జ్యోతిరావు ఫూలే సేవలు చిరస్మణీయం.*జ్యోతిరావు ఫూలే సేవలు చిరస్మణీయం*పార్వతీపురం/సాలూరు, నవంబరు 28 (ప్రజా అమరావతి): జ్యోతిరావు ఫూలే సేవలు చిరస్మణీయమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు గిరిజన సంక్షేమ శాఖా మంత్రి పీడిక రాజన్నదొర అన్నారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతి సందర్భంగా సోమ వారం సాలూరు ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జ్యోతిరావు ఫూలే చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జ్యోతిరావు ఫూలే అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడ్డారని ఆయన చెప్పారు. సమాజానికి గొప్ప స్ఫూర్తిప్రదాత అని, దిశానిర్దేశం చేసిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. సమాజంలో ఎన్నో అసమానతలు ఉన్నప్పుడు పోరాటం చేసి సమాజ ఉన్నతికి కృషి చేశారని అన్నారు. బాలికల విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చి 1848 లోనే పుణేలో పాఠశాలను స్థాపించారని ఆయన పేర్కొన్నారు. విద్య ప్రాధాన్యతను ఆనాడే ఫూలే తెలియజేసారని ఆయన చెప్పారు. సమాజంలో రుగ్మతల పట్ల సంస్కరణ ఉద్యమాలను నిర్వహించారని ఆయన అన్నారు. అట్టడుగు, బడుగు బలహీనవర్గాల పట్ల అండగా నిలిచిన వ్యక్తి ఫూలే అన్నారు. రాష్ట్ర ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి జ్యోతిరావు ఫూలే అడుగుజాడలలో నడుస్తూ సమసమాజ స్థాపనకు కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో పాలన అందిస్తూ అన్ని వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్నారని చెప్పారు. ప్రతి కుటుంబం అభ్యున్నతి సాధించాలని ఆర్థిక సహాయక కార్యక్రమాలను వివిధ సంక్షేమ పథకాలు ద్వారా అమలు చేస్తున్నారని ఆయన వివరించారు. జ్యోతిరావు ఫూలే మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించి ఉన్నత సమాజం ఆవిర్భావానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. 


ఈ కార్యక్రమంలో అధికారులు, అనధికారులు పాల్గొన్నారు.

Comments