ఏపీఎస్పీఎఫ్ సమస్యల పరిష్కారదిశగా చర్యలు

 *ఏపీఎస్పీఎఫ్ సమస్యల పరిష్కారదిశగా చర్యలు


*

*•ఎస్.ఐ.లకు సత్వర పదోన్నతి, ఖాళీల భర్తీ, హెడ్ క్వార్టర్, డాగ్ స్క్వాడ్ ఏర్పాటు తదితర సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తాం*

*రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత*

                                                                                                                                                                                అమరావతి, 2 నవంబరు (ప్రజా అమరావతి):  ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి                                      శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి వాటి సత్వర పరిష్కారానికి తగు చర్యలను తీసుకుంటామని రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత అన్నారు. బుధవారం అమరావతి సచివాలయం రెండవ బ్లాకులో ఏపీఎస్పీఎఫ్ అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఆస్తులు పరిరక్షణకు ఏపీఎస్పీఎఫ్ అధికారులు తీసుకుంటున్న చర్యలు, విధుల నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కారానికి ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలు, మంజూరు చేయాల్సిన అనుమతులు తదితర అంశాలపై ఈ సమీక్షా సమావేశంలో మంత్రి సుదీర్ఝంగా సమీక్షించారు. ఏపీఎస్పీఎఫ్ కార్యకలాపాలు, ఎడ్మినిస్ట్రేటివ్ సెట్అఫ్, దాని బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, ఉద్యోగుల సమస్యలు, వాటి పరిష్కారానికి ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలు, పొందాల్సిన అనుమతులు తదితర అంశాలను ఏపీఎస్పీఎఫ్ డి.జి. సంతోష్ మెహ్ర, డి.ఐ.జి. బి.వి. రామిరెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం నుండి పరిపాలనా అనుమతులు పొందాల్సిన సమస్యలకు సంబందించిన ప్రతిపాదనలు వెంటనే తమకు అందజేసినట్లైతే, వాటన్నింటినీ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి తగుచర్యలను తీసుకుంటామని ఏపీఎస్పీఎఫ్ అధికారులకు ఆమె సూచించారు.  

                                                                                                                                                                          అనంతరం తన ఛాంబరులో మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ ఏపీఎస్పీఎఫ్ లో ఎంతో సుశిక్షితులైన అధికారులు, సిబ్బంది ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో ఎంతగానో కృషిచేస్తున్నారన్నారు.  ముఖ్యంగా విజయవాడ, రాజమండ్రి, కర్నూలు, కడప తదితర ప్రాంతాల్లోనున్న విమానాశ్రయాలు, అసెంబ్లీ,  హైకోర్టు మరియు  టి.టి.డి., అన్నవరం, శ్రీశైలం, సింహాచలం,  విజయవాడ శ్రీ దుర్గామల్లీశ్వర స్వామి వారి దేవస్థానాలకు చెందిన దేవాలయాల ఆస్తుల   పరిరక్షణకు వీరు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు. అటు వంటి శాఖలో పనిచేసే ఎస్.ఐ. కేడర్ ఉద్యోగికి 15 సంవత్సరాలు దాటినా సి.ఐ.గా పదోన్నతి రావడం కష్టంగా ఉందన్నారు. అదే పోలీస్ శాఖలో ఎస్.ఐ.గా పనిచేసే ఉద్యోగి కేవలం ఏడెనిమిది సంవత్సరాల్లోనే సి.ఐ.గా పదోన్నతి పొందడం జరుగుచున్నదన్నారు.  ఈ సమస్యకు ఏవిధంగా సత్వర పరిష్కారం చూపాలనే అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి తగు చర్యలను తీసుకోవడం జరుగుతుందన్నారు. అదే విధంగా ఖాళీగా ఉన్న పోస్టులను అన్నింటినీ కూడా భర్తీ చేసేందుకు చర్యలను తీసుకుంటామన్నారు.  ఈ శాఖకు డాగ్ స్క్వాడ్ సేవలు అవసరమనే విషయాన్ని గుర్తించడం జరిగిందని, వాటి ఏర్పాటుకు కూడా చర్యలను తీసుకుంటామని ఆమె తెలిపారు. ఏపీఎస్పీఎఫ్ కి శాశ్వత ప్రాతిపదికన హెడ్ క్వార్టర్ అవసరమనే అంశాన్ని కూడా గుర్తించడం జరిగిందని, ఈ సమస్యలను కూడా పరిష్కరించే విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళతామని ఆమె తెలిపారు.  మంగళవారం జైళ్ల శాఖ పనితీరును సమీక్షించడం జరిగిందని, ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్రంలోని ఖైదీలకు కూడా ఆరోగ్య శ్రీ పథకాన్ని వర్తించేలా ముఖ్యమంత్రి అవకాశాన్నికల్పించారన్నారు. 

                                                                                                                                                                                        ఈ సందర్బంగా  పలువురు పాత్రికేయిలు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాదానం చెపుతూ ఖైదీలు చేసే వస్తువులపై జిఎస్టీ మినహాయింపు విషయాన్ని సమగ్రంగా చర్చించి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతామన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ఎంతో సమర్థవంతంగా పనిచేస్తున్నారని, వారికి కూడా ఏపీఎస్పీఎఫ్ లో అవకాశం కల్పించే చర్యలను తీసుకోవడం జరుగుతుందని ఆమె తెలిపారు. పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటనకు సంబందించిన అంశంపై ఎయిపోర్టులో పనిచేసే పోలీసు లపై ఇప్పటికే చర్యలను తీసుకోవడం జరిగిందని ఆమె తెలిపారు. లోన్ యాప్స్ వల్ల మోసపోయే వారు స్థానిక పోలీస్ స్టేషన్లలో గాని, కాల్ సెంటర్ కు గాని పోన్ చేసి   పిర్యాదు చేసినట్లైతే తక్షణ చర్యలను తీసుకోవడం జరుగుతుందని, కానీ దురదృష్ట వశాత్తూ చాలా మంది ఈ విధంగా పిర్యాదు చేయకపోవడం వల్ల సమస్యలు జఠిలం అవుతున్నాయన్నారు. లోన్ యాప్స్ ద్వారా  మోసం చేసే వారిని గుర్తించి తగు చర్యలు తీసుకోవడం  కూడా జరుగుతుందని ఆమె తెలిపారు .

                                                                                                                                                                                                       ఈ సమీక్షా సమావేశంలో హోంశాఖ ప్రిన్సిఫల్ సెక్రటరీ హరీష్ కుమార్ గుప్తా,  ప్రత్యేక కార్యదర్శి విజయకుమార్, ఏపీఎస్పీఎఫ్ డి.జి. సంతోష్ మెహ్ర, డి.ఐ.జి. బి.వి. రామిరెడ్డి, కమాండెంట్లు కె.ఎన్.రావు, డి.ఎన్.ఏ. బాషా, ఎం.శంకరరావు, డి.కె.ఎస్.రాజు, ఎక్కౌంట్స్ ఆఫీసర్ కె.వి.ఎస్. శర్మ తదితరులు పాల్గొన్నారు.

                                                                                                                                                                                       

Comments
Popular posts
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది.
Image
ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు
Image
*ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
Image
Shiv Nadar University Chennai inaugurated its flagship Quiz Competition - QUBIZ
Image
बर्खास्त होंगे उत्तराखंड विधानसभा सचिवालय के 228 कर्मी, हाईकोर्ट ने फैसला सही कहा।
Image