అస్సుపత్రుల్లో వైద్య సేవలు అందేలా కృషి చేసిన ఘనత దివంగత ముఖ్యమంత్రి డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారికి దక్కుతుంది


నెల్లూరు (ప్రజా అమరావతి);



ఆరోగ్య శ్రీ పధకాన్ని ప్రవేశపెట్టి   పేద వానికి కార్పొరేట్ అస్సుపత్రుల్లో వైద్య సేవలు అందేలా  కృషి చేసిన ఘనత దివంగత ముఖ్యమంత్రి డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారికి దక్కుతుంద


ని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రొసెసింగ్  శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు.


స్థానిక మెడికవర్ ఆసుపత్రిలో నిర్మించిన  గుండాల పద్మనాభ రెడ్డి ప్లాటినమ్ బ్లాక్ ను మంగళవారం ఉదయం  మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి  ప్రారంభించారు. ఈ సంధర్భంగా మంత్రి శ్రీ  గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, ధనవంతులతో సమానంగా పేద వానికి కార్పొరేట్ అస్సుపత్రుల్లో వైద్య సేవలు అందేలా   దివంగత ముఖ్యమంత్రి డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్య శ్రీ పధకాన్ని ప్రవేశపెట్టడంతో,   నేడు నిరుపేదలు ధైర్యంగా భరోసాతో కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ పధకం ద్వారా వైద్య సేవలు పొందుతున్నారన్నారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గారు  ప్రజల ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్దతో ఆరోగ్య శ్రీ పధకాన్ని మరింతగా పటిష్టంగా అమలు చేస్తున్నారన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం 108, 104 వైద్య సేవలతో పాటు ఫ్యామిలి డాక్టర్ విధానాన్ని ప్రవేశపెట్టి  సామాన్య ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా కృషి చేస్తున్నట్లు మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి తెలిపారు.   రాష్ట్రంలో మెడికవర్ ఆసుపత్రి  అధునాతన వైద్య పరికరాలు,  వైద్య సౌకర్యాలతో  ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించడం అభినందనీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య శ్రీ పధకం ద్వారా   సమాజంలో పేదలకు మరింత వైద్య సేవలను అందించాలని మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి, ఈ సందర్భంగా మెడికవర్  ఆసుపత్రి యాజమాన్యానికి సూచించారు.  


 మెడికవర్ ఆసుపత్రి ఛైర్మన్ డా. అనిల్ కృష్ణ మాట్లాడుతూ,  25 బ్రాంచ్ లతో,  5 వేల బెడ్స్ తో, 11 వేల మంది సిబ్బందితో  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర మూడు రాష్ట్రాల్లో వైద్య సేవలను అందిస్తున్నట్లు తెలిపారు.  అధునాతన వైద్య పరికరాలతో  మెడికవర్ ఆసుపత్రి  ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించడం జరుగుచున్నదన్నారు.   అత్యంత అధునాతన సౌకర్యాలతో నిర్మించిన ప్లాటినం సూట్స్ ను ఈ రోజు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం ఎంతో సంతోషంగా వుందన్నారు.


ఈ కార్యక్రమంలో నగర మేయర్ శ్రీమతి పొట్లూరి స్రవంతి, శ్రీ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి,  మెడికవర్ ఆసుపత్రి  ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా. హరికృష్ణ, డా. సుధాకర్ రెడ్డి,  కార్పొరేటర్ శ్రీ సుధాకర్,  ఆసుపత్రి డాక్టర్స్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 


Comments