డిసెంబర్ కల్లా 'అభా' నమోదు ప్రక్రియ పూర్తి చేయాలి.డిసెంబర్ కల్లా 'అభా' నమోదు ప్రక్రియ పూర్తి చేయాలి.


సిహెచ్ ఓలకు వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ కృష్ణబాబు ఆదేశం.


'భవిష్యత్లో వైద్య సేవలన్నీ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ల లోనే


• నాడు-నేడు వైద్య సేవలను ప్రజలు బేరీజు వేసుకుని సంతృప్తి వ్యక్తం చేసేలా సిహెచ్ ఓలు పనిచేయాలి


'గ్రామస్థాయిలోనే అవసరమైన వైద్యసేవలందుతాయన్న విశ్వాసాన్ని ప్రజల్లో కల్పించాలి.


 విలేజ్ ఆర్గనైజేషన్స్, స్థానిక పెద్దల సహకారం తీసుకోవాలి.


అమరావతి (ప్రజా అమరావతి): ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య ఖాతా (ఎబిహెచ్ఎ-అభా) నమోదు ప్రక్రియను డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎంటి కృష్ణబాబు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లకు (సిహెచ్ ఓలు) స్పష్టం చేశారు. గురువారం ఆయన మంగళగిరిలోని ఎపిఐఐసి భవనంలోని వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం నుండి సిహెచ్ ఓల శిక్షణా కార్యక్రమానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభోత్సవ ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభా  నమోదు ప్రక్రియ ఇప్పటి వరకూ 70 శాతం పూర్తయిందని, డిసెంబర్ నాటికల్లా మిగిలిన 30 శాతం పూర్తయ్యేందుకు కృషి చేయాలని సూచించారు. నమోదు ప్రక్రియ విషయంలో అలసత్వం వహించొద్దని సూచించారు. ప్రతి వ్యక్తియొక్క ఆరోగ్య సమాచారానికి సంబంధించిన రికార్డు మన వద్ద వుండాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టమైన ఆదేశాలిచ్చారని ఆయన గుర్తు చేశారు. భవిష్యత్తులో వైద్య సేవలన్నీ వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ లలోనే అందుబాటులోకి వస్తాయని చెప్పారు. విలేజ్ హెల్త్ క్లినిక్ వైద్య బృందానికి సిహెచ్ ఓలే టీం లీడర్ గా వ్యవహరిస్తారన్నారు. ప్రజలు తమకు గతంలో అందిన , ఇప్పుడు అందుతున్న వైద్య సేవలను బేరీజు వేసుకుని ప్రస్తుత సేవలపై సంతృప్తి వ్యక్తం చేసే విధంగా సిహెచ్ ఓలు అంకిత భావంతో పని చేయాలని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఫ్యామిలీ ఫిజిషియన్' విధానం ద్వారా గ్రామీణులకు పూర్తి స్థాయిలో వైద్యసేవలందించే విధంగా సిహెచ్ ఓలు వ్యవహరించాలన్నారు. గ్రామస్తాయిలోనే తమకు అవసరమైన వైద్య సేవలందుతాయన్న విశ్వాసాన్ని గ్రామీణులకు కల్పించాల్సిన అవసరం వుందన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం చూపవద్దని, ప్రజలకు వైద్య సేవలందించటంలో చురుగ్గా వ్యవహరించి వారిలో విశ్వాసం కల్పించాలని ఆయన సూచించారు. సెర్ప్ ఆధ్వర్యంలోని విలేజ్ ఆర్గనైజేషన్ల ద్వారా గ్రామీణుల్లో అవగాహన కల్పించాలని, ఇందుకు స్థానిక పెద్దల సహకారం

