మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ సేవలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలి జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్

 మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ సేవలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలి


జిల్లా కలెక్టర్  బసంత్ కుమార్




పుట్టపర్తి, నవంబర్ 11 (ప్రజా అమరావతి): 


*భారత రత్న, భారతదేశ మొదటి కేంద్ర విద్యా శాఖ మంత్రి మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ సేవలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్  బసంత్ కుమార్  పేర్కొన్నారు.  శుక్రవారం  స్థానిక కలెక్టరేట్లోని  ఉన్న మినీ కాన్ఫరెన్స్ హాల్లో భారతదేశ మొదటి కేంద్ర విద్యా శాఖ మంత్రి మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ 135 వ  జయంతి ఉత్సవాలవేడుకల సందర్భంగా అబ్దుల్ కలామ్ ఆజాద్ చిత్రపటానికి జిల్లా కలెక్టర్  బసంత్ కుమార్, డిఆర్ఓ కొండయ్య, తదితరులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జన్మదినాన్ని జాతీయ విద్యా దినోత్సవంగా,  మరియు మైనారిటీ వెల్ఫేర్ దినోత్సవంగా జరుపుకుంటున్నామని అన్నారు.  ఇస్లాం యొక్క ప్రధాన తీర్థయాత్ర ఇంద్రమైన మక్కాలో జన్మించారు. అతని తల్లి ధనిక అరేబియా షేక్ కుమార్తె మరియు అతని తండ్రి  ఆఫ్గాన్ చెందిన బెంగాలీ ముస్లిం, స్వతంత్రంతోపాటు  సెక్యులరిజంపై నమ్మిన వ్యక్తి, ఇండియా విన్స్ ఫ్రీడం  అనే పుస్తకాన్ని రచించిన గొప్ప మేధావి. 14 సంవత్సరాలు  జైలు శిక్ష అనుభవించిన వ్యక్తి. భారతదేశంలో మరణించాడు దేశానికి స్వతంత్రం వచ్చిన అనంతరం మొదటి కేంద్ర విద్యా శాఖ మంత్రిగా ఉన్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ తన సాహిత్యం, రచనలు, మేధో సంపత్తి ద్వారా దేశానికి ఎన్నో సేవలు చేశారని, దేశ ప్రజానీకానికి మార్గదర్శకుడిగా ఉంటూ గొప్ప దార్శనికతతో దేశాన్ని ముందుకు నడిపారన్నారు. భారత రత్న మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ దేశ మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా ఉన్నారని, సైన్స్ అండ్ కల్చర్ కి, విద్య అనుబంధ రంగాలకు కూడా మంత్రిగా పని చేశారని, విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి అని, స్వతంత్య సమరయోధులుగా, కవిగా, రచయితగా, పాత్రికేయులుగా, విద్యావేత్తగా ఆయన సేవలు చిరస్మరనీయం అన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలన్నారు.  శ్రీ సత్య సాయి జిల్లాలో ముస్లింల అక్షరాస్యత శాతం రాష్ట్ర యావరేజ్ కన్నా తక్కువగా ఉందని, స్త్రీ అక్షరాస్యత శాతంలో తక్కువగా  ఉందని పేర్కొన్నారు

విద్యార్థులను అందర్నీ చేర్పించాలని, అందరికీ విద్య అందించాల్సిన బాధ్యత మండల, జిల్లా స్థాయి విద్యా శాఖ అధికారులు, రిసోర్స్ పర్సన్ లు అందరిపైనా ఉందన్నారు.  విద్యార్థులందరినీ పాఠశాలల్లో చేర్పించి మంచి విద్యను అందించాలన్నారు.


ఈ కార్యక్రమంలో మైనారిటీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి మహమ్మద్ రఫీ, మైనారిటీ కార్పొరేషన్  సూపర్డెంట్ రామ్మూర్తి ,కలెక్టరేట్ సూపరింటెండెంట్లు, కలెక్టరేట్ సిబ్బంది, ఇతర ముస్లిం పెద్దలు తదితరులు పాల్గొన్నారు.



Comments