మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి..... జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్, ఎస్పీ రాహుల్

 మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి..... 

జిల్లా కలెక్టర్  బసంత్ కుమార్, ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్ 



పుట్టపర్తి నవంబర్ 25 (ప్రజా అమరావతి):

సమాజంలోని మహిళలందరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్  బసంత్ కుమార్ పిలుపునిచ్చారు. 

శుక్రవారం ఉదయం పుట్టపర్తి ఎంపీడీవో కార్యాలయంలో ఐసిడిఎస్ శాఖ మరియు  డిఆర్డిఏ సంయుక్త ఆధ్వర్యంలో  ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం నిర్వహించుకునే  సందర్భముగా ముందస్తు కార్యక్రమంలో భాగంగా "ప్రపంచ స్త్రీలపై జరిగే హింస వ్యతిరేక పక్షోత్సవాల"  కార్యక్రమానికి  ముఖ్యఅతిథిగా పాల్గొని జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్ తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు.

  జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా నేటి నుండి డిసెంబర్ 10వ తేదీ వరకు 16 రోజులపాటు  మహిళలపై జరిగే హింస వ్యతిరేక దినం పక్షోత్సవాలు జరుపుకోవడం జరుగుతుందన్నారు. 1991 నుండి సామాజిక ఉద్యమకారులు కార్యకర్తలు ఈ పక్షోత్సవాలను నిర్వహించే విధంగా ప్రారంభించారని అన్నారు. ప్రస్తుతం లింగ వ్యత్యాస సూచిక లో 146 దేశాలలో భారతదేశం 135వ స్థానంలో ఉందని, మహిళలపై జరిగే హింసకు ప్రధాన కారణం పురుషా ధిక్యత మరియు పితృ సామ్య వ్యవస్థ అని తెలిపారు. రాతియుగంలో స్త్రీ పురుషులు ఇద్దరూ సమానంగా ఉన్నపాటికి కుటుంబ వ్యవస్థ ఏర్పడే క్రమంలో పురుషాధి క్యత సమాజంలో  మహిళలపై హింస ప్రారంభమైందనీ అన్నారు. అలాగే ప్రతి ముగ్గురు మహిళలు ఒకరు లింగ ఆధారిత హింసకు గురవుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. హింసకు గురవుతున్న మహిళల్లో దాదాపు 40 శాతం మంది ఎటువంటి సహాయం కోరడం తో పాటు సక్రమంగా అందడం లేదని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా జరిగే    మహిళ హత్యలలో 58% సన్నిహిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యులు ద్వారానే జరుగుతున్నట్లు తెలిపారు. అంతేగాక అనేక కారణాల వల్ల ప్రతి పదకొండు నిమిషాలకు ఒకరు ఈ రకంగా చనిపోతున్నారని,  నేషనల్ క్రైo రికార్డ్స్ బ్యూరో ప్రకారం ప్రతి 20 నిమిషాలకు ఒక మహిళ లైంగిక దాడికి గురవుతున్నట్లు వివరాల ద్వారా తెలియ వచ్చిందని తెలిపారు.  జిల్లా కలెక్టర్ మహిళల చే ప్రతిజ్ఞ   గావించారు

అనంతరం  జిల్లా ఎస్పీ  రాహుల్ దేవ్ సింగ్  మాట్లాడుతూ స్త్రీలపై జరుగు హింసకు వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలు, మరియు స్త్రీలపై హింసకు పాల్పడుతున్న వారి పట్ల నమోదుతున్న సెక్షన్లు  మరియు  వారికి విధిస్తున్నటువంటి శిక్షలు మొదలైన వాటి గురించి తెలియజేశారు. నేటికీ కూడా దేశంలో చాలామంది స్త్రీలకు గృహింస చట్టంపై సరైన అవగాహన లేదని అందువలన ప్రతి స్త్రీ కూడా ప్రభుత్వం వారికి ఇవ్వబడిన హక్కులు చట్టాల గురించి పూర్తి అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తద్వారా ఈ చట్టాల ద్వారా  భౌతిక హింసలు, భౌతిక దాడుల నుంచి రక్షణ పొందగలరని తెలియజేశారు. దేశంలో 29 శాతం స్త్రీలు నేటికీ కూడా గృహాహింస గురవుతున్నట్టు  ఐదవ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే తెలియజేస్తుందని, వారిలో కూడా 18 సంవత్సరాల నుండి 34 సంవత్సరాల లోపు ఉన్న స్త్రీలే ఎక్కువ శాతం గృహా హింస కు, భౌతిక దాడులకు గురవుతున్నారని ఐక్యరాజ్యసమితి నివేదిక తెలుపుతున్నదని తెలిపారు. కావున ప్రతి స్త్రీ కూడా  ప్రభుత్వం ద్వారా వారి రక్షణ కోసం చేయబడిన చట్టాల గురించి తెలుసుకున్న రోజే వారు ఈ హింస నుండి విముక్తి పొందగలరని కావున ప్రతి ఒక్క స్త్రీ వారి రక్షణ కోసం ఏర్పాటు చేసిన చట్టాల గురించి అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మరియు ఈ హింస నుండి విముక్తి పొందడానికి ఏ స్థాయిలోనైనా పోలీసులు వారి సహాయ సహకార ఎల్లప్పుడూ ఉంటాయని కావున ఎవరైనా సరే ఇలాంటి హింసకు బాధితులుగా ఉన్నట్లయితే నిర్భయంగా పోలీసులు ఆశ్రయించవచ్చని తద్వారా వారికి రక్షణ కల్పించబడుతుందని మరియు ఎవరైతే వారిపై హింసకు మరియు దాడికి పాల్పడతారో  వారిని చట్టం ద్వారా శిక్షించబడుతుందని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఎ పిడి నరసయ్య, ఐసిడిఎస్ పిడి  లక్ష్మీ కుమారి, ఎంపీడీవో అశోక్ కుమార్ రెడ్డి, ఎంపీపీ రమణారెడ్డి ,నోడల్ ఆఫీసర్  గాయత్రి,  ఐసిడిఎస్ శాఖ పర్యవేక్షకుడు ఉమామహేశ్వర్ గాయత్రి కౌన్సిలర్ ఉమాదేవి జిల్లాలోని శిశు అభివృద్ధి పథక అధికారులు, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Comments