న్యాయప్రక్రియకు..రాజ్యాంగపరమైన చట్టాలకు లోబడి వికేంద్రీకరణ చేయబోతున్నాం.


సీఎం క్యాంప్‌ ఆఫీస్‌- (ప్రజా అమరావతి);
*- సుప్రీం వ్యాఖ్యలు ఈనాడు, ఆంధ్రజ్యోతికి మాత్రమే విరుద్ధంగా కనిపించాయా..!?*

*- సుప్రీం వ్యాఖ్యలపై టీడీపీ స్పందించకపోయినా.. ఎల్లో మీడియా అత్యుత్సాహం*

*- సుప్రీం వ్యాఖ్యలు మాకు పాజిటీవ్ గా ఉంటే.. ఎల్లోమీడియాకు ఎందుకు కడుపుమంట?*

*- అబద్ధాలతో ఎల్లో మీడియాలో బ్యానర్లు పెడితే నమ్మేందుకు ప్రజలు పిచ్చోళ్ళు కాదు*

*- రాజ్యాంగం, రాజకీయాలను రాష్ట్రంలో మీడియా సంస్థలు నడుపుతాయా..?*

-ఃశ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి


*- న్యాయప్రక్రియకు..రాజ్యాంగపరమైన చట్టాలకు లోబడి వికేంద్రీకరణ చేయబోతున్నాం*

*- అమరావతి రైతులకు న్యాయం చేస్తాం..*

*- అమరావతిలో  ప్రభుత్వ పెట్టుబడులకు నష్టం లేకుండా చర్యలు*

*- ప్రభుత్వం నిర్వహణలో హైకోర్టు జోక్యం చేసుకుందనే సుప్రీం భావించింది*

-ఃశ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి


*- బాబు నిన్న మేల్కోలేదా..?*

*- వివేకా హత్య కేసులో నిందితులకు కఠినంగా శిక్ష పడాలి*

*- వివేకా హత్య కేసు విచారణను వేరే చోటికి మారిస్తే మాకూ మంచిదే..!*

*- టీడీపీ-ఎల్లోమీడియా కుళ్ళు రాజకీయంలో పవన్‌కళ్యాణ్‌ పావులా మారాడు*

*- షర్మిలమ్మ అరెస్టు విషయంలో వ్యక్తిగతంగా బాధ ఉంటుంది..*

-ఃశ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి

– అమరావతి రాజధానికి సంబంధించి ప్రభుత్వ అడుగులపై గతంలో హైకోర్టు తీర్పు.. కొన్ని అంశాలపై చేసిన నిర్ణయాలపైనే సుప్రీం కోర్టు తీవ్రంగా స్పందించింది. 

– రాజధానిని ఇన్ని రోజుల్లోనే నిర్మించాలని టైం లిమిట్‌ పెట్టడం.. రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వానికి సంక్రమించే హక్కుల్లో న్యాయస్థానాల జోక్యాన్ని సుప్రీం కోర్టు తప్పుబట్టింది. 

– రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ప్రభుత్వపరంగా,  గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారు.. మేము ఏమి అనుకున్నామో.. ఈరోజు సుప్రీం కోర్టు కూడా అదే చెప్పింది.

– రాజధానికి భూములిచ్చిన రైతులకు న్యాయం, ఈ ప్రాంత అభివృద్ధి అనేది ప్రభుత్వ బాధ్యతగా మేము ఆరోజున చెప్పినదానికే ఈరోజుకూ కట్టుబడి ఉన్నాం.  

– రాష్ట్రంలో అన్నిప్రాంతాలకు మధ్యలో ఉన్నందున ఇక్కడ శాసనరాజధాని ఉంటుంది. ఇదికాకుండా ఈ ప్రాంతంలో ఇంకా ఇనిస్టిట్యూషన్స్‌ చాలా  వస్తాయి.

