ప్రతి రూపాయి సద్వినియోగం దిశగా....


ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానం, విశాఖపట్నం (ప్రజా అమరావతి);


*విశాఖపట్నంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ పర్యటన.*

*హాజరైన గవర్నర్ శ్రీ‌ బిశ్వభూషణ్‌ హరిచందన్, ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌.*


*ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ, గవర్నర్ శ్రీ‌ బిశ్వభూషణ్‌ హరిచందన్, సీఎం శ్రీ వైయస్‌.జగన్, కేంద్ర రైల్వే మంత్రి శ్రీ అశ్వినీ వైష్టవ్‌‌.*


*ఈ సందర్భంగా  రూ.10,742 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన ప్రధానిమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.*


*విశాఖ సభలో ప్రసంగించిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.*


*ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే....:*


*ఉత్తరాంధ్ర గడ్డమీద సాదర స్వాగతం...* 

దేశ ప్రగతి రథసారధి, గౌరవనీయులు, పెద్దలు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి, రాష్ట్ర గవర్నర్‌ శ్రీ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ గారికి, కేంద్ర మంత్రివర్యులకు, మనసు నిండా ఆప్యాయతలతో, చిక్కటి చిరునవ్వులతో లక్షలాదిగా తరలి వచ్చిన నా అక్కలకు, చెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు, అవ్వాతాతలకు, ఆంద్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం తరపున, ప్రజల తరపున ఉత్తరాంధ్రా గడ్డ మీద ఈ విశాఖలో సాదరంగా, హృదయపూర్వకంగా రెండు చేతులు జోడించి స్వాగతం పలుకుతున్నాను.


*ఒకవైపు సముద్రం– మరోవైపు జన సముద్రం...*

ఈ రోజు చారిత్రక ఆంధ్రా యూనివర్సిటీ ప్రాంగణంలో ఒకవైపు సముద్రం కనిపిస్తోంది, మరోవైపు జనసముద్రం కనిపిస్తోంది. కార్తీక పౌర్ణమివేళ ఎగసిపడిన కెరటాలకు మించి ఈరోజు జనకెరటం ఇక్కడ ఉవ్వెత్తున ఎగిసిపడుతూ కనిపిస్తోంది.


*ఏం పిల్లడో ఎల్దమొస్తవా అన్నట్లు....*

 ఇక్కడకి వచ్చిన ఈ జనాభాను చూస్తుంటే ప్రజాకవి, గాయకుడు వంగపండు చెప్పినట్టుగా..పాడినట్టుగా.. తన మాటలు గుర్తుకొస్తున్నాయి. ఏం పిల్లడో ఎల్దామొస్తవా అంటూ....ఈ రోజు మనం తలపెట్టిన ఈ మహాసభకు ఉత్తరాంధ్ర జనం ప్రభంజనంలా కదిలి రావడం కనిపిస్తోంది. 


ఇదే నేలమీద నడియాడిన మహాకవి శ్రీశ్రీ మాటల్లో చెప్పాలంటే.. వస్తున్నాయ్‌.. వస్తున్నాయ్‌ జగన్నాధ రథచక్రాలొస్తున్నాయ్‌ అంటూ కదిలివస్తున్న లక్షల జనసందోహం మన ఎదుట కనిపిస్తోంది.


*ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టేలా జన సందోహం...* 

ఈ రోజు దేశమంటి మట్టికాదోయ్‌.. దేశమంటే మనుషులోయ్‌ అన్న మన విజయనగరం వాసి, మహాకవి గురజాడ మాటలు మనందరికీ కర్తవ్య బోధ చేస్తున్నాయి. ప్రజల అభిమానంతో పాటు వారి ఆకాంక్షలకు ఇక్కడకు వచ్చిన ఈ జనసాగరం అద్దం పడుతోంది. 


దాదాపుగా రూ.10,742 కోట్లు ఖర్చయ్యే అభివృద్ధి కార్యక్రమాలకు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీగారు తన చేతుల మీదుగా శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నందుకు...ఈ ఆశేష జనవాహిని తరపున, రాష్ట్ర ప్రజలందరి తరపున నిండుమనస్సుతో శ్రీ నరేంద్రమోదీగారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. 


*ప్రతి రూపాయి సద్వినియోగం దిశగా....


*

సర్‌... ప్రజల ప్రభుత్వంగా గడిచిన మూడున్నర సంవత్సరాలలో ఈ రాష్ట్రంలో పిల్లల చదువులు అయితేనేమి, ప్రజలందరికీ వైద్య ఆరోగ్యం అయితేనేమి, రైతులు సంక్షేమం, సామాజిక న్యాయం, మహిళా సంక్షేమంతో పాటు అభివృద్ధి, పరిపాలన, ఈ రెండింటి వికేంద్రీకరణ, పారదర్శకత, గడపవద్దకే పరిపాలన ఇలా.. ఈ మూడున్నర సంవత్సరాలుగా రాష్ట్రంలో మా ప్రాధాన్యతలుగా అడుగులు వేశాం. ఒక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ నిలదొక్కుకోవడం అంటే ఈ రాష్ట్రంలోని ప్రతి గ్రామం, ప్రతి ఇంట ప్రతి ఒక్క కుటుంబం నిలదొక్కుకోవడం అని నమ్మి, ఇంటింటా ఆత్మ విశ్వాసాన్ని నింపడానికి మా ఆర్ధిక వనరుల్లో ప్రతి రూపాయి సద్వినియోగం చేశాం. 


ఒక రాష్ట్ర ప్రభుత్వంగా మా శక్తిమేరకు మేం చేస్తున్న ప్రయత్నాలకు పెద్దలు, సహృదయలు అయిన మీరు, మీ సహాయ సహకారాలు మరింతగా అందించి మమ్మల్ను ఆశీర్వదించాలని ఈ సభా ముఖంగా మిమ్నల్ని (ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీగారిని) కోరుతున్నాను.


*ఎనిమిదేళ్ల గాయం నుంచి కోలుకోనేలేదు....*

ఎనిమిదేళ్ల క్రితం తగిలిన అతిపెద్ద గాయం నుంచి మా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ ఇంకా కోలుకోలేదు. మా గాయాలు మానేలా, మా రాష్ట్రం జాతీయ స్రవంతితో పాటు అభివృద్ధి చెందడానికి వీలుగా, మీరు సహృదయంతో విశాల హృదయంతో చేసే ప్రతి సహాయం, మీరు మా రాష్ట్రానికి ప్రత్యేకంగా ఇచ్చే ప్రతి సంస్థ, మీరు మా రాష్ట్రానికి అదనంగా ఇచ్చే ప్రతి రూపాయి, మా రాష్ట్ర పునర్‌నిర్మాణానికి గొప్పగా ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను.



*కేంద్రంతో రాజకీయాలకతీతమైన అనుబంధం..*

మీరు మా రాష్ట్రం కోసం, మా ప్రజల కోసం చేసే ఏ మంచి అయినా కూడా.. ఈ రాష్ట్రం, ఈ ప్రజానీకం ఎప్పటికీ గుర్తుపెట్టుకుందని మనవి చేస్తున్నాను. అలాగే ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి. కేంద్ర ప్రభుత్వంతో ప్రత్యేకంగా మీతో మా అనుబంధం.. పార్టీలకు, రాజకీయాలకు అతీతం. 


*ఏపీ ప్రయోజనాలే మా అజెండా....*

మా రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మాకు మరో ఎజెండా లేదు. ఉండదు, ఉండబోదు. మా రాష్ట్రానికి, మా రాష్ట్ర ప్రజలకు గత ప్రభుత్వాలు చేసిన అన్యాయాలను  గుర్తుపెట్టుకున్న మా రాష్ట్ర ప్రజలు.... మీరు మరింతగా పెద్దమనసు చూపితే.. అలా మీరు చూపించే ఆ పెద్ద మనసును, మీరు చేసే ఆ మంచిని కూడా గుర్తుపెట్టుకుంటారు అని మరోసారి తెలియజేస్తున్నాను.

ఈ రాష్ట్ర ప్రజలందరి తరపున రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా, రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా ఇవాళ కానీ, ఇంతకముందు పలు సందర్భాలలో కానివ్వండి.. విభజనకు సంబంధించిన హామీల దగ్గర నుంచి.. పోలవరం నుంచి ప్రత్యేక హోదా వరకు, విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ నుంచి రైల్వే జోన్‌ వరకు... ఇలా పలు అంశాల మీద పలు సందర్భాలలో మీకు చేసిన పలు విజ్ఞప్తులను మీరు సానుకూలంగా పరిగణలోకి తీసుకుని పెద్ద మనుసుతో వాటిని అన్నింటినీ కూడా పరిష్కరించాలని మనసారా కోరుకుంటున్నాను.


మంచి చేసే మన ప్రభుత్వానికి నిరంతరం దేవుడి దయ, ప్రజలందరి  చల్లని దీవెనలు, పెద్దలైన మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ లభించాలని ఆశిస్తూ.. సెలవు తీసుకుంటున్నాను అని సీఎం తన ప్రసంగం ముగించారు.

Comments
Popular posts
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది.
Image
ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు
Image
*ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
Image
Shiv Nadar University Chennai inaugurated its flagship Quiz Competition - QUBIZ
Image
बर्खास्त होंगे उत्तराखंड विधानसभा सचिवालय के 228 कर्मी, हाईकोर्ट ने फैसला सही कहा।
Image