నేటి విద్యార్థులే రేపటి సమాజానికి సమాధానాలు



నేటి విద్యార్థులే రేపటి సమాజానికి సమాధానాలు



15-21 వయసు గల పిల్లల ప్రవర్తనను గమనించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై వుంది: జస్టిస్ ప్రవీణ్ కుమార్


తిరుపతి, నవంబర్ 05 (ప్రజా అమరావతి): నేటి విద్యార్థులే రేపటి సమాజానికి సమాధానాలు ఇవ్వవలసిన వారు మీరని , ఆదర్శ సమాజ నిర్మాణానికి చెడు వ్యసనాలకు ర్యాగింగ్ లకు పాల్పడకుండా మీ వంతు కృషి దేశానికి అవసరమని గౌ.రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి ప్రవీణ్ కుమార్ అన్నారు.


శనివారం ఉదయం స్థానిక కరకంబాడి రోడ్ ఎస్. వి . ఇంజనీరింగ్ కళాశాలలో మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు మాదకద్రవ్యాల నిర్మూలన, బాధితులకు న్యాయ సేవలు, ఆంధ్రప్రదేశ్ ర్యాగింగ్ నిషేధ చట్టం-1997 పై అవగాహనా సదస్సు కు ముఖ్య అతిథిగా ఏ.పి హై కోర్టు న్యాయమూర్తి మరియు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ APSLSA(ఆంధ్ర ప్రదేశ్ లీగల్ సర్విస్ అథారిటీ) జస్టిస్ సి. ప్రవీణ్ కుమార్ హాజరయి జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి ఈ .భీమారావు, మూడవ అదనపు జిల్లా జడ్జి వై.వీర్రాజు, జిల్లా ఎస్పీ పరమేశ్వర రెడ్డి , బార్ అసోసియేషన్ వై స్ ప్రెసిడెంట్ బి. మురళి మోహన్ అతిథులు గా హాజరయ్యారు. 


ఏ.పి హై కోర్టు న్యాయమూర్తి మరియు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ APSLSA(ఆంధ్ర ప్రదేశ్ లీగల్ సర్విస్ అథారిటీ) జస్టిస్ సి. ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ పిల్లల ఎంజాయ్మెంట్ వయసు 15 నుండి 21 వరకు ఉంటుందని తల్లిదండ్రులు జాగ్రత్తగా వారి ప్రవర్తనను గమనించాలని అన్నారు. ఈ వయసులోనే పిల్లలు చెడు అలవాట్లకు బానిస అయ్యే అవకాశం ఉంటుందని అన్నారు. విద్యార్థులుగా మీరు చెడు అలవాట్లకు లోనైతే ఆ ప్రభావం మీ తల్లిదండ్రులపై ఉంటుందని సమాజంలో వారు తలెత్తుకు తిరగలేరనేది గమనించాలని అన్నారు. తల్లిదండ్రులు మీపై ఎన్నో ఆశలతో విద్యావంతులను చేయడానికి కష్టపడతారని అన్నారు. తోటి విద్యార్థుల ప్రవర్తన మారుతుంటే గమనించాలని ఆ విషయాన్ని యాజమాన్యానికి కానీ తల్లిదండ్రులకు కానీ తెలియజేయాలని వెంటనే తప్పును సరిదిద్దుకునే అవకాశం కలుగుతుందని అన్నారు. మత్తు పదార్థాలకు మాదకద్రవ్యాలకు ర్యాగింగ్ కు అనేక చట్టాలు అమలు చేసి శిక్షలు వేయడం జరుగుతున్నదని అన్నారు. పేరా లీగల్ వాలంటీర్లు కూడా సమాజంలో మార్పులను గమనించాలని, ప్రవర్తనలో మార్పు ఉన్న వ్యక్తి విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసేలా ఉండాలని అప్పుడే సరైన మార్గంలో నడిపించుకునే అవకాశం వారికి కలుగుతుందని అన్నారు. తెలిసి చేసే తప్పులు, తెలియక చేసే తప్పులు ఉన్నాయని నా అనుభవంలో వాటిని గమనించానని అందులో ఒకటి హైదరాబాదు హై స్కూల్ వద్ద బడ్డీకొట్టు వ్యక్తి  కొన్ని రోజులపాటు ఉచితంగా జామకాయలు అందించాడని ఉప్పుకు బదులు మత్తు పదార్థాలను వాటికి రాసి ఇవ్వడంతో అలవాటు పడ్డారని తల్లిదండ్రులు గమనించి పరిశీలించగా జామకాయల వల్ల మత్తుకు బానిస అయ్యారని గ్రహించి చికిత్స అందించి కాపాడుకోగలిగారని అన్నారు. ఏదైనా చెడు అలవాట్లకు బానిస అయితే త్వరగా తెలుసుకోగలిగితే చికిత్సకు వీలు ఉంటుందని అన్నారు. అలాగే ర్యాగింగ్ కారణంగా ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారని కొన్ని ఉదాహరణ వివరించారు. ఇకపోతే కోవిడ్ సమయంలో దేశంలో 300 ఆన్లైన్ హరాష్మెంట్ కేసులు నమోదయ్యాయని అన్నారు. నేడు తిరుపతిలో ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించడానికి కారణం మత్తు పదార్థాల కేసులు నమోదవుతున్నాయని అన్నారు.  భావి పౌరులుగా సమాజంలో మీరు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తున్నానని అన్నారు. 


