విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు మా ప్రభుత్వ అత్యంత ప్రాదాన్యతనిస్తోంది

 

విజయవాడ (ప్రజా అమరావతి);


విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు మా ప్రభుత్వ అత్యంత ప్రాదాన్యతనిస్తోంది


- కార్పోరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నాం.

- మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయం ఈ  మూడు ప్రధాన రంగాలకు అత్యధిక ప్రాధాన్యమిచ్చి సంస్కరణలు, అభివృద్ధి, సంక్షేమం వంటి అంశాలను పటిష్ఠంగా, పకడ్బందీగా అమలు చేస్తుందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.  తాడేపల్లి లోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో విద్యా శాఖ ప్రగతిని మంత్రి వివరించారు.  ఈసందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ   విద్యా సంస్కరణలతో పిల్లలకు, విద్యార్థులకు మంచి జరగాలన్నదే ఈ ప్రభుత్వ ఉద్దేశ్యం తప్ప మరేతర వ్యక్తిగత ఉద్ధేశ్యాలు లేవని స్పష్టం చేశారు. మన ప్రభుత్వం రాకముందు విద్యారంగం  పరిస్థితి ఏంటి.? ఇప్పటి పరిస్థితి ఏంటి..? అనేది ప్రతిపక్షాలు ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఆయన కోరారు. కార్పోరేట్ స్కూళ్లకు దీటుగా 44 వేల 570 ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాలను కల్పిస్తూ విద్యాభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. జాతీయ విద్యావిధానం, శాస్త్రీయ విధానంలోనే సంస్కరణలు కొనసాగిస్తున్నామని.. ఫౌండేషన్ స్కూళ్లు, సిబిఎస్ ఇ విధానం, పాఠశాలల విలీనం... ఇవన్నీ కూడా సంస్కరణలలో భాగమేనని మంత్రి బొత్స స్పష్టం చేశారు.

  ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ... విద్య, వైద్యం, వ్యవసాయం ఈ మూడు అంశాలు దివంగనేత మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి పెటెంట్ అని అన్నారు. ప్రజల సంక్షేమం, శ్రేయస్సు కోసం తండ్రి వైఎస్సార్ రెండు అడుగు ముందుకేస్తే, ఆయన తనయుడిగా వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి తాను నాలుగు అడుగులు ముందుకేస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినప్పుడు చెప్పిన మాటలకు అనుగుణంగా విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మనబడి నాడు - నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దుతున్నామన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతులు, అభివృద్ధికి కోట్ల నిధులను వెచ్చిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో దాదాపు 44,500లకు పైగా ప్రభుత్వ పాఠశాలల్లో నాడు-నేడు క్రింద మూడు ఫేజ్ లలో అభివృద్ధి చేస్తున్నామని.. ఇప్పటికే ఫేజ్-1 పనులు పూర్తికాగా ఫేజ్-2 పనులు జరుగుతున్నాయని తెలిపారు. స్వాతంత్ర్యం అనంతరం 2019 వరకూ ప్రభుత్వ పాఠశాలల గత పరిస్థితి, ఈ ప్రభుత్వంలో ప్రస్తుత విద్యా రంగ పరిస్థితులను బేరీజు వేసి చూసుకోవాలని ఆయన కోరారు. గత ప్రభుత్వంలో 2014లో ప్రభుత్వ బడుల్లో 42 లక్షల మంది విద్యార్థులుంటే... 2019 నాటికి ఆ సంఖ్య 37 లక్షలకు ఎందుకు తగ్గిందని ఆయన ప్రశ్నించారు. మేము అధికారంలోకి వచ్చినపుడు ఉన్న 37 లక్షలని మళ్లీ 42 లక్షలకి పెంచగలిగామంటే మేము తీసుకున్న విధానాలే కారణమన్నారు. గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో 2,900 స్కూళ్లు మూతపడ్డాయని.. ఈ ప్రభుత్వ హాయాంలో మూతపడిన స్కూల్ ఒక్కటైనా చూపించగలరా..? అని ప్రశ్నించారు. ఇంగ్లీషు మీడియంపై కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని, వారి పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారో చెప్పాలన్నారు. పేద బిడ్డలు మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదవకూడదనేదే వారి ఆలోచనా విధానమా..? సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. విద్యా రంగంలో అమలు చేస్తున్న సంస్కరణల వల్ల రానున్న రోజుల్లో మంచి ఫలితాలు వస్తాయని మంత్రి బొత్స తెలిపారు.

పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్ మాట్లాడుతూ... జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే సామర్ధాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వారికి రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోందని తెలిపారు. విద్య ద్వారానే పేదరికం పోతుందని పూర్తిగా విశ్వసించిన ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి విద్యరంగానికి అధిక నిధులు ఖర్చుచేస్తున్నారని తెలిపారు. 90 నుండి 95 శాతం నిరుపేదలు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివిస్తున్నారన్నారు. విద్యా ప్రమాణాలపై ఎప్పటికపుడు కేంద్ర, రాష్ట్ర స్ధాయిలో పరిశీలన జరుగుతోందన్నారు. నూతన‌ జాతీయ విద్యా విధానం రాకముందే.. రాష్ట్రప్రభుత్వం నియమించిన బాలకృష్ణన్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ కూడా విద్యావిధానంలో సంస్కరణలు సూచించిందని తెలిపారు. 10+2 విద్యావిధానంలో మార్పులు తీసుకువచ్చామన్నారు. 2019 నాటికి 15 వేల ప్రైవేట్ పాఠశాలల్లో 55 శాతం విద్యార్ధులు చదివితే.... 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 45 శాతం విద్యార్థులు మాత్రమే చదువుతున్నారని తెలిపారు. పేదవాళ్లు సైతం తమ‌ పిల్లలని బాగా చదవాలనే ప్రైవేట్ వైపు అడుగులు వేస్తున్నట్లు గుర్తించామన్నారు. ఇంగ్లీష్ మీడియం కోసం పది కిలోమీర్ల పైన ప్రైవేట్ స్కూళ్లకి కూడా వెళ్తున్నారని తెలిపారు. 96 శాతం మంది తల్లితండ్రులు ఇంగ్లీష్ మీడియం కోరుతున్నారని తెలిపారు. పూర్తిస్ధాయిలో కసరత్తులు చేసిన తర్వాతే పాఠశాలల మ్యాపింగ్ చేపట్టామని స్పష్టం చేశారు.  సబ్జెక్ట్ ఉపాధ్యాయులతోనే మూడు, నాలుగు, అయిదు తరగతుల విద్యార్ధులకి‌ పాఠ్యాంశాల బోధన జరుగుతుందన్నారు. 4067 మంది ఉపాధ్యాయులకి పదోన్నతులు ఇవ్వబోతున్నామని వెల్లడించారు. వచ్చే ఏడాదికి ఈ పాఠశాలలకి 35 వేల అదనపు తరగతులని నిర్మించబోతున్నామని తెలిపారు. విద్యార్ధుల‌ ఉజ్వల భవిష్యత్ కోసమే ఈ సంస్కరణలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని ఆయన తెలిపారు. 

ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎన్. సురేష్ కుమార్, ఇంటర్మీడియెట్ బోర్డు కమిషనర్ ఎం.వి. శేషగిరి బాబు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Comments
Popular posts
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది.
Image
న్యాయప్రక్రియకు..రాజ్యాంగపరమైన చట్టాలకు లోబడి వికేంద్రీకరణ చేయబోతున్నాం.
Image
ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు
Image
*ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
Image
बर्खास्त होंगे उत्तराखंड विधानसभा सचिवालय के 228 कर्मी, हाईकोर्ट ने फैसला सही कहा।
Image