువత నిరక్షరాస్యులకు అవగాహన కల్పించి ఓటుహక్కు వినియోగించుకొనెలా చైత్యం తీసుకురావాలన్నారు. అనంతరం అర్హత ఉన్న ప్రతిఒక్కరికీ ఓటరుగా నమోదు చేసేందుకు ప్రతిజ్ఞ చేశారు. 


 ఈ కార్యక్రమంలో ఆర్డీవో కె.హేమలత,  జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. బగాది జగన్నాథ రావు, ఆర్ బీ ఎస్ కే జిల్లా సమన్వయ అధికారి డా. ధవళ భాస్కరరావు,  జిల్లా ఆర్.డబ్ల్యు.ఎస్ ఇంజినీరింగ్ అధికారి ఓ. ప్రభాకర రావు, జిల్లా విద్యా శాఖ అధికారి డా.ఎస్.డి.వి.రమణ, మున్సిపల్ కమిషనర్ జాగరపు రామఅప్పల నాయుడు, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి జి.వరహాలు,  జిల్లా ప్రజా రవాణా అధికారి టి.వి.ఎస్.సుధాకర్, క్రీడల చీఫ్ కోచ్ ఎస్. వేంకటేశ్వర రావు, జిల్లా ఉద్యాన అధికారి కె.వి.ఎస్.ఎన్ రెడ్డి, జిల్లా పరిశ్రమల అధికారి పి. సీతారాం, కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి ఉమామహేశ్వర రావు, జిల్లా ప్రణాళిక అధికారి వీర్రాజు, జిల్లా భూగర్భ జలాల అధికారి కె.రాజశేఖర రెడ్డి, విద్యార్ధినీ, విద్యార్థులు, తహశీల్దార్ శివన్నారాయణ, విద్యార్థులు, సిబ్బంది, తదితరులు  పాల్గొన్నారు.

Comments
Popular posts
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది.
Image
న్యాయప్రక్రియకు..రాజ్యాంగపరమైన చట్టాలకు లోబడి వికేంద్రీకరణ చేయబోతున్నాం.
Image
ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు
Image
*ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
Image
बर्खास्त होंगे उत्तराखंड विधानसभा सचिवालय के 228 कर्मी, हाईकोर्ट ने फैसला सही कहा।
Image