– అమరావతి ప్రాంత అభివృద్ధితో, భూములు ఇచ్చిన రైతులు కూడా బెనిఫిట్‌ అవుతారు. ఆ దిశగా ప్రభుత్వం అడుగులేస్తుంది. 

– ‘ఇదేమీ ఇద్దరు ప్రయివేటు వ్యక్తుల మధ్య జరిగింది కాదు కనుక... లిటిగెంట్‌ విషయాలపై మీరెలా చేస్తారనే ప్రశ్న ఉత్పన్నం కాదుకనుకనే ప్రభుత్వం పాజిటివ్‌ ఆలోచనతో ముందుకెళ్తుంది.’

– ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఇది. ప్రజల ఆకాంక్షలకు తగినట్లుగా వ్యవహరిస్తుంది.. ఇందులో ఎలాంటి సందేహాలు ఉండనక్కర్లేదు

– రైతుల దగ్గర్నుంచి భూములు తీసుకోవడంలో కూడా ఆరోజు టీడీపీ నేతలు, అప్పటి ప్రభుత్వం బలప్రయోగాలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ‘ఇక్కడేదో భూతలస్వర్గం వస్తుందని.. పెద్దపెద్ద ప్రాజెక్టులు వస్తాయని భ్రమలు కల్పించి..  ఫక్తు రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలా.. స్టాక్‌ మార్కెట్‌ను క్రియేట్‌ చేసి షేర్లు అమ్ముకున్నట్లు భూములు కూడా అమ్ముకున్న చరిత్ర చంద్రబాబుది. 

– ఈ రాష్ట్రంలో ఉన్న పేదల గురించి ఆలోచిస్తున్న ప్రభుత్వం మాది... భూములిచ్చిన రైతులకు సానుకూలంగా ఉండమని పనిగట్టుకుని మాపై దుష్ప్రచారం చేయడంలో చంద్రబాబు.. ఎల్లోమీడియా ముందుకెళ్తున్నామని అనుకుంటే.. వాళ్లు ఎప్పటికీ సక్సెస్‌ కాలేరు.

– రాజధాని పేరిట ఇప్పటికి పెట్టిందెంత.. ఇంకా పెట్టాల్సిందెంత అనేది తేలిన తర్వాతనే గౌరవ ముఖ్యమంత్రి మూడు రాజధానులపై కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర బడ్జెట్‌ను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం అమరావతిలో పెట్టాల్సిన ఖర్చు బండలా భారం కాకూడదని అనుకున్నారు.

– అమరావతి రైతులకు న్యాయం చేయడంతోపాటు, ఇన్నాళ్లూ అమరావతిలో పెట్టిన ప్రభుత్వ పెట్టుబడి నష్టపోకుండా చూసే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుంది. 

– రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వం చేసే పనిలో హైకోర్టు జోక్యం చేసుకుందని సుప్రీం చెప్పడం వాస్తవం. 

– సుప్రీం కోర్టు వ్యాఖ్యలపై నిన్న ఎల్లోమీడియా ఎగబడి ఇష్టనుసారంగా రాతలు రాసింది. ‘హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వని సుప్రీంకోర్టు.. ప్రభుత్వానికి షాక్‌’ అంటూ బ్యానర్లు పెడతారా....? అసలు సుప్రీం దేనిపై స్టే ఇస్తుంది..? ఏమని ఇస్తుంది..?

– అంశాలవారీగా వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు దేనిమీద స్టే ఇచ్చారనేది జాతీయస్థాయి మీడియాతో సహా అంతా ప్రెజెంట్‌ చేస్తే.. ఈనాడు, ఆంధ్రజ్యోతి మాత్రం విరుద్ధంగా రాస్తాయా..?

– సుప్రీం తీర్పుపై ప్రభుత్వం, వైఎస్‌ఆర్‌సీపీ నేతలు సంబరాలేమీ చేసుకోవడంలేదు కదా..? 

