డిసెంబర్ చివరి నాటికి గోశాలలో అభివృద్ధి పనులు పూర్తి చేయాలి : టిటిడి ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి

 డిసెంబర్ చివరి నాటికి గోశాలలో అభివృద్ధి పనులు పూర్తి చేయాలి : టిటిడి ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి


తిరుపతి,  నవంబరు 22 (ప్రజా అమరావతి): శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో నిర్మాణంలో ఉన్న ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్, నెయ్యి తయారీ కేంద్రం, అగరబత్తుల తయారీ రెండవ యూనిట్ ను డిసెంబర్ చివరి నాటికి అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని టిటిడి ఈఓ శ్రీ ఏవి.ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో మంగళవారం సీనియర్ అధికారులతో ఈవో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ రాబోయే ఆరు నెలల్లో రోజుకు 2500 లీటర్ల పాల ఉత్పత్తి జరిగేలా కృషి చేయాలని గోశాల అధికారులకు సూచించారు. తిరుమలలో టాటా సంస్థ సహకారంతో జరుగుతున్న మ్యూజియం పనులను వేగవంతం చేయాలని, డిసెంబర్ మొదటి వారం నుంచి వీరి సేవలను వినియోగించుకోవాలని కోరారు. టిటిడి స్థానిక ఆలయాలు, సమాచార కేంద్రాల్లో నిరుపయోగంగా ఉన్న సామగ్రిని డిపిడబ్ల్యు స్టోరుకు తరలించాలని సూచించారు.

అనంతరం న్యాయ విభాగం, అటవీ, రవాణ, డెప్యూటీ ఈఓ జనరల్, ఎస్టేట్, వేద వర్సిటీ, శ్వేత తదితర విభాగాల్లో సంబంధించిన పెండింగ్ అంశాలపై సమీక్షించారు.

ఈ సమీక్షలో జెఈఓలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, ఎస్వీబీసీ సీఈవో శ్రీ షణ్ముఖ్ కుమార్, ఎఫ్ఎసిఎఓ శ్రీ బాలాజీ, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, సీఏవో శ్రీ శేషశైలేంద్ర ఇతర అధికారులు పాల్గొన్నారు.

Comments