జిల్లా స్థాయి జగనన్న క్రీడా సంబరాలను ఆర్.సి.ఎం ప్రాంగణంలో బుధ వారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ప్రారంభించారు

 
పార్వతీపురం, నవంబరు 30 (ప్రజా అమరావతి): 


రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు గిరిజన సంక్షేమ శాఖా మంత్రి పీడిక రాజన్నదొర అన్నారు. 


జిల్లా స్థాయి జగనన్న క్రీడా సంబరాలను ఆర్.సి.ఎం ప్రాంగణంలో బుధ వారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ప్రారంభించారు


. ఈ సంధర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ జగనన్న క్రీడా సంబరాలలో రాష్ట్ర స్థాయి విజేతలకు రూ.50 లక్షల నగదు బహుమతులు ప్రభుత్వం ప్రకటించిందని చెప్పారు. కబడ్డీ, వాలీబాల్, క్రికెట్ విభాగాల్లో జగనన్న క్రీడా సంబరాలు నియోజక వర్గ స్థాయి నుండి జరిగాయని, జిల్లా స్థాయి విజేతలు రాష్ట్ర స్థాయికి వెళతారని చెప్పారు. నియోజకవర్గ స్థాయి లో ఎంతో కష్టపడి జిల్లా స్థాయికి వచ్చారని, ఇదే ఉత్సాహంతో రాష్ట్ర స్థాయి లో కూడా గెలుపొంది జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని క్రీడాకారులకు సూచించారు.  గెలుపు ఓటములు సహజమని కానీ క్రీడా స్ఫూర్తి ముఖ్యమని ఆయన అన్నారు. గెలుపే లక్ష్యంగా సాధన చేయాలని ఆయన సూచించారు. క్రీడాకారులు ప్రతిభ చూపించాలి, జిల్లా కీర్తి ప్రతిష్టలను పెంచాలని ఆయన పిలుపునిచ్చారు. వ్యాయామ ఉపాధ్యాయులు విద్యార్థులను క్రీడలలో ప్రోత్సహించాలని ఆయన చెప్పారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడాలని ఆయన ఆకాంక్షించారు. క్రీడల్లో నైపుణ్యాలు పెంపొందించు కావాలని, ఉపాధ్యాయులు, శిక్షకులు కీలక టెక్నిక్ లలో తర్ఫీదు ఇవ్వాలని ఆయన సూచించారు. ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి మీ మేన మామ అని, మీరు బాగా చదువు కావాలని ఆకాంక్షిస్తున్నారు. ఓటమితో కృంగి పోరాదని, మరల ప్రయత్నం చేయాలని ఉద్బోధించారు. ఎవరికీ విజయం అంత సులువుగా రాదని, కష్టపడితేనే విజయం వరిస్తుందని తెలిపారు.  అపజయాలు విజయానికి సోపానాలని ఆయన పేర్కొన్నారు. ఒక క్రీడపై బాగా గురి పెట్టాలని సాధన చేయాలని సూచించారు. ఆకాశమే హద్దుగా ప్రయత్నించాలని, దేనినైనా సాధించగలను నమ్మకం ఉండాలని ఆయన హితబోధ చేశారు. దేనిలోనైనా పోటీ పడగలం అనే నమ్మకం ఉండాలని అన్నారు. విద్యార్ధులకు, క్రీడాకారులకు మెనూలో ముఖ్య మంత్రి ఎక్కడా తగ్గలేదని అన్నారు. మన జిల్లాకు క్రీడా ప్రాంగణం (స్టేడియం) అవసరం ఎంతో ఉందని, దానిని సాధించడానికి కృషి చేస్తానన్నారు. స్టేడియం విషయం ముఖ్య మంత్రి దృష్టికి తీసుకెళతానని ఆయన చెప్పారు. ఎన్ని ఆర్థిక సమస్యలు వచ్చినా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపిస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు.


పురపాలక శాఖ చైర్ పర్సన్ బి.గౌరీశ్వరి మాట్లాడుతూ జగనన్న క్రీడా సంబరాలలో మొదటి బహుమతి జిల్లాకు తీసుకురావాలని ఆకాక్షించారు.  జిల్లాలో చాలా మంది జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన క్రీడాకారులు ఉన్నారని, వారిని ఆదర్శంగా తీసుకోవాలని క్రీడాకారులకు సూచించారు. క్రీడలు శారీరక, మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయన్నారు. 


జాయింట్ కలెక్టర్ ఓ. ఆనంద్ మాట్లాడుతూ  నెలకు రెండు,మూడు కార్యక్రమాలను చేపట్టాలని జిల్లా క్రీడాసాధికారత అధికారులకు సూచించారు. గ్రామాల్లో ఉండే క్రీడాకారులను జిల్లా, రాష్ట్ర స్థాయి లో గుర్తింపు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. సచివాలయాలలోను స్పోర్ట్స్ క్లబ్ ఉందన్నారు. ప్రతీ క్రీడాకారుడు స్పోర్ట్స్ క్లబ్ లో వారి వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. నమోదు చేసుకున్న క్రీడాకారులకు క్రీడాసాధికారత శాఖ ద్వారా జరిగే పోటీలకు ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. ప్రతీ సంవత్సరం నియోజకవర్గ  స్థాయిలో పోటీలను నిర్వహించాలని అధికారులకు జేసీ సూచించారు. 


సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి విష్ణు చరణ్ మాట్లాడుతూ క్రీడాకారులు ఆటలో నిబద్ధత పాటించాలని అన్నారు. 


ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. జాతీయ స్థాయి క్రీడలలో పాల్గొన్న క్రీడాకారులను సత్కరించారు. క్రీడా పోటీలను ఉప ముఖ్యమంత్రి ప్రారంభించారు.


ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి డి. మంజుల వీణ, జిల్లా క్రీడల చీఫ్ కోచ్ ఎస్. వేంకటేశ్వర రావు, డి.ఎస్.పి ఎ.సుభాష్, అర్జున అవార్డు గ్రహీత ఎస్.జయరామ్, తహశీల్దారు శివన్నారాయణ, వ్యాయామ ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Comments