– సుప్రీం వ్యాఖ్యలు ప్రభుత్వానికి పాజిటివ్‌గా ఉన్నాయనే కడుపుమంట, వికృత పైశాచిక ఆనందం ఎల్లోమీడియా బ్యానర్లలో కనిపించింది. 

– ఏదైనా ఒక విషయంలో స్టే ఇవ్వనంతమాత్రాన ప్రభుత్వానికి జరిగే నష్టమేంటి..? టీడీపీకి అజెండాను తయారుచేస్తున్న పత్రికలు.. జడ్జీలకు తెలుగురాదు కాబట్టి.. అబద్ధాలతో బ్యానర్లు పెడితే.. వాటిని చదివి నమ్మేందుకు ప్రజలు అంత పిచ్చోళ్లేమీ కాదు.

– టీడీపీ కోసం ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు, వాటి ఛానెల్స్‌.. చొక్కాలు చించుకుంటున్నాయి.

– సుప్రీం వ్యాఖ్యలపై టీడీపీ నిన్న ఏమైనా మాట్లాడిందా..? లేదుకదా.. ఇక్కడే ప్రజలు, మేధావులు అందరూ గమనించాలి. రాజ్యాంగం, రాజకీయంను మీడియా సంస్థలు నడుపుతాయా..?

– టీడీపీ అనే రాజకీయ సంస్థను ఈనాడు, ఆంధ్రజ్యోతి నడిపిస్తున్నాయి.

- ఏదో కథలో చెప్పినట్లు.. ‘కిందపడితే.. ఎవరైనా ఏంటి పడ్డావంటే.. లేదు ఆసనం వేస్తున్నామని చెప్పినట్లు..’ గా ఉంది టీడీపీ, ఎల్లోమీడియా పరిస్థితి. 

– అమరావతి ఉద్యమంలో రాజకీయం ఎంత ఉందనేది.. ఆ రాజకీయం ఎవరు చేస్తున్నారనేది ప్రజలు గమనించాలి.

– అమరావతిని రాజధాని చేయాలని పార్లమెంట్‌ చట్టంలో ఎక్కడా లేదు. అదే ఉంటే, శివరామకృష్ణన్‌ కమిటీ ఇక్కడ రాజధాని వద్దని చెప్పింది.  

- చంద్రబాబు మాత్రం ఇక్కడ నారాయణ కమిటీ ప్రకారం రాజధాని ఉండాలని నిర్ణయించాడు. వివిధ కమిటీలను, కేంద్ర ఆదేశాలను ఉల్లంఘించింది టీడీపీ, చంద్రబాబులే..

– రాజధాని కోసం రూ.5వేల కోట్లు ఇప్పటికి ఖర్చుపెట్టారు.  రైతులతో పేరుతో బయటకు వస్తున్నవారంతా  దళారులు, పెట్టుబడిదారులు, రియల్టర్లు.. అక్కడ రియల్‌ రైతులు చాలా తక్కువ మంది ఉన్నారు. కేంద్రం నుంచి రూ.15వేల కోట్లు వస్తే.. మొత్తం రూ.5,500 వేల కోట్లు ఖర్చు పెట్టారు. ఈ ల్యాండ్‌ పెట్టి లోన్లకు వెళ్లారు. రూ.లక్ష కోట్లు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు కావాలన్నారు.

వీళ్లు పెట్టిన కాస్త ఖర్చుకు.. రూ.50వేల కోట్లు ఖర్చు పెట్టామని చెప్పడం అనేది పచ్చి అబద్ధం. 

- రైతుల్ని ఆదుకోవడంలో  చంద్రబాబు కంటే బెటర్‌గా మా ప్రభుత్వం పనిచేస్తుంది. రైతుల పేరుచెప్పి టీడీపీ, ఎల్లోమీడియా ప్రతీరోజూ రాజకీయం చేస్తున్నాయి. 