తీసుకోవాలని సూచించారు. ఎన్ సిడి సర్వేను కూడా 95 శాతం మేర పూర్తి చేయాలన్నారు. ఆరోగ్యసమస్యలకు విలేజ్ హెల్త్ క్లినిక్ స్థాయిలో వైద్యసహాయం లభించకపోతే టెలి మెడిసిన్ ద్వారా జిల్లా స్తాయిలో వున్న హబ్ ను సంప్రదించి అక్కడినుండి సలహా సహకారం తీసుకుని ఆ మేరకు వైద్య సహాయం ప్రజలకు అందుబాటులోకి తేవాలన్నారు. అవసరమైతే సమీపంలోని ప్రాథమిక/సామాజిక ఆరోగ్య కేంద్రాలకు, తీవ్ర సమస్యలుంటే జిల్లా, ఆరోగ్యశ్రీ నమోదిత ఆస్పత్రులకు తరలించాలే వారికి సహకరించాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కానీ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో కానీ ఎక్కడా చూపించుకోని వారి పట్ల సిహెచ్ ఓలు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. పీహెచ సీ వైద్యుడు గ్రామాన్ని సందర్శించే ముందురోజు సిహెచోఓ, ఎఎన్ఎం, ఆశా వర్కర్లు రోగులను సందర్శించి వారిని విలేజ్ హెల్త్ క్లినిక్ కు వచ్చేలా అవగాహన కల్పించాలన్నారు.  గ్రామ స్థాయిలో ఆరోగ్య మిత్రల్లా వ్యవహరించాలన్నారు. ఏ రకమైన ఆరోగ్య వసతులు , చికిత్సలు ఎక్కెడెక్కడ వున్నాయనే సమాచారాన్ని వారికి అందజేసేలా పని చేయాలన్నారు. పూర్తి స్థాయిలో వారిని చైతన్య పర్చే గురుతరమైన బాధ్యత తీసుకోవాలన్నారు. మీ పనితీరు ను గ్రామీణులు ప్రసంశించేలా వుండాలన్నారు. ప్రజలు మాట్లాడటం మొదలు పెట్టాలన్నారు. సిహెచ్వోలపై సిఎంగారికి ఎంతో నమ్మకం వుందన్నారు. ఎఎన్ ఎం , ఆశాలను సమన్వయం చేసుకుంటూ సిహెచ్వోలే టీం లీడర్ గా వ్యవహరించాలన్నారు. పీహెచ్ సీ డాక్టర్ సలహా మేరకు మందులివ్వడం , జిల్లా హబ్ సలహా మేరకు సమీప ఆరోగ్య శ్రీ నెట్వర్క్ ఆసుపత్రికి పంపించేలా వారికి అవగాహన కల్పించడంలో సిహెచ్వోలు కీలకంగా వ్యవహరించాలన్నారు. ఆరోగ్య శ్రీ కింద చికిత్స తీసుకుని ఇంటికొచ్చొక సరిగా మందులు వాడుతున్నదీ లేనిదీ పర్యవేక్షించాలనీ , అక్కడ అందిన సేవలపై ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని సూచించారు. ఆసుపత్రిలో సేవలపై వారు సంతృప్తి గా వున్నారా లేదా అనే విషయాన్ని తెలుసుకోవాలన్నారు. సిఎంగారి లేఖను వారికి అందించాలన్నారు. గ్రామానికి ఎంఎంయు వచ్చే నాటికి స్థానికులందరినీ మొబిలైజ్ చెయ్యాలనీ డాక్టర్ సందర్శన ఫలవంతమయ్యేలా వారిలో చైతన్యం తీసుకురావాలన్నారు. టీం స్పిరిట్ తో పనిచేస్తే తప్ప అనుకున్న లక్ష్యాన్ని  చేరుకోలేరన్నారు

*గర్భిణుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి*

గర్భిణుల విషయంలో సిహెచ్వోలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కృష్ణ బాబు సూచించారు. ప్రసవానికి ముందు, తర్వాత వారికి తగిన సలహాలివ్వాలన్నారు. 

బిపి , షుగర్ సమస్యల పట్ల వారికి సరైన అవగాహన లేకపోతే భవిష్యత్తు లో ఎదురయ్యే పరిణామాల గురించి అర్థమయ్యేలా చెప్పాలన్నారు. వ్యక్తిగతంగా వెళ్లి వారిలో ఆత్మ విశ్వాసం కలిగించాలన్నారు. వారిలో ని అపోహలు తొలగించాలన్నారు. బిపి వంటి సమస్యల పట్ల ముందస్తు అవగాహన వుంటే భవిష్యత్ లో అనారోగ్యానికి గురికాకుండా బయటపడొచ్చన్న విస్తవాన్ని వారికి తెలియజెప్పాలన్నారు. గర్భిణుల లో రక్త హీనతను మంందుగానే గుర్తించి ప్రసవం అయ్యే వరకూ పర్యవేక్షించగలిగితే తల్లినీ బిడ్డనూ కాపాడిన వారవుతారన్నారు. హై రిస్క్ వున్న వారి విషయంలో మరింత బాధ్యత గా వ్యవహరించాలన్నారు. అంగన్వాడీ లకు వెళ్లి పౌష్టికాహారం గురించి ఆరా తీయాలన్నారు. అంగన్వాడీ వర్కర్ స్కూల్ టీచర్ లతో సమన్వయం చేసుకోవాలన్నారు. ఆర్ సిహెచ్ పోర్టల్ లో వివరాలు నమోదు చేస్తే పిల్లలు పుట్టాక కూడా పర్యవేక్షించేందుకు వీలుంటుంది అన్నారు. ఆర్ సిహెచ్ పోర్టల్ డేటాను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలన్నారు. అంగన్వాడీ సెంటర్ల లోని డేటా ను కూడా దగ్గర వుంటే మరింత ఉపయుక్తంగా వుంటుందన్నారు. అందరూ సమన్వయం తో పనిచేస్తేనే ఎనీమియాను నియంత్రణ లోకి తేగలరన్నారు. 

నూటికి నూరు శాతం ఇమ్యూనైజేషన్ పూర్తి కావాలన్నారు.

67 రకాల మందులు , 14 రకాల టెస్టుల్ని కింది స్థాయిలో అందుబాటులో వుంచామనీ ఏదైనా మందు దొరక్కపోతే సమీప పీహెచ్సీ నుండి తెప్పించుకోవాలన్నారు. మానసిక సమస్యల పరిష్కారం కోసం 14410 టెలీమానస్ నంబరును సంప్రదించాలన్నారు. శానిటేషన్, హైజిన్ లకు సిఎం గారు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. మనపైన సిఎం గారు పెట్టుకున్న నమ్మకానికి తగ్గట్టుగా అంకిత భావంతో పనిచేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమీషనర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.Comments
Popular posts
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది.
Image
Shiv Nadar University Chennai inaugurated its flagship Quiz Competition - QUBIZ
Image
మేలైన యాజమాన్య పద్ధతులు పాటించేలా చేసే రైతులకు సర్టిఫికేషన్
Image
ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు
Image
*ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
Image