ప్రధాని సభ ఏర్పాట్లను పర్యవేక్షించిన వైఎస్సార్ సిపి ప్రాంతీయ సమన్వయకర్త వై.వి.సుబ్బారెడ్డి.

 ప్రధాని సభ ఏర్పాట్లను పర్యవేక్షించిన వైఎస్సార్ సిపి ప్రాంతీయ సమన్వయకర్త వై.వి.సుబ్బారెడ్డి.



 విశాఖపట్నం (ప్రజా అమరావతి) : ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పర్యటనలో భాగంగా ఈనెల 12వ తేదీన ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ లో జరుగనున్న సభా ప్రాంగణాన్ని టిటిడి చైర్మన్, వైఎస్సార్ సిపి ప్రాంతీయ సమన్వయకర్త వై.వి.సుబ్బారెడ్డి శనివారం సాయంత్రం ఎంపి వి.విజయసాయిరెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్, అనకాపల్లి ఎంపి బి.సత్యవతి, అనకాపల్లి పార్లమెంటరీ పార్టీ పరిశీలకులు దాడి రత్నాకర్, జిల్లా కలెక్టర్ మల్లికార్జున్, సిటీ పోలీస్ కమిషనర్ శ్రీకాంత్, జిల్లా అధికారులతో కలిసి పరిశీలించారు. నిర్దేశించిన సమయానికి  ఏర్పాట్లు పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. సభా స్థలిని పరిశీలించి పలు సూచనలు చేశారు. దూరప్రాంతాల నుంచి వచ్చే వాహనాల పార్కింగ్ కు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. ప్రధాని సభకు వచ్చే ప్రజలకు ఏలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Comments