- న్యాయస్థానాలు, న్యాయమూర్తులకు సంబంధించి.. వారు చాలా బాధ్యతగా ఇండిపెండెంట్‌గా ఉంటారని కోరుకుంటారు కదా... అలాంటి, వ్యవస్థ పట్ల కూడా టీడీపీ బరితెగించి మాట్లాడుతుంది. హైకోర్టు న్యాయమూర్తులను ఎలా బదిలీ చేశారని.. జగన్‌ గారు బదిలీ చేయించారని టీడీపీ ఆందోళన చేయడంలో అర్ధమేమైనా ఉందా..? 

– అంటే,  చంద్రబాబు అండ్‌ కో ఇదేవిధంగా చేసేవారా.. అనే అనుమానమొస్తుంది. 

– హైకోర్టు, సుప్రీంలో ఏదైనా కేసు విచారణకు వస్తే.. తీర్పులు ఇలా వస్తాయని వీళ్లు ముందుగానే చదువుతారు.. అసలు మీకెలా తెలుస్తాయి..? లిటిగేషన్ల ద్వారా వ్యవస్థల్ని బ్లాక్‌మెయిల్‌ చేయడం, ఊపిరిదీసుకోనంతగా చేయడమనేది టీడీపీకి వెన్నతో పెట్టిన విద్య.

– సుప్రీం కోర్టు అడగ్గా.. ఈరోజుకూ  రాజధాని అమరావతే అని ప్రభుత్వం సమాధానమిచ్చింది. రేపటికి ఏం చేస్తామనేది.. క్లియర్‌గా ఉన్నాం. ఎవరికీ నష్టం జరగకుండా.. మరింత పకడ్బందీగా చట్టాన్ని తెస్తాము. ఇదేదో క్యాజువల్‌ నిర్ణయం కాదు. కుట్రపూరిత నిర్ణయమూ కాదు. పూర్తిగా చట్టబద్ధంగా ప్రజల ఆకాంక్షలకు తగినట్టు.. అన్నిప్రాంతాలకు సమన్యాయం చేసే ఉద్దేశంతో వికేంద్రీకరణకు సంకల్పించాము. 

- న్యాయప్రక్రియకు..రాజ్యాంగపరమైన చట్టాలకు లోబడి వికేంద్రీకరణ చేయబోతున్నాం. 

–హైకోర్టులో కేసు విచారణ అడ్డంకి రాకపోతే.. బడ్జెట్‌లో ఇప్పటికే మూడు రాజధానుల బిల్లు పెట్టేవాళ్లం. రేపు జనవరి 31 వాయిదా తర్వాత జరిగే మార్పులకనుగుణంగా నడుచుకుంటాం. ఇప్పటికీ వికేంద్రీకరణ ఇంటెన్షన్‌తోనే ఉన్నాం. 


*బాబు నిన్న మేల్కోలేదా..?*

*- వివేకా హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్ష పడాలి*

*- వివేకా హత్య కేసు విచారణను వేరే చోటికి మారిస్తే మాకూ మంచిదే..!*

నిన్న చంద్రబాబు ఊర్లోలేడో.. నిద్రపోయాడో తెలియదు.. ప్రభుత్వ బాధ్యతల్లో హైకోర్టు జోక్యంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలకు సంబంధించి అన్ని మీడియా సంస్థలు స్పందిచినప్పటికీ.. నిన్న మేల్కొనలేని చంద్రబాబు.. ఈరోజు వివేకానందరెడ్డి గారి హత్యకేసు విచారణపై ఎగిరెగిరి ట్వీట్‌ చేశాడు. వివేకా గారి హత్యకేసు విచారణను వేరే కోర్టుకు మారుస్తామని మొన్న సుప్రీం కోర్టు చెప్పిందానికి, ఈరోజు ఏ స్టేట్‌కు అప్పగించాలనేది ప్రకటన చేశారు. ఇందులో ఆశ్చర్యమేముంది..?

