రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన అధ్యక్షతన కొనసాగుతున్న రాయలసీమ ప్రాంతీయ రెవెన్యూ అధికారుల సదస్సు
*
పుట్టపర్తి, నవంబర్ 16 (ప్రజా అమరావతి):
రాష్ట్ర రెవిన్యూ రిజిస్ట్రేషన్స్ స్టాంప్స్ శాఖామాత్యులు అధ్యక్షతన ప్రాంతీయ రెవెన్యూ అధికారుల సదస్సు (రాయలసీమ రీజన్) బుధవారం తిరుపతి గ్రాండ్ రిడ్జ్ హోటల్ నందు ప్రారంభమైంది.
ఈ సదస్సులో వైయస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు భూ రక్ష, ఇంటి పట్టాల పంపిణీ, డాటేడ్ ల్యాండ్స్, 22 ఏ కేసులు, సదా బైనామా, మ్యుటేషన్ , ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టాలు, ఆక్రమణల క్రమబద్ధీకరణలు, ఈ పంట నమోదు, వ్యవసాయ భూముల కన్వర్షన్ వంటి అంశాలపై చర్చకు రానున్నాయి
ఈ కార్యక్రమంలో వేదికపై రెవిన్యూ శాఖ మంత్రి , సీసీఎల్ఏ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్, అడిషనల్ సి సి ఎల్ ఏ, సెక్రటరీ ఇంతియాజ్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ మరియు డైరెక్టర్ సిద్ధార్థ జైన్,
సమీక్షలో పాల్గొన్న శ్రీ సత్య సాయి జిల్లా కలెక్టర్ పి బసంత కుమార్, జాయింట్ కలెక్టర్ టీఎస్ చైతన్, డిఆర్ఓ కొండయ్య, తదితరులు పాల్గొన్నారు
addComments
Post a Comment