కులమతాలకు అతీతంగా పల్నాటి విరారాధన ఉత్సవాలు: ప్రభుత్వ విప్ మాచర్ల శాసనసభ్యులు శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి .

 కులమతాలకు అతీతంగా పల్నాటి విరారాధన ఉత్సవాలు: ప్రభుత్వ విప్ మాచర్ల శాసనసభ్యులు శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి .


మాచర్ల (ప్రజా అమరావతి);

మాచర్ల నియోజకవర్గం కారంపూడి పల్నాటి ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజు చాపకుడు కార్యక్రమాన్ని ప్రారంభించిన పల్నాడు జిల్లా కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్ శ్రీ లోతేటి శివ శంకర్ గారు, పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ రవి శంకర్ రెడ్డి గారు, శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ప్రభుత్వ విప్, వై.యస్.అర్.సి.పి పల్నాడు జిల్లా అధ్యక్షులు & జిల్లా అభివృద్ధి మండలి చైర్మన్, మాచర్ల శాసనసభ్యులు, నరసరావుపేట   పార్లమెంట్ సభ్యులు శ్రీ లావు శ్రీకృష్ణాదేవరాయలు గారు.


అలనాడు బ్రహ్మనాయుడు స్థాపించిన సమసమాజ స్థాపనకు చాపకుడు సిద్ధాంతాన్ని అమలు చేస్తు పలనాటి వీరుల ఉత్సవాలలో మూడవ రోజు అయినా మందపోరు కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన చాపకుడు కార్యక్రమన్ని ప్రారంభించారు. వీర్ల దేవాలయ ప్రాంగణంలో ఎంతో వైభవంగా జరిగింది. పీఠాధిపతి పిడుగు తరుణ్ చెన్నకేశవ అయ్యగారితో కలిసి అక్కడే నెల మీద కూర్చొని సంప్రదాయనికి అనుగుణంగా చాపకుడు భోజనాన్ని అందరితో కలసి భుజించారు. కుల, మాత వర్గ రహిత సమాజం కోసం అలనాడు బ్రహ్మనాయుడు స్థాపించిన చాపకుడు సిద్ధాంతాన్ని ప్రతియేటా ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉంది అని తెలిపారు. పల్నాటి కీర్తి ప్రతిష్టలు బ్రహ్మనాయుడి సిద్ధాంతాలను ప్రతి ఒక్కరు తుచతప్పక పాటిస్తారని ఎమ్మెల్యే గారు తెలిపారు.

Comments