విద్యార్థులు పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలి
జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్
పుట్టపర్తి, నవంబరు 14 (ప్రజా అమరావతి) ః
ప్రతీ విద్యార్ధీ పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్ బసంత కుమార్ పేర్కొన్నారు . స్థానిక కలెక్టరేట్లోని స్పందన హాలు నందు జిల్లా గ్రంథాలయ సంస్థ పౌర గ్రంథాలయ శాఖ సోమవారం నిర్వహించిన 55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలకు జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు . బాలల దినోత్సవం సందర్భంగా జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించా రూ ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రపంచాన్ని అర్ధం చేసుకోవడానికి పుస్తకాలు ఒక మార్గమని సూచించారు. ప్రతీదీ స్వయంగా చూసి, అనుభవించి తెలుసుకోవడం కంటే, పుస్తకాలను చదవడం ద్వారా కూడా ఆయా అంశాలపట్ల అవగాహన కల్పించుకోవచ్చునని చెప్పారు. కాల్పానికి సాహిత్యం కంటే, మహనీయుల జీవిత చరిత్రలు, వారు రాసిన పుస్తకాలు, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన అంశాలను అధ్యయనం చేయాలని సూచించారు. పుస్తకాలు చదివి ఆనందించే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని కోరారు. పుస్తకాలను చదవడం ద్వారా భాషా పరిజ్ఞానం, సృజనాత్మకత కూడా అలవడుతుందని అన్నారు. పాఠశాలల్లో పుస్తకాల క్లబ్‌లను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతీ విద్యార్థి 10
తరగతికి వచ్చేటప్పటికే ఒక స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని, దానిని సాధించేవిధంగా తమ విద్యాప్రణాళికను రూపొందించుకోవాలని కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ యాల్. యం. ఉమా మోహన్ రెడ్డి, మాజీ గ్రంధాలయ చైర్మన్ యల్. యం. మోహన్ రెడ్డి, గ్రంధాలయ కార్యదర్శి రమా, డిప్యూటి లైబ్రేరియన్ సుబ్బత్నమ్మ, గ్రంధాలయ అధికారి కటిక జయరాం,వీరనారయనారెడ్డి , కాజా,వెంకటరమణ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు
addComments
Post a Comment