వచ్చే పదిహేను రోజుల్లో జిల్లాలో బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేపట్టాలి : ఎస్.సి.కమిటీ ఛైర్మన్ గొల్ల బాబూరావు

 విజయనగరం జిల్లా (ప్రజా అమరావతి):

 జిల్లా అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో సమావేశమైన ఎస్.సి. సంక్షేమ శాసనసభ కమిటీ 


 ఛైర్మన్ గొల్ల బాబూరావు అధ్యక్షతన జిల్లా అధికారులతో ఎస్.సి  రిజర్వేషన్ల అమలు, పథకాల అమలుపై అధికారులతో కమిటీ సమీక్ష


 వచ్చే పదిహేను రోజుల్లో జిల్లాలో బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేపట్టాలి : ఎస్.సి.కమిటీ ఛైర్మన్ గొల్ల బాబూరావు బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత శాఖల అధికారులపై చర్యలకు సిఫారసు చేస్తాం


 ఎస్.సి. వర్గాల వారికి ఇళ్ల మంజూరు, నిర్మాణంపై సంతృప్తి వ్యక్తం చేసిన ఎస్.సి.కమిటీ


 మండలాల వారీగా సదరం క్యాంపు లు నిర్వహించి అర్హులైన దివ్యాంగులకు ధ్రువ పత్రాలు మంజూరు చేయాలని సూచించిన కమిటీ ఛైర్మన్ గొల్ల బాబూరావు


 ఎస్.సి. సంక్షేమ వసతి గృహాలకు శాశ్వత భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వానికి సిఫారసు చేయనున్నట్టు తెలిపిన కమిటీ ఛైర్మన్ గొల్ల బాబూరావు


 సమావేశంలో పాల్గొన్న కమిటీ సభ్యులు అలజంగి జోగారావు, కంబాల జోగులు, చిట్టిబాబు, ఎమ్మెల్సీ శ్రీనివాసులు రెడ్డి, రఘు రాజు


 సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ శ్రీమతి సూర్యకుమారి, జిల్లా ఎస్.పి. దీపిక, జె.సి. మయూర్ అశోక్, సాంఘిక సంక్షేమ శాఖ డి.డి. సుధాకర్, డి.ఆర్.ఓ. ఎం.గణపతి రావు, జిల్లా అధికారులు

Comments