-  హత్యకు గురైన వివేకానందరెడ్డిగారు వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు. ఆయన మా అధినేత శ్రీ జగన్‌మోహన్‌రెడ్డి గారికి స్వయాన చిన్నాయన.. ఆయన్ను హత్య చేసిన వారికి కఠినంగా శిక్షపడాలని వారి కుటుంబం కోరుకుంటుంది. అయితే, ఇందులో రాజకీయాలు చొప్పించి టీడీపీ లేనిపోని కుట్రలు చేస్తుంది.  ట్రయల్‌ ఎక్కడ జరిగినా.. ఇన్వెస్టిగేషన్‌ అనేది సంఘటన జరిగిన ప్రాంతంలోనే జరుగుతుంది. ట్రయల్‌ ఇక్కడ్నుంచి మారిస్తే మాకూ మంచిదే. నిజాన్ని ఎవరూ దాచిపెట్టలేరు. అక్కడ విచారణ జరిగితే మరీ మంచిది. ఈ కేసుకు సంబంధించి శ్రీ జగన్‌మోహన్‌రెడ్డి గారు ఓపెన్‌ నేచర్‌తో ఉన్నారు. లోగొట్టులేమీ లేవు. దాపరికాలేమీ లేవు. ఆరోజు సీబీఐకి అప్పగించాలంటే.. మేమేమీ అడ్డు చెప్పలేదు. 

– ఎక్కడైనా ఏమైనా జరిగితే, తన గుట్టు ఎక్కడ బయటపడుతుందోననే భయపడే వ్యక్తి చంద్రబాబు.  మా పార్టీ నాయకుడి హత్యకు కారణమైన వారికి కఠినమైన శిక్షలు పడాలని మేమూ కోరుకుంటున్నాము. వ్యవస్థల్ని మేనేజ్‌ చేయడంలో టీడీపీ వాళ్లు సిద్ధహస్తులు కాబట్టి.. మేమేదో ఈ కేసులో చేస్తున్నామని అనడం పట్ల మేమేమీ రియాక్ట్‌ కావడం లేదు. న్యాయస్థానం ముందుకు ఒక విషయం పోయినప్పుడు.. జడ్జీల ఇష్టం. పక్కరాష్ట్రంలో కేసు విచారణ జరిగితే బాధిత కుటుంబానికి న్యాయం జరుగుతుందనేది జడ్జీల అభిప్రాయం. అదే చంద్రబాబైతే.. పక్కరాష్ట్రాలకు కేసులు ఎందుకు బదిలీ చేస్తారని  క్వశ్చన్‌ చేసేవాడు. ‘మీ సీఐడీ మీకుంటే... మా సీఐడీ మాకుందని..’ గతంలో  చంద్రబాబు, కేంద్రాన్ని బెదిరించినట్టు బెదిరించే స్థాయి మాది కాదు. బాబు పాలిటిక్స్‌ను ఫేస్‌ చేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర పోలీస్ నుంచి సీబీఐకి ఇచ్చేటప్పుడే మేం వద్దని పట్టుబట్టలేదు. వైఎస్‌ఆర్‌సీపీని, జగన్‌మోహన్‌రెడ్డి గారిని రాజకీయంగా నేరుగా ఎదుర్కొనలేక.. ఆయన కుటుంబసభ్యుల్ని రప్పించుకుని వ్యక్తిగతంగా బదనాం చేయడానికి కుట్రలు చేస్తున్నారనేది వాస్తవం. వ్యవస్థల్ని మేనేజ్‌ చేయడంలో టీడీపీ ఎంత దిట్ట అనేది అందరికీ తెలుసు. చంద్రబాబు..ఆయనకు వత్తాసు పలికే ఎల్లోమీడియా అనేది కరోనా వైరస్‌ లాంటోళ్లు .. ఇక్కడేదో కేసు విచారణకు అడ్డంపడుతున్నారని సీబీఐ రిపోర్టు మొత్తం ఎవరైనా చదివితే.. వ్యవస్థల్ని టీడీపీ ఏవిధంగా మేనేజ్‌ చేస్తారనేది తెలుస్తుంది. ఇందుకు ఉదాహరణలు ఏమిటంటే... ఎన్టీఆర్‌ గారిని అధికారం నుంచి దించడంలో ఆనాడు నాదెండ్ల భాస్కరరావు.. ఆ తర్వాత చంద్రబాబు పాత్రల్ని రాష్ట్ర ప్రజలంతా చూశారు.*టీడీపీ-ఎల్లోమీడియా కుళ్ళు రాజకీయంలో పవన్‌కళ్యాణ్‌ పావులా మారాడు*

