ఆధునిక కవి, తత్వవేత్త, సంగీత కారుడు శ్రీ కనకదాసు సమాజానికి అందించిన సేవలు ఎనలేనివి*
*శ్రీ కనకదాసు చేసిన సేవలు ప్రతి ఒక్కరికి ఆదర్శం*
భక్త కనకదాసు అందరివాడు
జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్
కనకదాసు భారతీయ తత్వవేత్త, సంగీత కారుడు మరియు కవి
కుల వివక్షత భక్తి మార్గంలో పోరాటం చేసిన మహనీయుడు
హిందూపురం పార్లమెంటు సభ్యుడు గోరంట్ల మాధవ
పుట్టపర్తి, నవంబర్ 11 (ప్రజా అమరావతి):
ఆధునికకవి, తత్వవేత్త, సంగీత కారుడు, స్వరకర్త శ్రీ కనకదాసు సమాజానికి అందించిన సేవలు ఎనలేనివని జిల్లా కలెక్టర్ బసంత కుమార్ కొనియాడారు.
శుక్రవారం శ్రీ కనకదాసు జయంతి సందర్భంగా... స్థానిక కలెక్టరేట్లో మినీ కాన్ఫరెన్స్ హాలు నందు జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్, హిందూపురం పార్లమెంటు సభ్యులు గోరంట్ల మాధవ, శ్రీ కనకదాసు గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.... వెనుకబడిన తరగతులకు చెందిన శ్రీ కనకదాస 1905-1609 కాలంలో జీవించిన గొప్ప భక్తుడు ఆధునిక కవి, తత్వవేత్త, సంగీత కారుడు, స్వరకర్త కనకదాసు ఆనాడు సమాజానికి అందించిన సేవలు ఎనలేనివన్నారు. అప్పట్లో శ్రీ కనకదాసు వెనుకబడిన కులాల వారి సంక్షేమం కోసం అత్యంత ప్రాధాన్యత నిచ్చిన గొప్ప మహానుభావుడన్నారు. వెనుకబడిన కులాల వారు అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లేందుకు తమ సామాజిక బాధ్యతగా ఎనలేని కృషి చేశారన్నారు. కురుబ కులాల జీవనోపాధికి ఆయన చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు.అప్పట్లో ఇతర హరిదాసుల్లాగే ఈయన కీర్తనల్లో సాధారణ కన్నడ భాషను ఉపయోగించేవాడని ఇంతటి గొప్ప ఆధునిక కవి శ్రీ కనకదాసు ప్రతి ఒక్కరికి ఆదర్శమన్నారు. కనకదాసు కు ఉడిపి తో ఒక ప్రత్యేక అనుబంధం ఉంది ఉడిపిలోని తేరుబజారులు ప్రవేశించినప్పుడు గంభీరమైన కనక గోపురం ప్రతి వారిని,దృష్టిని ఆకర్షిస్తుంది. గోపురం కింద కనకన కిటికీ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అన్ని జిల్లాలలో భక్త కనకదాసు ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉందని తెలిపారు .ఎందరో పుణ్య పురుషులు ఆధ్యాత్మిక జీవన విధానంతో ఈ సమాజానికి మార్గదర్శకులుగా నిలిచారు అట్టువారిలో భక్త కనకదాసు ప్రముఖుడని పేర్కొన్నారు. భక్తిఉద్యమంలో కబీర్ దాసు కు తెలుగులో అన్నమయ్య సమ కాలుకుడని తెలిపారు అనంతరం ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ వేమన, భక్త కనకదాసు సమాజంలో కుల వివక్షపై భక్తి మార్గం ద్వారా పోరాటం చేసిన గొప్ప సంఘసంస్కర్తాన్ని కనకదాసు కొనియాడారు. భక్తి మార్గంలో దైవ సన్నిధిలో చేరుకోవాలని ఉడుపులోని శ్రీకృష్ణ దేవాలయము నందు, పూజారులు కనక దాసుకు శ్రీకృష్ణ దర్శనానికి అనుమతి నిరాకరించారు. శ్రీకృష్ణుని దర్శించుకుని శ్రీకృష్ణుని విగ్రహం మాత్రం ఉడిపి నందు పడమర ముఖంగా ఉంటుంది. భక్త కనకదాసు అందరివాడు. ఏ వర్గానికి మతానికి చెందినవాడు. ఇతనుభారతీయ ఇతిహాసానికి ఆత్మౌంటివాడు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ రోజు రాష్ట్రంలోని అన్నిజిల్లాలలోని కనకదాసు జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారని తెలిపారు కురబ కులస్తులు చైతన్య పరసి వాళ్ళని అభివృద్ధి పథంలో పయనించే విధంగా మనందరం కలిసికట్టుగా కృషి చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పుడ చైర్మన్ శ్రీమతి లక్ష్మీనరసమ్మ, డిఆర్ఓ కొండయ్య, కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ మాధవప్ప, ఎంపీపీవీ రమణారెడ్డి, ఆది నారాయణ, ముత్యాలప్ప, బిసి కార్పొరేషన్ అధికారి శ్రీమతి నిర్మల జ్యోతి, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి శివ రంగ ప్రసాద్, గిరిజన సంక్షేమ అధికారి, మోహన్ రావు, ఎంఈఓ గోపాలకృష్ణ, బిసి సంక్షేమ శాఖాసిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment