మరో వెయ్యి గ్రామాల్లో పౌష్టికాహార ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమం

 


మరో వెయ్యి గ్రామాల్లో పౌష్టికాహార ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమం



ఎపి రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ టి.విజయ్ కుమార్


అమరావతి (ప్రజా అమరావతి);:

సురక్షితమైన, ఆరోగ్యకరమైన పౌష్టికాహారాన్ని అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు ముందు కేస్తోందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ, సహకార రంగం ప్రభుత్వ సలహాదారులు, ఎపి రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ టి.విజయ్ కుమార్ అన్నారు. ఈ చర్యల్లో భాగంగా రాష్ట్రంలో మరో వెయ్యి గ్రామా ల్లో ఆరోగ్య పౌష్టికాహార కార్యక్రమాన్ని విస్తరించనున్నట్లు తెలిపారు. యిప్పటికే రాష్ట్రంలో 15 జిల్లాల్లో 129 గ్రామాల్లో చేపట్టిన ఈ కార్యక్రమం మంచి ఫలితాలనివ్వడంతో అన్ని జిల్లాల్లోనూ సుమారు వెయ్యి గ్రామాల్లో దీన్ని నిర్వహించనున్నామన్నారు. వైద్య ఆరోగ్య శాఖతో కలిసి ఈ కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.

మంగళవారం ఏపీ సచివాలయంలోని వైద్య ఆరోగ్య శాఖ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ఎవాల్యుయేషన్ అండ్ పాలసీ అడ్వయిజరీ కమిటీ రెండవ సమావేశంలో ఆయన మాట్లాడారు. పోషకాహార ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో ప్రకృతి సిద్ధమైన సేద్యాన్ని ప్రోత్సహించేందుకు గాను పెద్దఎత్తున సేంద్రియ పద్ధతుల్ని చేపట్టడం, తద్వారా చేకూరే ప్రయోజనాలపై పరిశోధన జరుగుతోందని ఆయన అన్నారు. కమ్యూనిటీ ఆధారిత ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించడం ద్వారా మెరుగైన ఫలితాలను సాధించవచ్చన్నారు. అనకాపల్లి, విశాఖపట్నం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో యిడెన్ బర్గ్ యూనివర్సిటీ వారు బేస్ లైన్ స్టడీ చేపట్టారని, ముఖ్యంగా మూత్రం, రక్త పరీక్షలతో పాటు వారు తీ సుకునే ఆహారం వంటి విషయాలపై అధ్యయనం చేశారని విజయ్ కుమార్ తెలిపారు. రసాయన ప దార్థాలు గల ఆహారాన్ని తీసుకోవడం వల్ల మనుషులు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడడమే కాకుండా క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు కూడా బలికావాల్సి వస్తోందన్నారు. పంటలకు పురుగు మందుల్ని వాడడం వల్ల పలు ప్రమాదకరమైన రసాయనాలు ఆహార పదార్థాల్లో చేరుతున్నాయని, దీంతో మెదడు పెరుగుదలలో లోపం, న్యూరలాజికల్ డిజార్డర్స్ వంటి సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. స్థూలకాయం, మధుమేహానికి కూడా యిలాంటి ఆహార పదార్థాలే కారణమన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు మాట్లాడుతూ ముఖ్యంగా గర్భిణిలు, బాలింతలు, శిశువు

లపై ఆరోగ్య పౌష్టికాహార ప్రభావం మరింత ఎక్కువగా వుంటుందన్నారు. గర్భిణిలలో రక్తహీనత విష యంలో మరింత శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరముందన్నారు. తల్లులు, పిల్లల ఆరోగ్య పరిరక్షణకు సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోందన్నారు. రైతు సాధికార సంస్థ సహకారంతో తమ శాఖలో గ్రామ స్థాయిలో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు(గతంలో ఎంఎలెహెచ్ఎ్పలు) లకు ఆరోగ్య పౌష్టికాహార పరిరక్షణకోసం ప్రత్యేక శిక్షణ యిస్తామని ఈ సందర్భంగా కృష్ణబాబు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని అమలుచేసే క్రమంలో దీన్నికూడా పరిగణలోకి తీసుకుంటామన్నారు. ఫ్యామిలీ డాక్టర్ విధానంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు కీలకంగా వ్యవహరిస్తున్నారని కృష్ణబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు.

పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుడితి రాజశేఖర్, ఐసిడిఎస్ కమీషనర్ డాక్టర్ సిరి, యిడెన్ బర్గ్ యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్ లిండ్సే జాక్స్, డాక్టర్ రాజగోపాల్, డాక్టర్ రామాంజనేయులు, పూర్ణి మా ప్రభాకర్, లక్ష్మీదుర్గ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Comments