ఉమ్మడి జిల్లా ప్రిన్సిపల్ జడ్జి మాట్లాడుతూ జిల్లాలో 13 మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ లో పరిధిలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మత్తు పదార్థాల వల్ల మాదకద్రవ్యాల వల్ల , ర్యాగింగ్ వలన కలిగే నష్టాలను శిక్షలను ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని అన్నారు.    



జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కళాశాలలో సీనియర్లు వెల్కమ్ టు ద ప్రెషర్స్ డే నిర్వహించడం ఆ తరువాత వారిని బెదిరించడం ర్యాగింగ్ చేయడం మంచిది కాదని అన్నారు. విద్యార్థులలో స్నేహపూర్వక వాతావరణం చోటు చేసుకోవాలని క్షణికానందం కోసం మీరు చేసే ర్యాగింగ్ వలన జీవితాలు నాశనమవుతాయనేది గుర్తుంచుకోవాలని అన్నారు. ర్యాగింగ్ జరిగితే తప్పనిసరిగా కళాశాల యాజమాన్యం తోటి విద్యార్థులైనా తెలపాలని అన్నారు. ఎందుకంటే ర్యాగింగ్ చేసిన అతను తెలపడని ర్యాగింగ్ కి గురైన విద్యార్థి కుంగుబాటుతో చెప్పుకోలేక , చదువు కోలేక , ఉద్యోగం చేయలేక జీవితం నాశనం అవుతుందని అన్నారు. విద్యార్థులు పెడ తోవ పట్టి తప్పులు చేయరాదని , మీ భవిష్యత్తు మీద ప్రభావం చూపడమే కాకుండా సమాజంలో మీ కుటుంబ సభ్యులను హేళనగా చూస్తారనేది గ్రహించాలని అన్నారు. విద్యార్థులు తోటి విద్యార్థులలో ఏదైనా మార్పులు ఉంటే గ్రహించి వారి తల్లిదండ్రులకు కానీ, కళాశాల యాజమాన్యానికి కానీ, పోలీసులకు కానీ తెలియజేస్తే వారి భవిష్యత్తును చక్కదిద్దినవారు అవుతారని అన్నారు. చెడు వ్యసనాలకు బానిసై ఎక్కువమంది మధ్యతరగతి కుటుంబాల పిల్లలు చైన్ స్నాచింగ్ అటువంటి వాటికి పాల్పడుతున్నారని అన్నారు.


