ఏపీలో జేసీబీ పాలన నడుస్తుంది.

 ఇప్పటం లో నారా లోకేష్...

అమరావతి (ప్రజా అమరావతి);

ఏపీలో జేసీబీ పాలన నడుస్తుంది.


వైసిపి ప్రభుత్వం అధికారిక వాహనం జేసీబీ. 

జగన్ రెడ్డి విధ్వంసానికి బ్రాండ్ అంబాసిడర్. 

జగన్ రెడ్డి కి కట్టడం రాదు... కూల్చడం ఒక్కటే వచ్చు. 

సొంత నియోజకవర్గం పులివెందులలో బస్ స్టాండ్ కూడా నిర్మించలేని జగన్ రెడ్డికి కూల్చే హక్కు లేదు. 

జగన్ రెడ్డి పెద్ద సైకో... ఆర్కే చిన్న సైకో

రోడ్లు వేస్తేనో, పేదలకు ఇళ్ళు కడితేనో, ఉద్యోగాలు ఇస్తేనో నాయకుడికి ఆనందం వస్తుంది. 

పెద్ద సైకో.. చిన్న సైకో అలా కాదు.. విధ్వంసం... పేదల ఇళ్ళు కూలిస్తేనో, టిడిపి నాయకుల ఇళ్ళు కూలిస్తేనో వీళ్లకు ఆనందం వస్తుంది.

పేదల ఇళ్ళు జేసీబీతో కూల్చే వీడియోలు టివిలో చూసి ఆనందం పడే రకం ఈ పెద్ద సైకో, చిన్న సైకో. 

ప్రజా వేదిక కూల్చడం తో జగన్ రెడ్డి జేసీబీ పాలన మొదలుపెట్టాడు.

టిడిపి సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు గారి ఇంటి గోడ కూల్చారు, సబ్బం హరి గారి ఇంటి గోడ కూల్చారు, గీతం యూనివర్సిటీ గోడ కూల్చారు. 

రోడ్డు కి అడ్డంగా గోడలు కట్టడం, ప్రతిపక్ష నాయకుల పంట తగలబెట్టడం, ప్రతిపక్ష నాయకుల ఇళ్ళు కూల్చడం వీళ్లకు ఫ్యాషన్ గా మారిపోయింది. 

పెద్ద సైకో జగన్ రెడ్డి మూడున్నర ఏళ్ల పాలనలో మొత్తం రాష్ట్రాన్నే కూల్చేసాడు.

చిన్న సైకో ఆళ్ల రామకృష్ణా రెడ్డి మూడున్నర ఏళ్లలో మంగళగిరి ని కూల్చేసాడు. 

మంగళగిరిని డిస్ట్రక్షన్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా మార్చేసారు. 

పేదల ఇళ్ళు కూల్చడానికి ఎమ్మెల్యే ఆర్కే ఏకంగా సొంత జేసీబీ కొన్నాడు. 

ఆత్మకూరు-72 ఇళ్ళు, పేరుకలపూడి-16 ఇళ్ళు మరియు షాపులు, పెదవడ్లపూడి-50 ఇళ్ళు మరియు షాపులు, అమరారెడ్డి కాలనీ-300 ఇళ్ళు, నూతక్కి-15 ఇళ్ళు,  ప్రకాష్ నగర్, డోలాస్ నగర్- 30షాపులు, 20 ఇళ్ళు, నులకపేట-3షాపులు ఇలా అన్ని చోట్లా వందల సంఖ్యలో పేదల ఇళ్ళు కూల్చారు. కురగల్లు-250 ఇళ్ళకు , నిడమర్రు-50 ఇళ్ళకు నోటీసులు ఇచ్చారు

ముఖ్యమంత్రి ఇంటి పక్కన పేదల ఇళ్ళు ఉండటానికి వీలు లేదట. 

జగన్ రెడ్డి గారి ప్యాలస్ పక్కన పేదల ఇళ్ళు ఉండటానికి వీలు లేదు... ప్యాలస్ అందం పోతుంది అని పేదల ఇళ్ళు కూల్చేసిన దుర్మార్గులు వీళ్లు. 

అన్ని చోట్లా ఇళ్ల కూల్చివేతలకు వ్యతిరేకంగా టిడిపి పోరాటం చేసింది. న్యాయ సహాయం చేసి కొన్ని చోట్ల కూల్చివేతలు అడ్డుకోగలిగాం. 

ఇప్పటం లో జరిగింది మరీ అన్యాయం. 

కేవలం రాజకీయ కక్షతోనే ఇక్కడ ఇళ్ళు కూల్చేసారు. 