చంద్రబాబు పంపిన ఇప్పటం స్క్రిప్టులో.. నాపేరు ఉన్నట్లు జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ చదివాడు. ఏదో ఒక వలసపక్షిలా వచ్చి.. వారానికోమారు కామెంట్లు చేసి పోతాడు. నిజానికి, ఆయన రాజకీయ భవిష్యత్తు బాగుండాలంటే..పవన్‌ తనను తాను నిందించుకోవాలి. చంద్రబాబు చెప్పినట్లు ఎందుకు నడుచుకుంటున్నాని తనకుతాను ప్రశ్నించుకోవాలి. టీడీపీకి వ్యతిరేకంగా తాను మాట్లాడాడని.. గత ఎన్నికల్లో వాళ్ల అమ్మను ఆపార్టీ నాయకులే ఏదో అన్నారని బాధపడుతూ.. పవన్‌కళ్యాన్‌ అప్పుడు ట్వీట్‌ పెట్టుకున్నాడు. నిజానికి జగన్‌మోహన్‌రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకుంటేనే పవన్‌కళ్యాణ్‌కు రాజకీయ భవిష్యత్తు బాగుంటుందేమో..!

-  ఎన్నెన్నో శక్తులు ఆపినా అధిగమించి ముందుకు వచ్చి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గారు ఏవిధంగా ప్రజల మన్ననలు పొందారనేది తెలుసుకుంటే.. పవన్‌కు మంచిది. కానీ, ఆయన ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీడీపీ కుళ్లు రాజకీయంలో పావులా మారుతున్నాడు. వైఎస్‌ఆర్‌సీపీని కూలుస్తాననే మాటకు ముందు తనపార్టీకి చంద్రబాబు ఎన్నిస్థానాలు ఇస్తున్నాడు..? అనేది తేల్చుకోవాలి. బాబు విదిల్చిన స్థానాల్లో పవన్‌ గెలవగలడా..లేదా అనే విషయం తేలాక.. సీఎం అభ్యర్థి చంద్రబాబా, పవన్‌నా..? ఇలాంటి క్వశ్చన్లు తేలకుండా.. వైఎస్ఆర్సీపీపై కామెంట్లు చేయడం చూస్తుంటే.. పాపం అతనిపై జాలిపడాల్సి వస్తుంది.


*షర్మిలమ్మ అరెస్టు విషయంలో వ్యక్తిగతంగా బాధ ఉంటుంది..*

మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి గారి కుమార్తెగా, మా గౌరవ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గారి చెల్లెలుగా షర్మిలమ్మ,  వ్యక్తిగతంగా అందరిలో భాగంగా ఇంతకుముందు ఉన్నారు. కనుకనే, ఆమె అరెస్టు వ్యవహారం మాకందరికీ వ్యక్తిగత బాధ గలిగించే విషయం. తెలంగాణాలో ఆమె, తన రాజకీయపరంగా, విధానపరంగా తీసుకున్న నిర్ణయాల్లో వైఎస్‌ఆర్‌సీపీ పరంగా మేము కామెంట్‌ చేయలేం. ఆమెది వైఎస్ఆర్ టీపీ.. మాది వైఎస్ఆర్ సీపీ. తెలంగాణలో ఆ పార్టీ విధానాలు వేరు. ఇక్కడ మా పార్టీ విధానాలు వేరు. 


Comments