ఫ్యామిలి కోర్టు న్యాయమూర్తి అన్వర్ బాషా డ్రగ్స్, రాగింగ్ వల్ల పడే శిక్షలు , చేసిన నేరం బట్టి మరణ శిక్ష కూడా వుంటుందనీ, చట్టాలపై అవగాహన కల్పించారు. 


ఎన్. జి. ఓ . పాస్ సంస్థ ప్రతినిధి బాలకృష్ణా రెడ్డి సంస్థ ద్వారా  అందిస్తున్న కౌన్సెలింగ్ , అవగాహన కార్యక్రమాల పై వివరించారు.


మానసిక వైద్య నిపుణులు ఎన్. బి. సుధాకర్ రెడ్డి తాగితే వివేకం నశిస్తున్నదని, దాంపత్య జీవితంలో గొడవలు, యువత ర్యాగింగ్ తో చెడుచేసి ఆనందం పొందడం కాకుండా, చదువులో పోటీపడితే ఆనందం వస్తుందనేది గ్రహించాలని అన్నారు. 


ఎస్. వి. మెడికల్ కళాశాల సైకియాట్రిస్ట్ డా. మానస , ఆల్కహాల్, మత్తు పదార్థాల, మాదక ద్రవ్యాలు అడిక్షన్ వల్ల కలిగే దుష్ప్రభావాలు, జీవితాలపై ప్రభావం,  అడిక్షన్ సెంటర్ లలో అందించే వైద్య సేవలు వివరించారు.

ఎస్.వి.ఇఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఇక్కడ చదువుతున్న విద్యార్థుల్లో  ర్యాగింగ్ అలవాటు లేదని, మత్తు పదార్థాల బానిస అయిన డ్రైవర్ వల్ల మాతండ్రి ప్రాణాలు కోల్పాయరని ఆ లారీలో మందు బాటిల్ పెట్టుకుని డ్రైవ్ చేసారని తెలిపారు. 

సమావేశం ప్రారంభ సమయంలో జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్ పోలీస్ వందనం స్వీకరించిన అనంతరం కళాశాల అవరణలో ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్ అయిన సచివాలయ వ్యవస్థ, పాల సేకరణ , కుటుంబ సలహా కేంద్రం ,చైల్డ్ లైన్ 1098, మహిళా శిశు సంక్షేమ శాఖ పౌష్టికాహార , అంగన్వాడి సేవలు, వైయస్సార్ సంపూర్ణ పోషణ,  స్వయం సహాయ సంఘాల జీవనోపాదుల ప్రదర్శనలు , పోలీస్ దిశా , పెట్రోల్ వాహనాలు , స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో -14500 , దిశా -100, 112, 181, సైబర్ క్రైమ్ -9121211100, 8099999977, 1930, లోన్ యాప్స్ న్యూడ్ వీడియోలు వంటి స్టాల్స్ ను సందర్శించిన   ముఖాముఖి నిర్వహించిన జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్ వీరి వెంట జిల్లా కలెక్టర్ కె . వెంకటరమణ రెడ్డి, ప్రిన్సిపల్ డిస్టిక్ జడ్జి ఈ .భీమారావు, మూడవ అదనపు జిల్లా జడ్జి వై.వీర్రాజు, ఐ .కరుణ్ కుమార్ , జిల్లా ఎస్పీ పరమేశ్వర రెడ్డి , న్యాయమూర్తులు అన్వర్ భాష , వై .శ్రీనివాసరావు ఎన్ . శిరీష్, సిహెచ్ .పవన్ కుమార్ , పి . కోటేశ్వరరావు, ఇంజనీరింగ్ మరియు లా కళాశాల ల విద్యార్థులు స్టాల్స్ సందర్శించిన వారిలో ఉన్నారు.



Comments