రోడ్డు మీద గుంతలు పూడ్చలేని చెత్త ప్రభుత్వం రోడ్డు విస్తరణ అంటూ ఇళ్ళు కొట్టేయడం విడ్డూరంగా ఉంది. 

దేశంలోనే అత్యంత చెత్త రోడ్లు ఉన్నది ఏపీలోనే...ఒక్క గుంత పూడ్చలేదు...ఒక్క కొత్త రోడ్డు వెయ్యలేదు. 

కానీ ఇప్పటంలో రోడ్డు విస్తరణ చేస్తామంటూ ఇళ్ళు కూల్చేసారు. 

ఇప్పటం ఒక చిన్న గ్రామం...ఊరి బయట కేవలం 20 అడుగుల రోడ్డు మాత్రమే ఉంది. 

కనీసం బస్సు సౌకర్యం కూడా లేని ఊరి రోడ్డుని 120 అడుగులు వెడల్పు చెయ్యడానికి కారణం కేవలం రాజకీయ కక్షసాధింపు.  

రాష్ట్రంలో ఎక్కడా లేని రోడ్డు విస్తరణ ఇప్పటంలోనే ఎందుకు జరిగింది? 

జనసేన సభకి భూములు ఇవ్వడం తప్పా? వైసిపి తప్ప ఇతర పార్టీలు సభలు నిర్వహించుకోకూడదా?

జనసేన సభకి భూములు ఇచ్చారని, పోయిన ఎన్నికల్లో ఈ గ్రామంలో టిడిపి కి మెజారిటీ వచ్చిందనే కోపంతోనే ఇళ్లను కూల్చేసారు. 

గ్రామస్తులు సొంత డబ్బుతో కట్టుకున్న శ్రీకృష్ణదేవరాయ కమ్యూనిటీ హాల్ కి వైసిపి రంగులా? వైఎస్ గారి పేరా?

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు కూడా నేను ఒక్కటే చెప్పా...జగన్ రెడ్డి కట్టింది ఏదైనా ఉంటే వైఎస్ గారి పేరు పెట్టుకోవచ్చు మాకు ఏ అభ్యంతరం లేదు. కానీ అసలు మీకు సంబంధం లేని వాటికి పేర్లు ఎలా మారుస్తారు సిగ్గుగాలేదా?

టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటెనే కమ్యూనిటీ హాల్ ని మరింత అభివృద్ధి చేస్తాం. శ్రీకృష్ణదేవరాయ పేరు పెడతాం. 

చెరువు తవ్వి 3 కోట్ల రూపాయిలు కొట్టేసిన వైసీపీ నాయకుల్ని చిప్పకూడు తినేలా చేస్తాం. 

అక్రమాలను బయట పెట్టిన వారిపై అక్రమ కేసులు బనాయించారు. ప్రభుత్వం మారిన వేంటనే అక్రమ కేసులు పెట్టిన అధికారుల పై చర్యలు తీసుకుంటాం. 

అక్రమంగా చెరువులో తవ్విన మట్టిని గ్రామంలో రైతులకు ఒక్క ట్రాక్టర్ కూడా ఇవ్వకపోగా, కేవలం ఒక సామాజిక వర్గం వారి పొలాలకు  మాత్రమే రోడ్లు వేసుకునేందుకు వాడుకోవడం దారుణం. 

ఇప్పటం గ్రామస్తుల పోరాటానికి టిడిపి అండగా ఉంటుంది. 

కులాలు చూసి ఇళ్ళు కూల్చేసే దుర్మార్గులు వీళ్లు. 

లోకేష్ గెలిస్తే ఇళ్లు కూల్చేస్తాడు అని ఎమ్మెల్యే ఆర్కే ఆరోపణలు చేశాడు...ఇప్పుడు మంగళగిరి లో పేదల పొట్ట కొడుతూ ఇళ్లు కూలుస్తుంది ఎమ్మెల్యే ఆర్కే.

టిడిపి గెలిచిన తరువాత తాడేపల్లి ప్యాలస్ మీద నుంచి ఫ్లై ఓవర్ వేస్తాం అని ప్యాలస్ కుల్చేస్తే జగన్ పరిస్థితి ఎంటో ఆలోచించు కోవాలి.

జగన్ రెడ్డి పడగొడితే... మేము నిలబెడతాం.

పెద్ద సైకో.. చిన్న సైకో లను ప్రజలను కూల్చేయడం ఖాయం.

పేదల ఇళ్ళు కూల్చిన జగన్ రెడ్డి కూలిపోతాడు. 

సైకో పాలన పోతుంది... సైకిల్ పాలన వస్తుంది.

Comments